-
‘ఏర్పాట్లు ‘ – ఇందిరా పార్థసారథి
తమిళ రచయిత ఇందిరా పార్థసారధి రాసిన ‘ఏర్పాట్లు’ అనే ఈ కథ ను తెలుగులోకి అనువదించింది జిల్లెళ్ళ బాలాజీ గారు. ఛాయా పబ్లికేషన్స్ ప్రచురించిన ‘నీళ్ళ కోడి’ కథాసంకలనం లోనిది. ఇందిరా పార్థసారధి సుప్రసిద్ధ తమిళ రచయిత. తన రచనలకు, సరస్వతీ సమ్మాన్, సంగీత నాటక అకాడమీ, సాహిత్య అకాడమీ, పద్మశ్రీ లాంటి ఎన్నో పురస్కారాలను పొందారు. ‘నీళ్ళ కోడి’ కొనడానికి – https://amzn.to/44Jov9x
-
అచ్చ తెనుగు కథ, ‘తలుపు’ : తమిళ మూలం – కి. రాజనారాయణన్
ఈ ఎపిసోడ్ లోని కథ ‘తలుపు’ – తమిళ మూలం రచయిత కి.రాజనారాయణన్. తెలుగు వారైన కి. రాజనారాయణన్ తమిళంలో సుప్రసిద్ధ రచయిత. కేంద్ర సాహిత్య పురస్కార గ్రహీత. ఈ కథను స. వెం రమేశ్ గారు తెలుగులోకి అనువదించారు. ఈ కథ ‘తెన్నాటి తెమ్మెర’ కథా సంకలనంలో చోటు చేసుకుంది. ఈ సంకలనంలోని కథలన్నీ కూడా తెలుగు మూలాలున్న తమిళ రచయితలు రాసినవి. అన్ని తమిళ మూల కథలను రమేశ్ గారే తెలుగు లోకి అనువదించారు.
-
తెలుగు వారి తమిళ కథలు – ‘తెన్నాటి తెమ్మెర’ కథాసంకలనం గురించి స.వెం. రమేష్ గారితో.
ఈ ఎపిసోడ్ లో శ్రీ. స. వెం. రమేశ్ తాను సేకరించి సంపాదకీయం వహించిన ‘తెన్నాటి తెమ్మెర’ కథాసంకలనాన్ని మనకు పరిచయం చేస్తారు. ఈ కథలన్నీ కూడా తెలుగు మూలాలున్న తమిళ రచయితలు రాసినవి. తమిళ మూల కథలను రమేశ్ గారే తెలుగు లోకి అనువదించారు.
-
తేజో-తుంగభద్ర నవల గురించి రచయిత వసుధేంద్ర తో సంభాషణ (Conversation with Vasudhendra)
కన్నడలో అనేక కథాసంకలనాలు, వ్యాసాలతో పాటు రెండు నవలలు రచించారు వసుధేంద్ర. కర్ణాటక సాహిత్య అకాడమీ బహుమతి, యు ఆర్ అనంతమూర్తి అవార్డులతో పాటు ఎన్నో ప్రశంసలు పురస్కారాలు అందుకున్నారు. ఆయన రాసిన తేజో తుంగభద్ర నవల, 1490 – 1520 సంవత్సరాలలో పోర్చుగల్ దేశం, విజయనగర సామ్రాజ్యంలో జరిగిన కొన్ని సంఘటనలను ఆధారంగా చేసుకుని రచింపబడింది. ఇప్పుడు తెలుగులో రంగనాధ రామచంద్ర రావు గారి అనువాదంతో, ఛాయా పబ్లిషర్స్ ద్వారా మీ ముందుకు వచ్చింది. పోర్చుగల్…
-
‘చెఖోవ్ కథలు – 1’ పుస్తకం, అనువాదకులు అరుణ గారితో పరిచయం
