సుప్రసిద్ధ సినీ దర్శకులు వంశీ గారి కథ ‘ఏకాదశి చంద్రుడు’

హర్షణీయానికి స్వాగతం. ఈరోజు ‘కథా నీరాజనం’ శీర్షికన, ఏకాదశి చంద్రుడు అనే కథ మీరు వినబోతున్నారు. ఈ కథ వంశీ గారు ‘ ఖచ్చితంగా నాకు తెలుసు’ అనే కథా సంపుటి నించి స్వీకరించ బడింది.

కథలోకెళ్లే ముందర వంశీ గారి గురించి ఓ రెండు మాటలు. వంశీ గారు ఎంత గొప్ప సినీ దర్శకుల్లో, అంత గొప్ప కథారచయిత కూడా.

నేను చూసిన వంశీ గారి మొదటి సినిమా ‘సితార’. ఆ సినిమాలో వంశీ గారి ఫ్రేములకి , ఇళయరాజా గారి సంగీతం తోడై, తెలుగు సినీ ప్రేమికులు ఎప్పటికీ గుర్తుపెట్టుకోదగ్గ చిత్రంగా మిగిలిపోయింది.

వంశీ గారి చాలా చిత్రాలకు, ఇళయరాజా గారు సంగీత దర్శకత్వం వహించారు. అలానే వంశీ గారి చాలా కథలకు బాపు గారు బొమ్మలు వేశారు. ‘ఖచ్చితంగా నాకు తెలుసు’ అనే ఈ కథాసంకలనం లో కూడా అన్నీ బొమ్మలు బాపు గారివే . ఈ పుస్తకాన్ని , అన్వీక్షికి పబ్లిషర్స్ వారు చాలా అందంగా ముద్రించారు.

వీరి ముగ్గురి మధ్య ఉన్న ఇంకో అద్భుతమైన లింకు ఏమిటంటే, ఇళయరాజా గారి సంగీతానికి పోటాపోటీ గా , తమ చిత్రాల్లో visuals present చేసిన దర్శకుల్లో బాపు గారు వంశీ గారు మొదటి స్థానంలో వుంటారు.

ఆయన కథా రచన విషయానికొస్తే, దాదాపుగా రెండు వందల యాభైకి పైగా ఆయన కథలు రాయడం జరిగింది. తెలుగు కథా సాహిత్యంలో మనకు చాలా మంచి కథా రచయితలు వున్నారు అలానే కొంత మంది గొప్ప కథా రచయితలు కూడా.

ఒక మంచి కథకీ, గొప్ప కథకీ మధ్యలో వుండే చిన్న వ్యత్యాసం, ఆ కథని రచయిత ముగించే పద్ధతి అని నేను అనుకుంటాను.

ఉదాహరణకి , మన కథానీరాజనంలో, ఇంతకు ముందు విన్న వంశీ గారి కథ , ‘శంకర్రావు సెల్ఫ్ కాన్ఫిడెన్సు’ నే తీసుకుందాము.

ఆ కథలో శంకర్ రావు కి , సహాయం చేసిన రాజు గారు , మతి స్థిమితం లేని వ్యక్తి అని మనకి చివర్లో తెలుస్తుంది. అక్కడితో ఆ కథ ఆపేసినా కూడా , ఆ కథ ఒక మంచి కథ కిందికే వస్తుంది. కానీ వంశీ గారు ఆ పని చెయ్యలేదు. వెళ్తూ వెళ్తూ ఒక చిన్న వాక్యం రాసారు. అదేంటో ఇప్పుడు మనం ఒకసారి గుర్తు చేసుకుందాం.

“నిజాయితీ పరుడైన ఆయన లోకంలో సమస్యల గురించి ఆలోచించడం వల్ల పిచ్చోడయిపొయ్యేడంట. “

ఇక్కడ ఉన్న ఒక కాంట్రడిక్షన్ ఏంటంటే, అబద్దపు ప్రపంచాన్ని చూసి తట్టుకోలేకపోయిన ఆయన, మతిస్థిమితం తప్పింతర్వాత , తాను నిజవనుకుంటున్న ఒక అబద్ధమైన చెక్కునిచ్చి, ఒక నిండు ప్రాణాన్ని కాపాడ్డం.

ముగింపులో ఈ ఒక్క ముక్క రాయడం ద్వారా , వంశీ గారు , ఒక మంచి కథని ఇంకో రెండు మెట్లు ఎక్కించి, ఉన్న పాటున ఒక గొప్ప కథని చేసేసారు.

ఇప్పుడు మీరు వినబోతున్న ఈ కథలో కూడా ఒక ఉదాత్తమైన ముగింపు వుంది.

ఈయన ఇలానే కథా రచనా జీవితాన్ని సాగిస్తూ, ఇంకా మనకోసం ఎన్నో గొప్ప కథల్ని సృష్టించగలరని ఆశిద్దాం.

పుస్తక ప్రచురణ వివరాలు:

ఈ సంకలనం అన్వీక్షికి పబ్లిషర్స్ ద్వారా ప్రచురింపబడింది. వారి ప్రచురణల గురించి అప్ డేట్స్ కి క్రింది లింక్ ని క్లిక్ చెయ్యండి.

(https://www.facebook.com/AnvikshikiPublishers/)

ఈ పుస్తకం , క్రింది లింక్ ద్వారా ఆర్డర్ చెయ్యవచ్చు.

లేదా ‘నవోదయ’ సాంబశివరావు గారిని క్రింది అడ్రసు, మొబైల్ నెంబర్ ద్వారా సంప్రదించండి.

నవోదయ బుక్ హౌస్

3, కాచిగూడ స్టేషన్ రోడ్ , చప్పల్ బజార్ , కాచిగూడ , హైదరాబాద్

ఫోన్ నెంబర్: 090004 13413

https://goo.gl/maps/nC4BSr2bBvfZgwsm7

*Intro-outro BGM Credits:

Mounaragam Theme – Manaswini Anand (https://youtu.be/s4cARPm3LZ8)

Leave a Reply