Apple PodcastsSpotifyGoogle Podcasts

  • ‘Following a Prayer’ : The Novel – Conversation with Dr.Sundar Sarukkai
    ‘Following a Prayer’ : The Novel – Conversation with Dr.Sundar Sarukkai

    ‘Following a Prayer’ is a novel about three inquisitive young girls. Kalpana, a twelve-year-old girl in a village nestled in the dense hills of the Western Ghats, goes missing one morning. When she returns, she has gone silent. Nothing can get her to speak. What happened in those three days that she went missing? What…

  • ‘Brotherless Night’ -The novel about a family in the midst of Srilankan Civil War
    ‘Brotherless Night’ -The novel about a family in the midst of Srilankan Civil War

    NEW YORK TIMES EDITORS’ CHOICE – Novel ‘Brotherless Night’ which was released this January is written by VV Ganeshananthan. ‘Brotherless Night’ Can be purchased at – https://amzn.to/3WuRlHy Set during the early years of Sri Lanka’s three-decade civil war, Brotherless Night is a heartrending portrait of one woman’s moral journey and a testament to both the enduring impact of…

  • ‘పల్లవి పబ్లికేషన్స్’ వెంకట నారాయణ గారితో హర్షణీయం
    ‘పల్లవి పబ్లికేషన్స్’ వెంకట నారాయణ గారితో హర్షణీయం

    ‘పల్లవి’ వెంకట నారాయణ గారు, గత ఐదు దశాబ్దాలుగా, పుస్తక ప్రచురణా రంగంలో వున్నారు. పల్లవి పబ్లికేషన్స్ సంస్థ అధినేత. విజయవాడ వాస్తవ్యులు. ఈ ఇంటర్వ్యూ లో ఆయన గత యాభై ఏళ్ళుగా తెలుగు పుస్తక ప్రచురణ, విక్రయాల్లో వచ్చిన మార్పులు, ఇబ్బందులు, తదితర విషయాల గురించి విస్తారంగా మాట్లాడారు. వారికి హర్షణీయం కృతఙ్ఞతలు.

  • తేజో-తుంగభద్ర నవల గురించి రచయిత వసుధేంద్ర తో సంభాషణ (Conversation with Vasudhendra)
    తేజో-తుంగభద్ర నవల గురించి రచయిత వసుధేంద్ర తో సంభాషణ (Conversation with Vasudhendra)

    కన్నడలో అనేక కథాసంకలనాలు, వ్యాసాలతో పాటు రెండు నవలలు రచించారు వసుధేంద్ర. కర్ణాటక సాహిత్య అకాడమీ బహుమతి, యు ఆర్ అనంతమూర్తి అవార్డులతో పాటు ఎన్నో ప్రశంసలు పురస్కారాలు అందుకున్నారు. ఆయన రాసిన తేజో తుంగభద్ర నవల, 1490 – 1520 సంవత్సరాలలో  పోర్చుగల్ దేశం, విజయనగర సామ్రాజ్యంలో జరిగిన కొన్ని సంఘటనలను ఆధారంగా చేసుకుని రచింపబడింది. ఇప్పుడు తెలుగులో రంగనాధ రామచంద్ర రావు గారి అనువాదంతో, ఛాయా పబ్లిషర్స్ ద్వారా మీ ముందుకు వచ్చింది. పోర్చుగల్…

  • బతుకు సేద్యం నవలాపరిచయం
    బతుకు సేద్యం నవలాపరిచయం

    బతుకు సేద్యం –  జహీరాబాద్ చుట్టుపక్కల గ్రామాల్లో నివసిస్తున్న గ్రామీణ మహిళల   గురించి, ఒక ప్రభుత్వేతర సంస్థ సహాయంతో వారి జీవితాలను వారు  కష్టపడి ఎలా సరిదిద్దుకున్నారో, వివరిస్తూ రాసిన పుస్తకం. యదార్థ సంఘటనలనాధారం చేసుకుని రాసిన కాల్పనిక నవల. ఎపిసోడ్ లో ముందుగా ఛాయా మోహన్ గారు మాట్లాడతారు. తర్వాత రచయిత శాంతి ప్రభోదిని గారు నవల గురించి మరిన్ని వివరాలు అందిస్తారు.

  • ‘చెఖోవ్ కథలు – 1’ పుస్తకం, అనువాదకులు అరుణ గారితో పరిచయం
    ‘చెఖోవ్ కథలు – 1’ పుస్తకం, అనువాదకులు అరుణ గారితో పరిచయం

    ‘Father of Modern short story’ అని చెప్పబడే రష్యన్ రచయిత చెఖోవ్ , 1880 – 1905 ప్రాంతంలో ఆరువందలకు పైగా కథలను రాసారు. ఈయన కథలు ప్రపంచ వ్యాప్తంగా. అనేక భాషల్లో అనువదించబడి ప్రాచుర్యాన్ని పొందాయి. ఇంగ్లీష్ నించి చెఖోవ్ కథలను తెలుగులోకి అనువదించి మన ముందుకు తెస్తున్నారు శ్రీమతి అరుణ గారు. ఈ పుస్తకం గురించి ఈ ఎపిసోడ్ లో ఆమె మనకు వివరిస్తారు. ఎపిసోడ్లో ముందుగా ఈ పుస్తకాన్ని మనకు అందిస్తున్న…

  • ఎండ గుర్తు – అజయ్ ప్రసాద్ గారి ‘గాలి పొరలు’ నించి
    ఎండ గుర్తు – అజయ్ ప్రసాద్ గారి ‘గాలి పొరలు’ నించి

    ‘ఎండ గుర్తు’ అనే ఈ కథ అజయ్ ప్రసాద్ గారి ‘గాలి పొరలు’ అనే కొత్త కథాసంపుటంలో నుంచి. ప్రకాశం జిల్లా అద్దంకి ఆయన సొంత వూరు. ప్రస్తుతం ఉద్యోగ రీత్యా హైదరాబాద్ లో వుంటున్నారు. మంచి చదువరి. చక్కటి రచయిత. ఇది ఆయన రెండో కథాసంపుటం. పుస్తకం కొనడానికి కింది లింక్ ను ఉపయోగించండి.

