• ‘ఆట’ – శ్రీసుధ గారు రాసిన ‘డిస్టోపియా’ నించి
  ‘ఆట’ – శ్రీసుధ గారు రాసిన ‘డిస్టోపియా’ నించి

  ఆట’ అనే ఈ కథ శ్రీసుధ మోదుగు గారు రాసిన ‘డిస్టోపియా’ అనే కథా సంపుటం నించి. రచయిత్రి, కవయిత్రి అయిన శ్రీసుధ గారు వృత్తి రీత్యా వైద్యులు. జమైకాలో నివాసం. వారికి కృతజ్ఞతలు. పుస్తకం కొనడానికి కింది లింక్ ఉపయోగించండి. http://bit.ly/3wg2nUW

 • ‘డిస్టోపియా’ కథలు – రచయిత్రి శ్రీసుధ గారితో పరిచయం
  ‘డిస్టోపియా’ కథలు – రచయిత్రి శ్రీసుధ గారితో పరిచయం

  గుంటూరు జిల్లాకి చెందిన శ్రీసుధ మోదుగు, వైద్యరంగంలో పనిచేస్తున్నారు. జమైకాలో నివాసం. ‘అమోహం’, ‘విహారి’, వీరి కవితా సంకలనాలు. రెక్కల పిల్ల, డిస్టోపియా అనే కథాసంపుటాలను ప్రచురించారు. ‘అంతర్హిత’ అనే నవల ఈ మధ్యనే విడుదల అయింది. ‘డిస్టోపియా’ కొనడానికి కింది లింక్ ఉపయోగించండి. http://bit.ly/3wg2nUW

 • ‘రామగ్రామ నుంచి రావణలంక దాకా’ రచయిత సీతారామరాజు గారితో పరిచయం.
  ‘రామగ్రామ నుంచి రావణలంక దాకా’ రచయిత సీతారామరాజు గారితో పరిచయం.

  రామగ్రామ నుంచి రావణలంక దాకా’ నవల రచయిత సీతారామ రాజు గారి సొంత వూరు, పశ్చిమ గోదావరి జిల్లా బుట్టాయి గూడెం. రియల్ ఎస్టేట్ రంగంలో వున్నారు. నివాసం హైదరాబాద్. ఆరు వారాల క్రితమే రిలీజ్ అయిన ఈ నవల 800 ప్రతుల మించి అమ్మకాలు సాధించి పాఠకుల విశేష ఆదరణకు నోచుకుంది. పుస్తకం కొనడానికి కింది లింక్ ఉపయోగించండి – https://amzn.to/3EoRIMn Harshaneeyam on apple podcast https://apple.co/3K1vMdw

 • మధురాంతకం రాజారాం గారి కథలు, రచనా జీవితం పై మధురాంతకం నరేంద్ర గారు
  మధురాంతకం రాజారాం గారి కథలు, రచనా జీవితం పై మధురాంతకం నరేంద్ర గారు

  1993 వ సంవత్సరంలో కేంద్ర సాహిత్య అకాడమీ బహుమతి తన కథల పుస్తకానికి గెలుచుకున్న మధురాంతకం రాజారాం గారు తెలుగులో సుప్రసిద్ధ కథారచయిత. చిత్తూరు జిల్లాకు చెందిన రాజారాం గారు మూడు వందలకు పైగా కథలు రాసారు. వారి సమగ్ర కథాసంకలనం కిందటి వారం ఎమెస్కో పబ్లిషర్స్ వారు ప్రచురించారు. ఇందులో 295 కథలు ఐదు భాగాలలో ఇవ్వడం జరిగింది. ఈ ఎపిసోడ్లో మధురాంతకం నరేంద్ర గారు వారి నాన్న గారి కథల గురించి , రచనా…

 • ‘సత్యలింగం’ – పతంజలి శాస్త్రి గారి రచన (గుప్తా’91 సంపుటం నించి)
  ‘సత్యలింగం’ – పతంజలి శాస్త్రి గారి రచన (గుప్తా’91 సంపుటం నించి)

