హర్షణీయానికి మరో మారు మీకందరికీ స్వాగతం.
గత ఐదు నెలలుగా, హర్షణీయానికి మీరందరూ ఇస్తున్న ప్రోత్సాహానికి మా హృదయ పూర్వక కృతజ్ఞతలు.
హర్షణీయం ద్వారా మా పాఠకుల్ని, శ్రోతల్ని , తెలుగు కథా సాహిత్యానికి కొంత దగ్గరగా తీసుకువెళ్లాలని మొదట్నుంచీ మా ప్రయత్నం గా వుండింది.
దానికి కొనసాగింపుగానే కొన్ని రోజులక్రితం , తెలుగు కథా సాహిత్యంలో వున్న గొప్ప రచనలని ఒకటొకటిగా మీకందరికీ పరిచయం చెయ్యాలని, మేము అనుకున్నాము.
ఆ ఆలోచన ఫలితమే ఇప్పుడు మీకందించబోతున్న ఈ ‘ కథా నీరాజనం’ కార్యక్రమం.
కథా నీరాజనంలో భాగంగా, ప్రతి ఎపిసోడ్ లో, ఒక గొప్ప తెలుగు కథని సంక్షిప్త రూపం లో పరిచయం చేస్తూ , ఆ కథ పై పాఠకులుగా , మా అభిప్రాయాలని, హర్ష , నేను , గిరి ఒక చిన్న చర్చా కార్యక్రమం ద్వారా మీకు అందించబోతున్నాము .
ఈ మా ప్రయత్నాన్ని ఎప్పటిలాగే మీరందరూ ఆదరిస్తారని మేము ఆశిస్తున్నాము.
ఈ కార్యక్రమంలో మొట్టమొదటిగా మీకు పరిచయం చెయ్యబోతున్న కథ కు, రచయిత తన రచనా వ్యాసంగాన్ని నలభై ఆరేళ్ళ క్రితం ప్రారంభించారు. వారిది సాహిత్య కుటుంబం. వారి తండ్రి గారు మధురాంతకం రాజారామ్ గారు , సోదరుడు మహేంద్ర గారు కూడా సుప్రసిద్ధ తెలుగు కథా రచయితలు.
ఇది గాక , ఆయన ఆంగ్ల సాహిత్యంలో పరిశోధన చేసి , అధ్యాపక వృత్తిలో ప్రవేశించి, నలభై ఏళ్ల పైన, వేలమంది విద్యార్థులకి విద్యా దానం చేశారు.
మన సమాజంలో, మన వ్యక్తిత్వాలలో వుండే వైచిత్రిని , అనేక రకాలైన సంఘర్షణలని అతి సుతారమైన తనదైన శైలిలో , అత్యంత సహజంగా చిత్రీకరించడమే ఆయన రచనలలో వుండే ప్రత్యేకత.
ఒక సకారాకాత్మకమైన మార్పు , కథ చదివే ప్రతి వ్యక్తిలో, తద్వారా మన సమాజంలో తీసుక రావాలని నిరంతరమూ కృషి చేసే హాలికుడాయన.
అత్యంత ప్రతిష్టాత్మకమైన ‘కథ’ అవార్డు తో బాటూ ఎన్నో పురస్కారాలు అందుకున్నారాయన, ఈ ప్రయాణంలో.
గత కొన్ని దశాబ్దాలుగా, తెలుగు కథ కి పథా నిర్దేశనం చేస్తూ వస్తున్న ఆ రచయిత పేరు డాక్టర్ మధురాంతకం నరేంద్ర గారు.
‘కథ నీరాజనం’ ఎవరి కథలతో ఆరంభించాలి, అని ఆలోచించినప్పుడు మాకు స్ఫురించిన మొదటి పేరు శ్రీ,.మధురాంతకం నరేంద్ర గారు.
ఈ మొదటి ఎపిసోడ్ కి వున్న ఇంకో ప్రత్యేకత, ఈ చిన్ని ప్రయత్నాన్ని వారికి వివరించి, మొదటి ఎపిసోడ్ ఆరంభించమని ఆహ్వానించినపుడు, వెంటనే మా కోరికను మన్నించి వారు తమ అంగీకారాన్ని తెలియజెయ్యడం.
