అదే గాలి, అదే ఆకాశం, అదే నేల, అదే కాంతి, అదే నీరు …… కవిత్వాన్ని పాంచభౌతిక పదార్థంగా నిర్వచించి దేశ విదేశాల కవిత్వాన్ని స్వయంగా అనుభవించి పదిమందీ ఆస్వాదించడానికి అనువదించి అందిస్తున్న ముకుంద రామారావు స్వయంగా కవి. అనువాద రంగంలో ఆయన కృషి అనితర సాధ్యం. ‘శతాబ్దాల సూఫీ కవిత్వం’ ద్వారా సూఫీ తత్త్వ సారాన్ని కాచి తెలుగులోకి వడగట్టి పోశారు. నోబెల్ బహుమతి పొందిన కవుల కవిత్వ జీవిత విశేషాల్ని క్రోడీకరిస్తూ వారి విశిష్ట కవితల్ని అనువదిస్తూ ‘నోబెల్ కవిత్వం’ ప్రకటించారు. భరతవర్షం – సీతాకాంత మహాపాత్ర ఒరియా కావ్యాన్ని ఆంధ్రీకరించారు. అనేక భాషల ప్రధమ కావ్యం గా గుర్తింపు పొందిన పదవ శతాబ్దపు మహాయాన బౌద్ధుల నిర్వాణ గీతాల్ని ‘చర్యాపదాలు’ పేరుతొ అనువదించి సాంధ్య భాషలో దాగివున్న మహాయాన బౌద్ధ సిద్ధాచార్యుల ఉపదేశాల్ని నోరారా వినిపించారు. ఇటీవలే బెంగాలీ బౌల్ కవిత్వాన్నీ అస్సామీ మియా కవిత్వాన్నీ అనువదించి తొలిసారిగా పుస్తకరూపంగా ప్రచురించారు. స్వయంగా కవి కావడంవల్ల అనువాదాలకు సైతం సృజనాత్మక శైలినీ సహజత్వ శోభనీ అద్దుతున్నారు. కవిత్వ పరుసవేది విద్యని సహజాతంగా అలవర్చుకున్న ముకుంద రామారావు గారితో సాహితీ విమర్శకులు ఏ. కె. ప్రభాకర్ చేస్తున్న సంభాషణ ఈనాటి హర్షణీయంలో వినండి.
ముకుంద రామారావు గారి రచనలు ఛాయా పబ్లిషర్స్ ద్వారా లభ్యం అవుతున్నాయి.
కొనడానికి వాట్సాప్ ద్వారా 98480 23384 ని సంప్రదించండి.
*హర్షణీయం పాడ్కాస్ట్ గురించి మీ అభిప్రాయాన్ని ఈ క్రింది ఫార్మ్ ద్వారా మాకు తెలియ చేయండి. మీ అభిప్రాయం మాకు చాలా విలువైనది. ( feedback form) –
Leave a Reply