Apple PodcastsSpotifyGoogle Podcasts

క్షమించండి, ఇది మగ పాఠకులకు మాత్రమే!

నాకు రాయటం వ్యసనంగా మారిందనుకుంటా . ఏదో ఒకటి రాయకుండా ఉండలేక పోతున్నా. నా కథా వస్తువులకు బాల్యం, బంధాలు మొదలగునవి ముడిసరుకులు. కానీ వ్యసనంగా మారాక ఫీల్ గుడ్ కథలు మాత్రమే కాదు, అన్నీ కథలు రాయాలి, రాసి మీలాటి విజ్ఞులచే, హర్షా! నీ దగ్గరనుండి ఇలాటి కథ ఊహించలేదు అని దాడి చేయించుకోవాలి. మీ ఎదురుదాడికి తయారయిపోతూ, ఈ కింద కథను ప్రచురిస్తున్నా, కొంచెం గుండె గాభారాతో మరికొంచెం నా ఏభై కథల గమ్యానికి చేరాలన్న ఆతృతతో.

ఒక కస్టమర్ ఎగ్జిక్యూటివ్ తో ఈ నెల ఒక వర్క్ షాప్ వుంది. ఇప్పటి వరకు ఏమి చేసాము, ఈ ఇయర్ ఫోకస్ ఏరియాస్ ఏంటి, మొదలగు విషయాల మీద. ప్రిపేర్ అవుతున్నాము, మా బాస్ తో రివ్యూ కి. నాకేమో మా ప్రిపరేషన్ తృప్తి గా లేదు. కొంచెం గాభరాగా వుంది. నా గాభరా చూసి నా కొలీగ్, రామ్ సార్ మీరు ఏమీ అనుకోనంటే నేను ఒక కథ చెప్తా, మీరు వినాలి అన్నాడు. సరే చెప్పమన్న, కొంచెమ్ రిలాక్స్ అవుదామని. హర్షా! ఒక అడవిలో ఒక సింహం ఉండేది. అది రోజూ పక్కన వుండే ఊరి మీద పడి కంటికి నదురుగా వుండే మగవాళ్ళని ఎక్కేది అన్నాడు. ఎక్కడం అంటే, మీరే అర్థం చేసుకోండి అన్నాడు, ఒక చిన్న గ్యాప్ ఇచ్చి. మగ వాళ్ళు సిగ్గుతో చచ్చి పోతున్నారు, దీనెమ్మా! ఇది పడి సంపిపార నూకున్నా బాగుండేది, మరీ ఎక్కి వొదలటమేంటి అని.

సరే వాళ్ళందరూ ఒక మేటి వేటగాడిని బాడుగకు మాటలాడుకున్నారు, ఎలాగైనా ఈ సింహం బాధ వొదిలిచ్చుకుందామని. వాడు వచ్చాడు, మంచె అన్నాడు కంచె అన్నాడు, ప్రిపరేషన్ అన్నాడు అచ్చు మనలాగే. అసలు రోజు రానే వచ్చింది, వాడి గురి తప్పింది, సింహం బాగా సంతోష పడి వాడిని ఎక్కింది, వాడు సిగ్గుతో చావనే చచ్చాడు. సరే మనలాగే రికవర్ అయ్యాడు, ఈ అనుభవంతో మనలాగే లెసన్స్ లెర్న్ట్ అని మొదలెట్టాడు, మనలాగే బెస్ట్ ప్రాక్టీసెస్ సమీకరించాడు. మరలా ఆ డి-డే రానే వొచ్చింది, అదొచ్చింది వీడి గురి షరా మాములుగా తప్పింది, అందర్నీ ఒక్కసారే ఎక్కే సింహం వీడు ఛాలెంజ్ చేసాడు కనుక రెండోసారి కూడా ఎక్కింది. వీడు ఇక అవమానం తట్టు కోలేక, వాడి తుపాకీ సన్యాసం చేసేసాడు. ఇక ఆ గ్రామస్తులందరూ వాడిని బ్రతిమాలుకున్నారు, నువ్వు తప్ప మాకు ఇంకో గతి లేదు. అందులోను నీకు రెండుమార్ల అనుభవం వుంది, నువ్వీసారి ఖచ్చితంగామా అవమానానికి ప్రతీకారం చేయగలవని. వాడు కూడా సరే అన్నాడు. అనుకున్న ప్రకారం సింహం రానే వచ్చింది, వీడు గురి మూడోసారీ తప్పింది, సింహం రెట్టించిన సంతోషంతో మరలా ఎక్కింది. వెళ్లి పోతూ పోతూ దానికో డౌట్ వచ్చింది, ఎరా! నువ్వు నిజంగానే గురి తప్పుతున్నావా!, లేక నాతో నచ్చి కావాలని గురి తప్పుతున్నావా అని.

ఈ కథ చెప్పి నావంక చూసి నవ్వి కంటిన్యూ చేసాడు. హర్షా! మన ప్రిపరేషన్ ఎంత వున్నా, మనం గురి తప్పుతాము, మన కస్టమర్ ఎక్కుతాడు, ఎక్కడమే కాదు ఇలా ఎక్కించుకోవటం మనకిష్టమేనని కూడా నిరూపిస్తాడు. దానికి ముందు రెడీ అవుదాము అంటూ. ఉసురో మంటూ వచ్చా ఇంటికి , దేవుడా కొంచెం మంచి కస్టమర్ ని అంత కంటే కొంచెం మంచి కొలీగ్స్ ని ఎందుకివ్వవు అనుకుంటూ. ఆ రాతిరోకల, ఆ కల లో ఒక పక్క సింహం, ఒక పక్క మా కస్టమర్ వస్తున్నారు నా వైపు. నేను సింహానికే దొరికిపోయా ఉద్దేశ్యపూర్వకంగా. ఉదయం లేచి, చూసావా రామ్, నేను ఎంత తెలివి కలవాడినో అంటూ నా కల చెప్పా. నిజమే సార్ సింహాన్ని ఎంపిక చేసుకున్నారు కాబట్టే, బతికి మాకు కల గురుంచి చెప్పగలుగుతున్నారు, లేక పోతే గుండె ఆగి చచ్చి వుండే వాళ్ళు నిద్రలోనే అని ముక్తాయించాడు మా రామ్. నా లాగే రివ్యూల పేరుతో రేప్ కు గురయ్యే ప్రతీ ఐ.టి మిత్రులకు నా సానుభూతి తో.

Leave a Reply