‘Father of Modern short story’ అని చెప్పబడే రష్యన్ రచయిత చెఖోవ్ , 1880 – 1905 ప్రాంతంలో ఆరువందలకు పైగా కథలను రాసారు. ఈయన కథలు ప్రపంచ వ్యాప్తంగా. అనేక భాషల్లో అనువదించబడి ప్రాచుర్యాన్ని పొందాయి. ఇంగ్లీష్ నించి చెఖోవ్ కథలను తెలుగులోకి అనువదించి మన ముందుకు తెస్తున్నారు శ్రీమతి అరుణ గారు. ఈ పుస్తకం గురించి ఈ ఎపిసోడ్ లో ఆమె మనకు వివరిస్తారు. ఎపిసోడ్లో ముందుగా ఈ పుస్తకాన్ని మనకు అందిస్తున్న…
-
‘చిలుకంబడు దధికైవడి’ – మూలం తమిళ రచయిత జెయమోహన్ రచన ‘మత్తుఱు తయిర్’
ఈ కథకు మూలం ప్రముఖ తమిళ రచయిత జెయమోహన్ రాసిన ‘మత్తుఱు తయిర్’ (Mathuru thayir Jayamohan | மத்துறு தயிர் ஜெயமோகன்) అనే కథ. జెయమోహన్ గారి ‘అఱం’ అనే కథాసంకలనం లోనిది. ‘అఱం’ లోని పన్నెండు కథలు, నిజ జీవితంలోని ప్రత్యేకమైన, ప్రసిద్ధమైన వ్యక్తుల గురించి మనకు చెబుతూ రచయిత రాసిన కథలు. ఈ కథలోని ముఖ్య పాత్ర , తిరువనంతపురం విశ్వవిద్యాలయ ఆచార్యుడుగా తమిళ సాహిత్యాన్ని బోధించిన ప్రొఫెసర్ జేసుదాసన్. (https://tamil.wiki/wiki/Professor_Jesudasan)…
-
ప్రసాదం : కథా మూలం – ప్రసిద్ధ తమిళ రచయిత సుందర రామస్వామి గారు
ప్రసాదం – ఈ కథకు మూలం ప్రసిద్ధ తమిళ రచయిత సుందర రామస్వామి గారు. కథలోకి వెళ్లబోయే ముందు ఒక చిన్న గమనిక – హర్షణీయం స్పాటిఫై ఆప్ ద్వారా వినే శ్రోతలు ఇప్పుడు కథపై తమ అభిప్రాయాన్ని తెలియచేసే అవకాశం వుంది. మీ అభిప్రాయాలు వెంటనే ఆప్ ద్వారా ప్రచురితం అవుతాయి. స్పాటిఫై ద్వారా హర్షణీయం ను వినడానికి, కొత్తగా వచ్చే ఎపిసోడ్స్ ని వెంటనే ఉచితంగా డౌన్లోడ్ చేసుకోడానికి ఇక్కడ ఇచ్చిన లింక్…
-
‘కూటి ఋణం’ అవినేని భాస్కర్ గారి అనువాద కథపై సమీక్ష
ప్రసిద్ధ తమిళ రచయిత జెయమోహన్ గారి తమిళ కథ సోట్ఱు కణక్కు , ‘కూటి ఋణం’ అనే పేరుతో అవినేని భాస్కర్ గారు చక్కగా అనువదించారు. ఈ ఎపిసోడ్ లో, చాలా కాలంగా హర్షణీయం పాడ్కాస్ట్ ని ఫాలో అవుతున్న అర్చన గారు ఈ కథపై తమ అభిప్రాయాన్ని వెల్లడిస్తారు. అర్చన గారు సాఫ్ట్వేర్ రంగంలో పని చేస్తారు. తెలుగు ఇంగ్లీష్ కథాసాహిత్యం పై ఆసక్తి వుంది. ఈ కథ ఈమాట వెబ్ మ్యాగజైన్ లో ప్రచురింపబడింది.…
-
‘యాత్ర’ కథ (మూలం: జెయమోహన్ గారి ‘పెరువలి’)
