‘యాత్ర’ కథ (మూలం: జెయమోహన్ గారి ‘పెరువలి’)

ప్రసిద్ధ తమిళ రచయిత శ్రీ జెయమోహన్ రచించిన  ‘అఱం’  అనే కథా సంపుటంలోని ‘పెరువలి’.  తెలుగులో యాత్ర అనే పేరుతో అనువదించబడింది. ఈ కథ ను కింది లింక్ ను వుపయోగించి, ఈమాట వెబ్ మ్యాగజైన్ ఏప్రిల్ 23 సంచికలో చదువుకోవచ్చు.

‘అఱం’ లోని కథలన్నీ  నిజజీవితంలో ఆయనకు తారసపడ్డ గొప్ప వ్యక్తుల గురించి జెయమోహన్ గారు రాసినవి.

కథలో  ముఖ్య పాత్రధారి ప్రముఖ తమిళ నాటక రచయిత, కళాకారుడు కోమల్ స్వామినాథన్. వెన్నెముక కాన్సర్ తో బాధ పడుతున్న కోమల్ మానస సరోవర యాత్రకు పూనుకోవడం ఈ కథాంశం.

*ఈ కథ గురించి రచయిత అజయ్ ప్రసాద్ గారి అభిప్రాయాన్ని ఈ ఎపిసోడ్ లో విందాం.

*కోమల్ స్వామినాథన్ గారి గురించి మరిన్ని వివరాలకు –

http://bit.ly/42IVPgv

*ఒక చిన్న గమనిక – హర్షణీయం స్పాటిఫై ఆప్ ద్వారా వినే శ్రోతలు  ఇప్పుడు తమ   అభిప్రాయాన్ని తెలియచేసే అవకాశం వుంది. మీ అభిప్రాయాలు వెంటనే ఆప్ ద్వారా ప్రచురితం అవుతాయి.

Leave a Reply