Apple PodcastsSpotifyGoogle Podcasts

అనిల్ అట్లూరి గారితో సంభాషణ

ఈ ఎపిసోడ్ లో రచయిత, అనువాదకులు, కాలమిస్ట్ అనిల్ అట్లూరి గారు తన సాహితీ జీవితం గురించి, పుస్తక ప్రచురణ రంగంలో వస్తున్న అనేక మార్పుల గురించి విస్తారంగా హర్షణీయంతో మాట్లాడారు. అనిల్ అట్లూరి గారి తండ్రి ప్రముఖ సినీ రచయిత, కథా రచయిత అట్లూరి పిచ్చేశ్వర రావు గారు. తల్లి చౌదరాణి గారు స్థాపించిన ‘రాణి బుక్ సెంటర్’ ద్వారా అనిల్ అట్లూరి తెలుగు పుస్తకాలను అనేక దశాబ్దాలు మద్రాసులోని పుస్తక ప్రేమికులకు అందించారు. అనిల్ గారి మాతామహులు కవి రాజు త్రిపురనేని రామస్వామి గారు. ప్రస్తుతం కథాసాహిత్యంపై ప్రతి నెలా రెండో శని వారం వేదిక అనే ఆన్లైన్ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. వేదిక బ్లాగ్లో సాహితీ వ్యాసాలు రాస్తున్నారు.

అనిల్ గారు ప్రచురించిన ‘అట్లూరి పిచ్చేశ్వర రావు కథలు’ పుస్తకం కొనడానికి కింది లింక్ ఉపయోగించండి.

https://bit.ly/Atluri

అలాగే ప్రతి నెలా కథ సాహిత్యం గురించి వారు నిర్వహించే చర్చా క్రమం గురించి ఎప్పటికప్పుడు వివరాలు తెలుసుకోడానికి కింది లింక్ మీద క్లిక్ చేసి వాట్సాప్ గ్రూప్ లో చేరండి.

https://bit.ly/kathavedika

*హర్షణీయం పాడ్కాస్ట్ గురించి మీ అభిప్రాయాన్ని ఈ క్రింది ఫార్మ్ ద్వారా మాకు తెలియ చేయండి. మీ అభిప్రాయం మాకు చాలా విలువైనది. ( feedback form) –

https://bit.ly/3NmJ31Y

Leave a Reply