• నవోదయ బుక్ హౌస్ – హర్షణీయంలో
  నవోదయ బుక్ హౌస్ – హర్షణీయంలో

  నవోదయ బుక్ హౌస్ ని సాంబశివరావు గారు , కోటేశ్వర రావు గారు కలిసి, కాచిగూడ హైదరాబాద్ లో స్థాపించి, గత మూడు దశాబ్దాల పైబడి తెలుగు పుస్తకాలను పాఠకులకు అందచేస్తున్నారు. నవోదయ పబ్లిషింగ్ ద్వారా మంచి సాహిత్యాన్ని ప్రచురిస్తున్నారు. ఈ ఎపిసోడ్ లో సాంబశివరావు గారు పుస్తకాలతో తనకున్న దాదాపు యాభై ఏళ్ళ సాన్నిహిత్యాన్ని, అమ్మకంలో , ప్రచురణలో తన అనుభవాలను మనతో పంచుకున్నారు.ఎపిసోడ్ చివరన కోటేశ్వర రావు గారు కూడా పాల్గొనటం జరిగింది. వారికి…

 • అచ్చ తెనుగు కథ, ‘తలుపు’ : తమిళ మూలం – కి. రాజనారాయణన్
  అచ్చ తెనుగు కథ, ‘తలుపు’ : తమిళ మూలం – కి. రాజనారాయణన్

  ఈ ఎపిసోడ్ లోని కథ ‘తలుపు’ – తమిళ మూలం రచయిత కి.రాజనారాయణన్. తెలుగు వారైన కి. రాజనారాయణన్ తమిళంలో సుప్రసిద్ధ రచయిత. కేంద్ర సాహిత్య పురస్కార గ్రహీత. ఈ కథను స. వెం రమేశ్ గారు తెలుగులోకి అనువదించారు. ఈ కథ ‘తెన్నాటి తెమ్మెర’ కథా సంకలనంలో చోటు చేసుకుంది. ఈ సంకలనంలోని కథలన్నీ కూడా తెలుగు మూలాలున్న తమిళ రచయితలు రాసినవి. అన్ని తమిళ మూల కథలను రమేశ్ గారే తెలుగు లోకి అనువదించారు.

 • తెలుగు వారి తమిళ కథలు – ‘తెన్నాటి తెమ్మెర’ కథాసంకలనం గురించి స.వెం. రమేష్ గారితో.
  తెలుగు వారి తమిళ కథలు – ‘తెన్నాటి తెమ్మెర’ కథాసంకలనం గురించి స.వెం. రమేష్ గారితో.

  ఈ ఎపిసోడ్ లో శ్రీ. స. వెం. రమేశ్ తాను సేకరించి సంపాదకీయం వహించిన ‘తెన్నాటి తెమ్మెర’ కథాసంకలనాన్ని మనకు పరిచయం చేస్తారు. ఈ కథలన్నీ కూడా తెలుగు మూలాలున్న తమిళ రచయితలు రాసినవి. తమిళ మూల కథలను రమేశ్ గారే తెలుగు లోకి అనువదించారు.

 • ‘Brotherless Night’ -The novel about a family in the midst of Srilankan Civil War
  ‘Brotherless Night’ -The novel about a family in the midst of Srilankan Civil War

  NEW YORK TIMES EDITORS’ CHOICE – Novel ‘Brotherless Night’ which was released this January is written by VV Ganeshananthan. ‘Brotherless Night’ Can be purchased at – https://amzn.to/3WuRlHy Set during the early years of Sri Lanka’s three-decade civil war, Brotherless Night is a heartrending portrait of one woman’s moral journey and a testament to both the enduring impact of…

 • ‘పల్లవి పబ్లికేషన్స్’ వెంకట నారాయణ గారితో హర్షణీయం
  ‘పల్లవి పబ్లికేషన్స్’ వెంకట నారాయణ గారితో హర్షణీయం

  ‘పల్లవి’ వెంకట నారాయణ గారు, గత ఐదు దశాబ్దాలుగా, పుస్తక ప్రచురణా రంగంలో వున్నారు. పల్లవి పబ్లికేషన్స్ సంస్థ అధినేత. విజయవాడ వాస్తవ్యులు. ఈ ఇంటర్వ్యూ లో ఆయన గత యాభై ఏళ్ళుగా తెలుగు పుస్తక ప్రచురణ, విక్రయాల్లో వచ్చిన మార్పులు, ఇబ్బందులు, తదితర విషయాల గురించి విస్తారంగా మాట్లాడారు. వారికి హర్షణీయం కృతఙ్ఞతలు.