  సత్యలింగం’ పతంజలి శాస్త్రి గారు రాసిన ‘గుప్తా’91’ సంపుటం లోనిది. పుస్తకం కొనడానికి కింద ఇచ్చిన లింక్ వాడొచ్చు. గత సంవత్సరం చదివిన నేను చదివిన కథల్లో నిస్సందేహంగా  సత్యలింగం అత్యుత్తమైన కథ. కథలోకెడితే ‘టీటీ’ అని పిలవబడే రైల్వే టికెట్ కలెక్టర్ కాంతారావు స్నేహితుడు స్వామి. తన ఇంట్లో అద్దెకుండే  కూర్మయ్య నాయుడి గురించి స్వామికి చెప్పుకుంటూ ఉంటాడు కాంతారావు. నాయుడు విపరీతమైన కోపిష్టి. ఒళ్ళూపైతెలీని కోపంతో ఇబ్బందుల్లో ఇరుక్కుంటూ ఉంటాడు. తన జీవితంలో ప్రశాంతత…

 • ‘ఇసుక అద్దం’ శ్రీ వూహ గారితో సంభాషణ
  ‘ఇసుక అద్దం’ శ్రీ వూహ గారితో సంభాషణ

  శ్రీ వూహ గారి మొదటి కథా సంపుటం ‘ఇసుక అద్దం’డిసెంబర్ నెలలో రిలీజ్ అయ్యింది. ఈ ఎపిసోడ్ లో తన కథారచన గురించి, తనను ప్రభావితం చేసిన విషయాల గురించి శ్రీ వూహమాట్లాడారు. ఇసుక అద్దం కొనడానికి క్రింది లింక్ ను ఉపయోగించండి.

 • ‘చిలుకంబడు దధికైవడి’ – మూలం తమిళ రచయిత జెయమోహన్ రచన ‘మత్తుఱు తయిర్’
  ‘చిలుకంబడు దధికైవడి’ – మూలం తమిళ రచయిత జెయమోహన్ రచన ‘మత్తుఱు తయిర్’

  ఈ కథకు మూలం ప్రముఖ తమిళ రచయిత జెయమోహన్ రాసిన  ‘మత్తుఱు తయిర్’ (Mathuru thayir Jayamohan | மத்துறு தயிர் ஜெயமோகன்) అనే కథ.  జెయమోహన్ గారి ‘అఱం’ అనే కథాసంకలనం లోనిది. ‘అఱం’ లోని పన్నెండు కథలు, నిజ జీవితంలోని ప్రత్యేకమైన, ప్రసిద్ధమైన  వ్యక్తుల గురించి మనకు చెబుతూ   రచయిత రాసిన  కథలు. ఈ కథలోని ముఖ్య పాత్ర , తిరువనంతపురం విశ్వవిద్యాలయ ఆచార్యుడుగా  తమిళ సాహిత్యాన్ని బోధించిన ప్రొఫెసర్ జేసుదాసన్. (https://tamil.wiki/wiki/Professor_Jesudasan)…

 • యువ రచయిత వెంకట నారాయణ గారితో పరిచయం
  యువ రచయిత వెంకట నారాయణ గారితో పరిచయం

  ఇరవై మూడేళ్ళ వెంకటనారాయణ పల్నాడు జిల్లా గరికపాడు గ్రామానికి చెందిన వారు. ఎం ఏ తెలుగు, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ లో పూర్తి చేశారు. ‘భూమి పతనం’ అనే నవల, ‘ఇయ్యాల మా వూళ్ళో’ అనే కవితా సంకలనం గత సంవత్సరం ప్రచురితమయ్యాయి. మంచి చదువరి. ఈ రచయితలా రాసేదానికంటే ఎక్కువ చదువుతూ , తాను చదివిన పుస్తకాల గురించి చక్కగా అర్థవంతంగా మాట్లాడే రచయితలు చాలా అరుదు. ప్రస్తుతం ‘గరికపాటోడి కథలు’ అనే కథా సంపుటి…

 • ప్రసాదం : కథా మూలం – ప్రసిద్ధ తమిళ రచయిత సుందర రామస్వామి గారు
  ప్రసాదం : కథా మూలం – ప్రసిద్ధ తమిళ రచయిత సుందర రామస్వామి గారు