  • ‘పార్వేట’ రచయిత సురేంద్ర శీలంతో సంభాషణ
    ‘పార్వేట’ రచయిత సురేంద్ర శీలంతో సంభాషణ

    కర్నూల్ జిల్లా కోవెలకుంట్ల ప్రాంతానికి చెందిన, ఇంజనీరింగ్ చదివిన, ఇరవై తొమ్మిదేళ్ళ సురేంద్ర శీలం రాసిన కథల పుస్తకం – పార్వేట’. గత మూడేళ్ళ క్రిందటే తెలుగు కథలు చదవడం రాయడం మొదలు పెట్టిన ఈ రచయిత మొదటి పుస్తకం ఇది. కథలన్నీ ఆ ప్రాంతపు మాండలికంలో రాసినవే. మాండలికం వాడిన పద్ధతి చదువుకోడానికి ఎక్కడా అడ్డం రాలేదు, అందాన్నిచ్చింది. అక్కడి గ్రామీణ జీవితాన్ని, సమస్యలనీ చక్కటి పాత్రలను సృష్టించడం ద్వారా మన ముందుకు తెచ్చారు రచయిత.…

  • ‘దేవుడమ్మ మరో పది కథలు’ – రచయిత్రి ఝాన్సీ గారితో సంభాషణ
    ‘దేవుడమ్మ మరో పది కథలు’ – రచయిత్రి ఝాన్సీ గారితో సంభాషణ

    ఝాన్సీ గారు రాసిన మొదటి కథల పుస్తకం ‘దేవుడమ్మ మరో పది కథలు’ ఈ మధ్యనే అందుబాటులోకి వచ్చింది. ‘లా’ లో డిగ్రీ తీసుకున్న ఝాన్సీ గారు, మాస్టర్స్ ఇన్ జర్నలిజం , మాస్టర్స్ ఇన్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ పూర్తిచేశారు. కొన్నాళ్ళు తిరుపతి లో ఆంధ్రజ్యోతి – స్టాఫ్ రిపోర్టర్ గా పని చేసి, ప్రస్తుతం ఒక ఐటీ కంపెనీని నడుపుతూ బెంగుళూరులో నివాసం వుంటున్నారు. అమెజాన్ ద్వారా పుస్తకం కొనడానికి ఈ లింకుని ఉపయోగించండి. –…

  • ‘East Wind’ పుస్తక పరిచయం – ఉణుదుర్తి సుధాకర్ గారితో
    ‘East Wind’ పుస్తక పరిచయం – ఉణుదుర్తి సుధాకర్ గారితో

    ఉణుదుర్తి సుధాకర్ గారు రాసిన ‘తూరుపు గాలులు’ పుస్తకం సౌత్ సైడ్ బుక్స్ పబ్లిషింగ్ ద్వారా ఇంగ్లీష్ లో ‘East Wind’ పేరుతో అనువదించబడింది. ఈ అనువాద ప్రక్రియలో తన అనుభవాన్ని సుధాకర్ గారు మనతో పంచుకున్నారు, ఈ ఎపిసోడ్లో. త్వరలో ఈ పుస్తకం Hyderabad book trust వెబ్సైటు ద్వారా, ఇతర పుస్తక విక్రేతల ద్వారా లభ్యం అవుతుంది. ఆటా బహుమతి పొందిన ‘యారాడకొండ’ నవలా రచయిత శ్రీ . ఉణుదుర్తి సుధాకర్. వృత్తి రీత్యా…

  • ‘ఆట’ – శ్రీసుధ గారు రాసిన ‘డిస్టోపియా’ నించి
    ‘ఆట’ – శ్రీసుధ గారు రాసిన ‘డిస్టోపియా’ నించి

    ఆట’ అనే ఈ కథ శ్రీసుధ మోదుగు గారు రాసిన ‘డిస్టోపియా’ అనే కథా సంపుటం నించి. రచయిత్రి, కవయిత్రి అయిన శ్రీసుధ గారు వృత్తి రీత్యా వైద్యులు. జమైకాలో నివాసం. వారికి కృతజ్ఞతలు. పుస్తకం కొనడానికి కింది లింక్ ఉపయోగించండి. http://bit.ly/3wg2nUW

  • ‘డిస్టోపియా’ కథలు – రచయిత్రి శ్రీసుధ గారితో పరిచయం
    ‘డిస్టోపియా’ కథలు – రచయిత్రి శ్రీసుధ గారితో పరిచయం

    గుంటూరు జిల్లాకి చెందిన శ్రీసుధ మోదుగు, వైద్యరంగంలో పనిచేస్తున్నారు. జమైకాలో నివాసం. ‘అమోహం’, ‘విహారి’, వీరి కవితా సంకలనాలు. రెక్కల పిల్ల, డిస్టోపియా అనే కథాసంపుటాలను ప్రచురించారు. ‘అంతర్హిత’ అనే నవల ఈ మధ్యనే విడుదల అయింది. ‘డిస్టోపియా’ కొనడానికి కింది లింక్ ఉపయోగించండి. http://bit.ly/3wg2nUW