శ్రీ మధురాంతకం నరేంద్ర గారికి హర్షణీయం జట్టు తరఫున, పాఠకుల తరఫున మా హృదయ పూర్వక కృతజ్ఞతలు.
ఈ చర్చా కార్యక్రమంలో , భాగంగా మొదటగా వారి రచనా రీతి పైన తరువాత ఆయన రచించిన , ‘నాలుగు కాళ్ళ మంటపం’ అనే కథాసంకలనంలోని కొన్ని కథలపై , ప్రశ్నలకు ఆయన సమాధానాలు ఇవ్వడం జరిగింది.
- ఈ పుస్తకం కొనదలచుకున్న వారు, క్రింద ఇచ్చిన వెబ్ లింక్ లేదా నవోదయ బుక్ హౌస్ (హైదరాబాద్) అడ్రస్ లను గమనించగలరు.
*ఈ ఇంటర్వ్యూకి తన సహకారాన్ని అందించిన మిత్రుడు LP కి హృదయ పూర్వక కృతజ్ఞతలు.
విషయసూచిక (Time stamps in the bracket included)
<div class=”cp-show-notes”>
[00:00] -హర్షణీయంలో తెలుగుకథా నీరాజనం శ్రీ మధురాంతకం నరేంద్ర గారితో.
[03:33] – తన రచనలపై వారి తండ్రి గారు, సుప్రసిద్ధ తెలుగు కథా రచయిత, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత, శ్రీ మధురాంతకం రాజారామ్ గారి ప్రభావం.
[11:35]- తన రచనలపై ఇంటి వాతావరణ ప్రభావం.
[08:04] – తన రచనల్లో శ్రమ జీవన సౌందర్య చిత్రీకరణ.
[21:30] – పాత్రల్లో సహజత్వం.
[29:47] – తన రచనల్లో స్త్రీ పక్షపాతం.
[31:18] – నవలా ప్రక్రియ.
[45:15] – కథా రచన మరియు ప్రచురణలో వస్తున్న మార్పులు.
[65:20] – తెలుగు రచయితలకు గుర్తింపు ఎందుకు తక్కువ?
[71:21] – తన రచనలపై మార్క్సిజం ప్రభావం.
[75:42] – కథలు వ్రాయటం నేర్పించవచ్చా?
[77:24] – రాబోతున్న రచనలు
[80:14] – ‘నాలుగుకాళ్ల మంటపం కథాసంకలనం’ రచనా విశేషాలు
[83:02] – ‘నాలుగుకాళ్ల మంటపం కథాసంకలనం’ లోని ‘కాకులు గ్రద్దలు’ కథపై చర్చ.
[95:33] – ‘నాలుగుకాళ్ల మంటపం కథాసంకలనం’ లోని ‘ఒక మైనారిటీ కథ ‘ కథపై చర్చ.
[105:39] – ‘నాలుగుకాళ్ల మంటపం కథాసంకలనం’ లోని ‘సద్గతి’ కథపై చర్చ.
[114:46] – సాహిత్యానికి పరమార్థం
</div>
పుస్తక ప్రచురణ వివరాలు:
ఈ సంకలనం అన్వీక్షికి పబ్లిషర్స్ ద్వారా ప్రచురింపబడింది. వారి ప్రచురణల గురించి అప్ డేట్స్ కి క్రింది లింక్ ని క్లిక్ చెయ్యండి.
(https://www.facebook.com/AnvikshikiPublishers/)
ఈ పుస్తకం , క్రింది లింక్ ద్వారా ఆర్డర్ చెయ్యవచ్చు.
లేదా ‘నవోదయ’ సాంబశివరావు గారిని క్రింది అడ్రసు, మొబైల్ నెంబర్ ద్వారా సంప్రదించండి.
నవోదయ బుక్ హౌస్
3, కాచిగూడ స్టేషన్ రోడ్ , చప్పల్ బజార్ , కాచిగూడ , హైదరాబాద్
ఫోన్ నెంబర్: 090004 13413
https://goo.gl/maps/nC4BSr2bBvfZgwsm7
*Intro-outro BGM Credits:
Mounaragam Theme – Manaswini Anand (https://youtu.be/s4cARPm3LZ8)
Leave a Reply