 • తేజో-తుంగభద్ర నవల గురించి రచయిత వసుధేంద్ర తో సంభాషణ
  తేజో-తుంగభద్ర నవల గురించి రచయిత వసుధేంద్ర తో సంభాషణ

  కన్నడలో అనేక కథాసంకలనాలు, వ్యాసాలతో పాటు రెండు నవలలు రచించారు వసుధేంద్ర. కర్ణాటక సాహిత్య అకాడమీ బహుమతి, యు ఆర్ అనంతమూర్తి అవార్డులతో పాటు ఎన్నో ప్రశంసలు పురస్కారాలు అందుకున్నారు. ఆయన రాసిన తేజో తుంగభద్ర నవల, 1490 – 1520 సంవత్సరాలలో  పోర్చుగల్ దేశం, విజయనగర సామ్రాజ్యంలో జరిగిన కొన్ని సంఘటనలను ఆధారంగా చేసుకుని రచింపబడింది. ఇప్పుడు తెలుగులో రంగనాధ రామచంద్ర రావు గారి అనువాదంతో, ఛాయా పబ్లిషర్స్ ద్వారా మీ ముందుకు వచ్చింది. పోర్చుగల్…

 • ప్రముఖ సామాజిక కార్యకర్త, రచయిత, హైదరాబాద్ బుక్ ట్రస్ట్ గీతా రామస్వామి గారితో సంభాషణ
  ప్రముఖ సామాజిక కార్యకర్త, రచయిత, హైదరాబాద్ బుక్ ట్రస్ట్ గీతా రామస్వామి గారితో సంభాషణ

  గీతా రామస్వామి గారు ఒక ప్రముఖ సామాజిక కార్యకర్త, రచయిత్రి. వీరు  హైదరాబాద్ బుక్ ట్రస్ట్ ని నిర్వహిస్తూ అనేక సంవత్సరాలుగా సామాజిక సేవా రంగంలో, పుస్తక ప్రచురణా రంగంలో పని చేస్తున్నారు. సామాజిక కార్యకర్తగా తన  అనుభవాలపై ఈ మధ్య వీరు  ఇంగ్లీష్ లో రాసిన  ‘Land, Guns, Caste, Woman: The Memoir of a Lapsed Revolutionary’ అనే పుస్తకం చాలా ఆదరణకు నోచుకుంది. ఈ ఇంటర్వ్యూలో  వామపక్ష ఉద్యమంలో, ఘజియాబాద్ లో…

 • బతుకు సేద్యం నవలాపరిచయం
  బతుకు సేద్యం నవలాపరిచయం

  బతుకు సేద్యం –  జహీరాబాద్ చుట్టుపక్కల గ్రామాల్లో నివసిస్తున్న గ్రామీణ మహిళల   గురించి, ఒక ప్రభుత్వేతర సంస్థ సహాయంతో వారి జీవితాలను వారు  కష్టపడి ఎలా సరిదిద్దుకున్నారో, వివరిస్తూ రాసిన పుస్తకం. యదార్థ సంఘటనలనాధారం చేసుకుని రాసిన కాల్పనిక నవల. ఎపిసోడ్ లో ముందుగా ఛాయా మోహన్ గారు మాట్లాడతారు. తర్వాత రచయిత శాంతి ప్రభోదిని గారు నవల గురించి మరిన్ని వివరాలు అందిస్తారు.

