అరిపిరాల సత్యప్రసాద్ గారు , ఇండియన్ ఇన్స్టిట్యూట్ అఫ్ రూరల్ మానేజ్మెంట్, ఆనంద్ లో చదువుకున్నారు. గుంటూరు స్వస్థలం. ప్రస్తుతం ఐ డీ ఎఫ్ సీ ఫస్ట్ భారత్ లిమిటెడ్ లో, లెర్నింగ్ అండ్ డెవలప్మెంట్ డివిజన్ కి జనరల్ మేనేజర్ గా పని చేస్తున్నారు. జరుగుతున్నది జగన్నాటకం’ , ‘రూపాయి చెప్పిన బేతాళ కథలు’ ఆయన రచనలు. కథల మీద, నవల మీద సమీక్షావ్యాసాలు రాస్తుంటారు. కొన్ని కథా సంకలనాలకు సంపాదకత్వం వహించారు. లఘుచిత్రాలను తీశారు. సినిమాలపై ఆయనకున్న ఆసక్తితో, ఐదేళ్ళ పై విషయ సేకరణ చేసి, ‘ప్రపంచ సినిమా చరిత్ర’ పుస్తకాన్ని రచించారు. అన్వీక్షికి పబ్లికేషన్స్ ద్వారా ఈ పుస్తకం ఇటీవలే విడుదలైంది.
ఈ సంభాషణలో ఆయన ప్రపంచ సినిమా చరిత్ర పుస్తకం గురించి, రచనా ప్రక్రియ గురించి అనేక ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు.
ప్రపంచ సినిమా చరిత్ర పుస్తకం కొనడానికి లింక్ –
*హర్షణీయం పాడ్కాస్ట్ గురించి మీ అభిప్రాయాన్ని ఈ క్రింది ఫార్మ్ ద్వారా మాకు తెలియ చేయండి. మీ అభిప్రాయం మాకు చాలా విలువైనది. ( feedback form) –
Leave a Reply