  ప్రసాదం – ఈ కథకు మూలం ప్రసిద్ధ తమిళ రచయిత సుందర రామస్వామి గారు. కథలోకి వెళ్లబోయే ముందు ఒక చిన్న గమనిక – హర్షణీయం స్పాటిఫై ఆప్ ద్వారా వినే శ్రోతలు  ఇప్పుడు కథపై తమ   అభిప్రాయాన్ని తెలియచేసే అవకాశం వుంది. మీ అభిప్రాయాలు వెంటనే ఆప్ ద్వారా ప్రచురితం అవుతాయి. స్పాటిఫై ద్వారా హర్షణీయం ను వినడానికి, కొత్తగా వచ్చే ఎపిసోడ్స్ ని వెంటనే ఉచితంగా డౌన్లోడ్ చేసుకోడానికి ఇక్కడ ఇచ్చిన లింక్…

 • ‘కూటి ఋణం’ అవినేని భాస్కర్ గారి అనువాద కథపై సమీక్ష
  ‘కూటి ఋణం’ అవినేని భాస్కర్ గారి అనువాద కథపై సమీక్ష

  ప్రసిద్ధ తమిళ రచయిత జెయమోహన్ గారి తమిళ కథ సోట్ఱు కణక్కు , ‘కూటి ఋణం’ అనే పేరుతో అవినేని భాస్కర్ గారు చక్కగా అనువదించారు. ఈ ఎపిసోడ్ లో, చాలా కాలంగా హర్షణీయం పాడ్కాస్ట్ ని ఫాలో అవుతున్న అర్చన గారు ఈ కథపై తమ అభిప్రాయాన్ని వెల్లడిస్తారు. అర్చన గారు సాఫ్ట్వేర్ రంగంలో పని చేస్తారు. తెలుగు ఇంగ్లీష్ కథాసాహిత్యం పై ఆసక్తి వుంది. ఈ కథ ఈమాట వెబ్ మ్యాగజైన్ లో ప్రచురింపబడింది.…

 • Kannan Sundaram in conversation with Harshaneeyam
  Kannan Sundaram in conversation with Harshaneeyam

  మెకానికల్ ఇంజనీరింగ్ చదువుకున్న శ్రీ కణ్ణన్ సుందరం ప్రసిద్ధ తమిళ రచయిత సుందర రామస్వామి గారి కుమారుడు. కాలచ్చువడు పబ్లికేషన్స్ అనే సంస్థను నాగర్ కోయిల్ పట్టణంలో స్థాపించి గత పాతికేళ్ళుగా విజయవంతంగా నిర్వహిస్తున్నారు. ఇప్పటిదాకా వెయ్యికి పైగా పుస్తకాలను ప్రచురించారు. తమిళ సాహిత్యానికి ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా అనేక అవార్డులు అందుకున్నారు. 2021 సంవత్సరంలో ఫ్రాన్స్ ప్రభుత్వం ఆయనకు చెవాలియర్ అవార్డును ప్రదానం చేసింది. ఈ సంభాషణలో భాగంగా , పుస్తక ప్రచురణ గురించి,…

 • ‘యాత్ర’ కథ (మూలం: జెయమోహన్ గారి ‘పెరువలి’)
  ‘యాత్ర’ కథ (మూలం: జెయమోహన్ గారి ‘పెరువలి’)

  ప్రసిద్ధ తమిళ రచయిత శ్రీ జెయమోహన్ రచించిన  ‘అఱం’  అనే కథా సంపుటంలోని ‘పెరువలి’.  తెలుగులో యాత్ర అనే పేరుతో అనువదించబడింది. ఈ కథ ను కింది లింక్ ను వుపయోగించి, ఈమాట వెబ్ మ్యాగజైన్ ఏప్రిల్ 23 సంచికలో చదువుకోవచ్చు. ‘అఱం’ లోని కథలన్నీ  నిజజీవితంలో ఆయనకు తారసపడ్డ గొప్ప వ్యక్తుల గురించి జెయమోహన్ గారు రాసినవి. కథలో  ముఖ్య పాత్రధారి ప్రముఖ తమిళ నాటక రచయిత, కళాకారుడు కోమల్ స్వామినాథన్. వెన్నెముక కాన్సర్ తో…