ప్రసిద్ధ తమిళ రచయిత శ్రీ జెయమోహన్ రచించిన ‘అఱం’ అనే కథా సంపుటంలోని ‘పెరువలి’. తెలుగులో యాత్ర అనే పేరుతో అనువదించబడింది. ఈ కథ ను కింది లింక్ ను వుపయోగించి, ఈమాట వెబ్ మ్యాగజైన్ ఏప్రిల్ 23 సంచికలో చదువుకోవచ్చు. ‘అఱం’ లోని కథలన్నీ నిజజీవితంలో ఆయనకు తారసపడ్డ గొప్ప వ్యక్తుల గురించి జెయమోహన్ గారు రాసినవి. కథలో ముఖ్య పాత్రధారి ప్రముఖ తమిళ నాటక రచయిత, కళాకారుడు కోమల్ స్వామినాథన్. వెన్నెముక కాన్సర్ తో…
-
కథ – నిక్కీ (తమిళ మూలం: శ్రీ జయకాంతన్)
నిక్కి అనే ఈ కథకు మూలం ప్రఖ్యాత తమిళ రచయిత జయకాంతన్. తెలుగులోకి అనువదించింది సుప్రసిద్ధ కథా రచయిత మధురాంతకం రాజారాం గారు. 1934 వ సంవత్సరంలో కడలూరు లో జన్మించిన జయకాంతన్ తమిళంలో రెండువందలకు పైగా కథలు , నలభైకి పైగా నవలలు రాశారు. తన సాహితీ కృషికి గుర్తింపుగా జ్ఞానపీఠ్, కేంద్ర సాహిత్య అకాడమీ లాటి అనేక ప్రతిష్టాత్మకమైన అవార్డులు గెలుచుకున్నారు. 2009 వ సంవత్సరంలో భారత ప్రభుత్వం ఈయనకు పద్మభూషణ్ ను ప్రదానం…
-
‘పది రోజులు’ – ఐదుకాళ్ళ మనిషి పుస్తకం నుంచి
‘పది రోజులు’ అనే ఈ కథకు మూలం ‘పట్టు నాట్కళ్’ అని శ్రీ అప్పాదురై ముత్తులింగం రచించినది. తమిళంలో ఈయన రాసిన కథలను, అతి చక్కగా తెలుగులోకి అనువదించారు శ్రీ అవినేని భాస్కర్ గారు. ఛాయా ప్రచురించిన ఈ పుస్తకం పేరు ‘ఐదు కాళ్ళ మనిషి’. శ్రీలంకలో జన్మించిన శ్రీ ముత్తులింగం శ్రీ లంక లో ఛార్టర్డ్ అకౌంటెన్సీ లో , ఇంగ్లాండ్ లో మానేజ్మెంట్ అకౌంటెన్సీ లో పట్టా పుచ్చుకున్నారు. శ్రీలంక పాకిస్తాన్ లతో…
-
‘తెరిచున్న కిటికీ’
‘తెరిచున్న కిటికీ’: మూలం – హెక్టర్ హ్యూగో మన్రో (Saki) రాసిన ‘The Open window’ (https://americanliterature.com/author/hh-munro-saki/short-story/the-open-window) “అత్తయ్య ఇప్పుడే వచ్చేస్తుందండీ, ఈలోపల నా కంపనీ భరించాలి మీరు” అంది ఆ పదిహేనేళ్ల యువతి నవ్వుతూ, కొత్త మనిషిని కలుస్తున్నాను అన్న బెరుకేవీ లేకుండా. వాళ్ళ అత్త రాక ప్రాముఖ్యతని తక్కువ చేయకుండా, ఈ అమ్మాయిని పొగుడుదామని కొంత ఉత్సాహపడ్డాడు, ఫ్రాంటన్ నట్టెల్. నిజానికి, ఇలా ఒకరి తర్వాత ఒకర్ని, కొత్తవాళ్ళని కలవడం అతనికంత గొప్ప…