‘ఎదారి బతుకులు’ రచయిత్రి భారతి గారితో ఇంటర్వ్యూ !

‘ఎదారి బతుకులు’ రాసిన ఎండపల్లి భారతి గారు, చిత్తూరు జిల్లా, దిగువ బురుజు గ్రామానికి చెందిన వారు.

ప్రాధమిక విద్యను అభ్యసించిన భారతి గారు, గ్రామీణ జీవిత సమస్యలను, వస్తున్న మార్పులను, దగ్గరగా గమనిస్తూ వచ్చారు.

గత ఇరవై సంవత్సరాలుగా చిత్తూరుజిల్లా ‘వెలుగు’ మహిళా సంఘాల (SERP – సెల్ఫ్ హెల్ప్ గ్రూప్) పత్రిక ‘నవోదయం’లో విలేఖరి గా పనిచేస్తున్నారు.

ప్రముఖ స్టిల్ లైఫ్ ఆర్టిస్ట్, సామాజిక కార్యకర్త , కిరణ్ కుమారి గారి ప్రోత్సాహంతో, కథలు రాయడం మొదలుపెట్టారు. వీడియోగ్రఫీ నేర్చుకుని కొన్ని వీడియో ఫిలిమ్స్ కూడా భారతి గారు తీయడం జరిగింది.

ఇంటర్వ్యూలో భారతి గారు, తన కథల గురించే కాక, గ్రామీణ జీవితం గురించి, పాఠశాలల్లో విద్యావిధానం గురించి, ఇతర సమస్యల గురించి కూడా మాట్లాడటం జరిగింది.

భారతి గారి రెండో కథల పుస్తకం హైదరాబాద్ బుక్ ట్రస్ట్ ద్వారా త్వరలో మన ముందుకు రాబోతోంది.

ఈ ఎపిసోడ్ కు తమ సహకారాన్ని అందించిన , కిరణ్ కుమారి గారికి , అపర్ణ తోట గారికి హర్షణీయం కృతజ్ఞతలు తెలుపుకుంటోంది.

ఇంటర్వ్యూ రెండు భాగాలుగా ప్రసారం అవుతోంది.

ఇంటర్వ్యూ లో కి వెళ్లబోయే ముందు, ‘ ఎదారి బతుకులు ‘ కథలపై , సొలొమోన్ విజయకుమార్ గారి అభిప్రాయం విందాం.

ఈ పుస్తకం కొనడానికి – https://hyderabadbooktrust.com/product/edari-batukulu-endapalli-bharathi-2

‘హర్షణీయం’ పాడ్కాస్ట్ ని ‘గానా’ (Ganaa) అప్ ద్వారా వినాలంటే –https://gaana.com/podcast/harshaneeyam-season-1

స్పాటిఫై యాప్ లో వినాలంటే –http://bit.ly/harshaneeyam (Harshaneeyam on Spotify)

ఆపిల్ ఐట్యూన్స్ లో వినాలంటే –http://apple.co/3qmhis5 (Harshaneeyam on Apple. Podcast)

Leave a Reply