Apple PodcastsSpotifyGoogle Podcasts

శ్రీరమణీయం

హర్షణీయం పాఠకులకి, శ్రోతలకు దీపావళి శుభాకాంక్షలు .

సుప్రసిద్ధ కథకులు , పత్రికా సంపాదకులు శ్రీ శ్రీరమణ గారు, హర్షణీయం కోసం తమ కాలాన్ని వెచ్చించి, తన రచనా జీవితం గురించి వివరించడం జరిగింది. ఈ ఇంటర్వూ నాలుగు భాగాలుగా ప్రసారం చేయబడుతోంది.

శ్రీరమణ గారు గత ఐదు దశాబ్దాలుగా రచనా జీవితం గడుపుతున్నారు.

తెలుగు వచనా రచనలో పేరడీ ప్రక్రియను ప్రారంభించి, పారడీకి తెలుగు సాహిత్యంలో సమున్నత స్థానాన్ని కల్పించిన వారు శ్రీరమణ గారు.

ఆంధ్రజ్యోతి పత్రిక లో కాలమిస్టుగా , నవ్య పత్రికకు సంపాదకునిగా. ఒక గొప్ప కథా రచయితగా ఆయన మనకందరికీ సుపరిచితులు.

ఇదిగాక ఆయన మనందరికీ అత్యంత ప్రేమ పాత్రులైన బాపురమణ గార్లతో, దాదాపుగా రెండు దశాబ్దాలకు పైగా, అత్యంత సన్నిహితుడై , వారితో పాటూ సినీప్రయాణం చేశారు.

వ్యంగ్య , హాస్య రచనలే కాక , బంగారు మురుగు , మిధునం వంటి అత్యంత హృద్యమైన కథలను కూడా వారు రచించడం జరిగింది.

తమ అనుభవాలను హర్షణీయంకు అందించిన , శ్రీ శ్రీరమణగారికి హర్షణీయం కృతజ్ఞతలు తెలుపుకుంటోంది.

శ్రీరమణగారి గురించి మరిన్ని వివరాలు క్రింది వికీ పేజీ లో మీరు చూడవచ్చు.

Leave a Reply