‘చిలుకంబడు దధికైవడి’ – మూలం తమిళ రచయిత జెయమోహన్ రచన ‘మత్తుఱు తయిర్’

ఈ కథకు మూలం ప్రముఖ తమిళ రచయిత జెయమోహన్ రాసిన  ‘మత్తుఱు తయిర్’ (Mathuru thayir Jayamohan | மத்துறு தயிர் ஜெயமோகன்) అనే కథ.  జెయమోహన్ గారి ‘అఱం’ అనే కథాసంకలనం లోనిది.

‘అఱం’ లోని పన్నెండు కథలు, నిజ జీవితంలోని ప్రత్యేకమైన, ప్రసిద్ధమైన  వ్యక్తుల గురించి మనకు చెబుతూ   రచయిత రాసిన  కథలు.

ఈ కథలోని ముఖ్య పాత్ర , తిరువనంతపురం విశ్వవిద్యాలయ ఆచార్యుడుగా  తమిళ సాహిత్యాన్ని బోధించిన ప్రొఫెసర్ జేసుదాసన్. (https://tamil.wiki/wiki/Professor_Jesudasan) కన్యాకుమారి జిల్లాలో ఒక నీరుపేద కుటుంబంలో జన్మించారు.   ‘కంబ రామాయణం’  విస్తృతంగా అధ్యయనం చేసి, అందులోని కవితా సౌందర్యాన్ని ఆస్వాదిస్తూ వేలాది విద్యార్థులను తన  ఉపన్యాసాలతో  అపరిమితంగా ప్రభావితం చేసి, వారిని  సాహిత్యం వైపు మళ్ళించారు. తమిళ సాహితీ విమర్శకుడిగా కూడా ఎంతో పేరు గడించిన   ప్రొఫెసర్ జేసుదాసన్ 2002 వ సంవత్సరంలో మరణించారు.

రామాయణంలోని సీతారాముల మధ్య వియోగాన్ని కంబ రామాయణం లోని పద్యాల ద్వారా మనకు వివరిస్తూ, వర్ణిస్తూ, తద్వారా గురు శిష్యుల మధ్య సంబంధాన్ని గొప్పగా ఆవిష్కరించిన కథ ఇది.

*ఈ కథలో ప్రస్తావించబడ్డ పద్యాలు పూతలపట్టు శ్రీరాములురెడ్డి గారు తెనిగించిన  ‘కంబ రామాయణం’ లోనివి.

ఈ కథ PDF లో డౌన్లోడ్ చేసుకోడానికి –

https://bit.ly/chilukambadu

Leave a Reply