Apple PodcastsSpotifyGoogle Podcasts

హర్షణీయంలో పెద్దిభొట్లవారి ‘ఇంగువ’ !

హర్షణీయానికి స్వాగతం. ఇప్పుడు కథా నీరాజనం శీర్షికలో మీరు వినబోతున్న కథ పేరు ‘ఇంగువ’ . ఈ కథ సుప్రసిద్ధ కథా రచయిత కీర్తిశేషులు పెద్దిభొట్ల సుబ్బరామయ్య గారి ‘ పెద్దిభొట్ల సుబ్బరామయ్య కథలు ‘ అనే కథా సంకలనం రెండో భాగం లోనిది. ఆంధ్రా లొయొలా కాలేజీలో అధ్యాపకునిగా జీవిత కాలం సేవలందించిన ఆయన , కవి సామ్రాట్ , శ్రీ విశ్వనాథ సత్యనారాయణ గారి ప్రియ శిష్యులు కూడా.

ఈ పుస్తకం మొదటి రెండో భాగాలు డిజిటల్ ఎడిషన్, ప్రింటెడ్ వెర్షన్, కొనడానికి కింద లింక్స్ ఇవ్వడం జరిగింది.

1938 సంవత్సరంలో గుంటూరు లో జన్మించిన పెద్దిభొట్ల సుబ్బరామయ్య గారు తన జీవిత కాలంలో 350కి పైగా కథలు , 8 నవలలు రాసారు. ఆయన రచనలు ఎన్నో ఇంగ్లీష్ , రష్యన్ తదితర భాషల్లోకి అనువదించబడ్డాయి. ప్రతిష్టాత్మకమైన సాహిత్య అకాడమీ అవార్డు తో బాటు ఆయన రచనలు ఎన్నో పురస్కారాలు అందుకున్నాయి.

ముందు గా ఈ కథపై , హర్షా అభిప్రాయాన్ని తెలుసుకుందాం.

కథలు రెండు రకాలు.

చాలా కథలు చదవడం అవ్వగానే ఎదో ఒక ఫీలింగ్ ని వెంటనే మనలో కలగ చేస్తాయి, అది వినోదం కావచ్చు, విషాదం కావచ్చు, విసుగు కావచ్చు , వికారం కావచ్చు, ఇన్స్టెంట్ కాఫీ లాగా….

రెండో రకం కథలు, ఫిల్టర్ కాఫీ లాంటివి, తాగడం అయిపోయింతర్వాత కూడా వదిలిపెట్టవు . మనల్ని వదలకుండా వెంటాడి కలిచేసి , కరిచేసి మన చుట్టూ వుండే ఏదో ఒక సంఘర్షణనో సమస్యనో అద్దం ముందు పెట్టి , చూపిస్తాయి.

ఇలాంటి కథలే మనతో ఉండిపోతాయి , అవార్డులు రివార్డులూ గెల్చుకుంటాయి.

ఇంగువ ఈ రెండో కోవకు చెందిన కథ.

ఏదో ఒక రంధి లో పడి పొయ్యి, మనం చేయాలనుకునే ఒక పని గాని , తెలుసుకోవాలనుకునే విషయం గాని , ఏళ్ళు ఏళ్ళు దాని గురించి ఏమీ చెయ్యకుండా పోవడం , అలాగే దాన్ని గురించి ఒక అసంతృప్తి, అలా ఉండిపోవడం మనలో చాలా మందికి జరిగే విషయం.

ఒక చిన్న వంట సరుకుని తీస్కొని , అదే విషయాన్ని మెటాఫరికల్ గా ఇంత గొప్ప గా చెప్పాలంటే, అది పెద్దిభొట్ల వారి లాంటి గొప్ప రచనా సామర్ధ్యం వున్న రచయితకు మాత్రమే చెల్లు.

ఇదంతా ఒక ఎత్తయితే , వెదుకుతున్న సమాధానం , ఇంటి చుట్టూ పక్కలే ఉండడం , కథకి అతి గొప్ప కొస మెరుపు.

పుస్తక ప్రచురణ వివరాలు:

ఈ సంకలనం విశాలాంధ్ర పబ్లిషర్స్ ద్వారా ప్రచురింపబడింది.

ఈ పుస్తకం digital edition ని , క్రింది లింక్ ద్వారా ఆర్డర్ చెయ్యవచ్చు.

లేదా ‘నవోదయ’ సాంబశివరావు గారిని క్రింది అడ్రసు, మొబైల్ నెంబర్ ద్వారా సంప్రదించండి.

నవోదయ బుక్ హౌస్

3, కాచిగూడ స్టేషన్ రోడ్ , చప్పల్ బజార్ , కాచిగూడ , హైదరాబాద్

ఫోన్ నెంబర్: 090004 13413

*Intro-outro

Credits:

Mounaragam Theme – Manaswini Anand (https://youtu.be/s4cARPm3LZ8)

“హర్షణీయంలో పెద్దిభొట్లవారి ‘ఇంగువ’ !” కి 3 స్పందనలు

  1. చాలా చక్కని కథను అందించి నందుకు చాలా థాంక్స్…. ఈ మధ్య కాలం లో చదివిన ఒక గొప్ప కథ!!

Leave a Reply