 • ‘చెఖోవ్ కథలు – 1’ పుస్తకం, అనువాదకులు అరుణ గారితో పరిచయం
  ‘చెఖోవ్ కథలు – 1’ పుస్తకం, అనువాదకులు అరుణ గారితో పరిచయం

  ‘Father of Modern short story’ అని చెప్పబడే రష్యన్ రచయిత చెఖోవ్ , 1880 – 1905 ప్రాంతంలో ఆరువందలకు పైగా కథలను రాసారు. ఈయన కథలు ప్రపంచ వ్యాప్తంగా. అనేక భాషల్లో అనువదించబడి ప్రాచుర్యాన్ని పొందాయి. ఇంగ్లీష్ నించి చెఖోవ్ కథలను తెలుగులోకి అనువదించి మన ముందుకు తెస్తున్నారు శ్రీమతి అరుణ గారు. ఈ పుస్తకం గురించి ఈ ఎపిసోడ్ లో ఆమె మనకు వివరిస్తారు. ఎపిసోడ్లో ముందుగా ఈ పుస్తకాన్ని మనకు అందిస్తున్న…

 • ఎండ గుర్తు – అజయ్ ప్రసాద్ గారి ‘గాలి పొరలు’ నించి
  ఎండ గుర్తు – అజయ్ ప్రసాద్ గారి ‘గాలి పొరలు’ నించి

  ‘ఎండ గుర్తు’ అనే ఈ కథ అజయ్ ప్రసాద్ గారి ‘గాలి పొరలు’ అనే కొత్త కథాసంపుటంలో నుంచి. ప్రకాశం జిల్లా అద్దంకి ఆయన సొంత వూరు. ప్రస్తుతం ఉద్యోగ రీత్యా హైదరాబాద్ లో వుంటున్నారు. మంచి చదువరి. చక్కటి రచయిత. ఇది ఆయన రెండో కథాసంపుటం. పుస్తకం కొనడానికి కింది లింక్ ను ఉపయోగించండి.

 • ‘పార్వేట’ రచయిత సురేంద్ర శీలంతో సంభాషణ
  ‘పార్వేట’ రచయిత సురేంద్ర శీలంతో సంభాషణ

  కర్నూల్ జిల్లా కోవెలకుంట్ల ప్రాంతానికి చెందిన, ఇంజనీరింగ్ చదివిన, ఇరవై తొమ్మిదేళ్ళ సురేంద్ర శీలం రాసిన కథల పుస్తకం – పార్వేట’. గత మూడేళ్ళ క్రిందటే తెలుగు కథలు చదవడం రాయడం మొదలు పెట్టిన ఈ రచయిత మొదటి పుస్తకం ఇది. కథలన్నీ ఆ ప్రాంతపు మాండలికంలో రాసినవే. మాండలికం వాడిన పద్ధతి చదువుకోడానికి ఎక్కడా అడ్డం రాలేదు, అందాన్నిచ్చింది. అక్కడి గ్రామీణ జీవితాన్ని, సమస్యలనీ చక్కటి పాత్రలను సృష్టించడం ద్వారా మన ముందుకు తెచ్చారు రచయిత.…

 • ‘దేవుడమ్మ మరో పది కథలు’ – రచయిత్రి ఝాన్సీ గారితో సంభాషణ
  ‘దేవుడమ్మ మరో పది కథలు’ – రచయిత్రి ఝాన్సీ గారితో సంభాషణ

  ఝాన్సీ గారు రాసిన మొదటి కథల పుస్తకం ‘దేవుడమ్మ మరో పది కథలు’ ఈ మధ్యనే అందుబాటులోకి వచ్చింది. ‘లా’ లో డిగ్రీ తీసుకున్న ఝాన్సీ గారు, మాస్టర్స్ ఇన్ జర్నలిజం , మాస్టర్స్ ఇన్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ పూర్తిచేశారు. కొన్నాళ్ళు తిరుపతి లో ఆంధ్రజ్యోతి – స్టాఫ్ రిపోర్టర్ గా పని చేసి, ప్రస్తుతం ఒక ఐటీ కంపెనీని నడుపుతూ బెంగుళూరులో నివాసం వుంటున్నారు. అమెజాన్ ద్వారా పుస్తకం కొనడానికి ఈ లింకుని ఉపయోగించండి. –…