బెల్లం టీ ‘నెమలి కన్ను’ మురళి గారు

ఈ సారి, హర్షాతిధ్యం శీర్షికన, శ్రీ మురళి గారి, బ్లాగ్ ‘నెమలి కన్ను’ పరిచయం చేస్తున్నాం. ఆయన, 2009 వ సంవత్సరం నించి తన బ్లాగ్ ను నిర్వహిస్తున్నారు. తాను స్వయంగా చక్కటి కథలను రాయడమే కాకుండా , తన బ్లాగ్ ద్వారా తెలుగు సాహిత్యంలో చక్కని కథలను, ఎన్నో సంవత్సరాలనుంచీ తన పాఠకులకు పరిచయం చేస్తున్నారు.

వాటిల్లో తెలుగు కథల్లో ‘స్త్రీ’ పాత్రలపై విశ్లేషణ, కన్యాశుల్కం పాత్రలపై వారి వ్యాఖ్యానం ఎన్నదగినవి.

అడిగిన తడవునే, తన కథ ‘బెల్లం టీ’ ని హర్షాతిధ్యం పాఠకులకు ఆడియో ద్వారా పరిచయం చెయ్యడానికి అనుమతినిచ్చిన, మురళి గారికి మా హృదయ పూర్వక కృతజ్ఞతలు.

చిన్న నిడివి వున్న కథలో కూడా , ఒక పాత్ర ని ఎంత గొప్పగా ఆవిష్కరించవచ్చు అని తెలుసుకోడానికి ,ఈ కథ ఒక ఉదాహరణ.

“బెల్లం టీ ‘నెమలి కన్ను’ మురళి గారు” కి 5 స్పందనలు

 1. ఎంత చక్కగా చదివారండి!!
  చక్కని ఉచ్చారణ, ఆసాంతం ఒకే శృతి.. 
  నా కథ నాకే కొత్తగా వినిపించింది మీ గొంతులో..
  థాంక్యూ వెరీమచ్..

  1. థాంక్ యు సర్.
   ఇంత చక్కటి కథ రీపబ్లిష్ చెయ్యడానికి మాకు అనుమతినిచ్చినందుకు మరోసారి మీకు కృతజ్ఞుతలు .

 2. చాలా చాల బాగుంది బెల్లం టి. Very emotional and powerful ending.రచయిత మురళి గారి కి నా ధన్య వాదనలు.

Leave a Reply