Apple PodcastsSpotifyGoogle Podcasts

  • రామ లక్ష్మణు లాటి వారేమో అలా, సుందోపసుందులేమో ఇలా!

    నాకు మేనత్త రవణమ్మకిన్ను మా నాన్న మేనమామ రవణయ్యకిన్నుపెళ్లి చేసేసారు, మా తాత ఆదెయ్య మరియు మా నాన్నమ్మ ఆదెమ్మ లు కలిసి. మా నాయనకి, మా చిన్నాయన కి, నాకు, మా అన్నకీ ఆఖరుకి మా అమ్మ అక్కల పిల్లకాయలకి అందరికీ ఆయన రవణ మావే. ఆయన మాకు ఇల్లరికపుటల్లుడు. మాటల్లోనే కాదు చేతల్లో కూడా మహాదూకుడు. ఆయన నడిస్తే పక్కనోళ్లు పరిగెత్తాలి, ఇద్డుమ్ వడ్ల బస్తా భుజం మీద నుండి విసిరేస్తే ఆరడుగుల దూరంలో…

  • మా ఉలవపాళ్ళ స్వామి!

    నాకు ఐదేళ్ల వయస్సులో మా ఉలవపాళ్ళలో, మామిడేళ్ల కిష్ట, అక్కిశెట్టి శేషగిరి మరియు మా వూరి పూజారి కొడుకైన స్వామి అనే ముగ్గురు స్నేహితులు వుండేవాళ్ళు. మా ఆటలు, పాటలు మరియు తిరుగుళ్ళు అన్నీ కలిసే ఉండేవి. వీటిల్తో పాటు మాకు ఇంకో ముఖ్యమైన రోజువారీ, లేక రోజుకు పలుమార్లు వుండే కార్యక్రమం ఉండేది. అదేమిటంటే తిన్నది అరిగాక, వూరికి వెనకాల వుండే చెరువు దగ్గరకో, లేక వూరికి ముందు వుండే వాగు దగ్గరకో వెళ్లి అరగక…

  • అబద్దం, నిప్పులాంటిది!

    అబ్బాయిల్లారా! మీకు అబద్ధం చెబితే ఎలా దొరికి పోతామో అన్నదానిమీద నా అనుభవం  చెప్తా. ఈ మధ్య కాలం లో నా క్లాసుమేట్ నుండి వాట్సాప్ మెసేజ్ వచ్చింది తను ఒక శనివారం ఉదయాన నాలుగు గంటలకు శంషాబాద్ లో దిగుతున్నానని, వచ్చి తనని తీసుకెళ్లి వాళ్ళ మేనమామ ఇంట్లో దిగపెట్టమని. తెగ ఆలోచించేసా ఆ టైంలో ఇంట్లో ఏమి చెప్పి వెళ్లాలా అని. మీకా డౌట్ వద్దు ఆడ స్నేహితమా లేక మగ స్నేహితమా అని.…

  • ఎంత వరకూ తిట్టగలదో, చెప్పకనే చెప్పిన మా చిన్నది!

    మా చిన్నది ఈ రోజున తన సహాధ్యాయుడైన ఒక అబ్బాయిని, దున్నపోతు, పనికిమాలిన వెధవ అంటూ తిట్టటం మొదలుపెట్టింది. వినీ, వినీ ఇక వినలేక, ఏమయ్యిందమ్మా అనడిగా. మా స్నేహితురాలి చరవాణి నంబరుని మా బస్సు డ్రైవేరొకడు అడిగాడని ఇచ్చేసాడు మరో ఆలోచన లేకుండా. ఇప్పుడా డ్రైవర్, నా మా చిన్నది ఈ రోజున తన సహాధ్యాయుడైన ఒక అబ్బాయిని, దున్నపోతు, పనికిమాలిన వెధవ అంటూ తిట్టటం మొదలుపెట్టింది. వినీ, వినీ ఇక వినలేక, ఏమయ్యిందమ్మా అనడిగా.…

  • అంతేగా, అంతేగా అనండి, అటుపై చూడండి!

    ఓయ్ వాషింగ్ మెషిన్ లో నా చీరలు వేసున్న వెళ్లి ఆరవెయ్యి అంది మా ఆవిడ. ఇలా అడపా దడపా నాలో ఎమన్నా పురుషాహంకారం లేచి బుసలు కొడుతుందో లేదో అని పరీక్ష పెడుతుంది తను. గుడ్ బాయ్, అని మెచ్చుకుంది ఆరేసి వచ్చాక. ఆరేసుకో పోయి పారేసుకున్నావు హరీ, నీ కోకెత్తికెళ్లింది కొండగాలీ అంటూ ఆరెయ్యటంలో ఆనందం ఎందరికి తెలుసు. మా అన్న అయితే, ఛీ ! నువ్వు మరీ హెన్ను పెక్కుడు హస్బెండువి (పరమ…

  • ఈ కథకి టైటిల్ పెట్టటం నా వల్ల కాదు!

    నా అమెరికా ప్రయాణం మరియు డెన్వర్ కి చేరటంలో పడ్డ అష్టకష్టాలు నేను ఇదివరకే మీకు నా అమెరికా యాత్రలో వివరించాను. నా డెన్వర్ కష్టాలు అంతటితో ఆగలేదు. నేను మరియు మన నాయుడుపేట వాసి అయిన బుడ్డ రాజేషు ఒక సంక్లిష్టమైన ప్రాజెక్ట్ ని చేపట్టాము. అదేమియనగా మా ఖాతాదారుని యొక్క ఖాతాదారుల వివరాలను ఒక పాత డేటాబేస్ నుండి కొత్త డేటా బేస్ కి వలస యొనర్చటం. ఈ క్రమంలో మేమిద్దరం కలిసి ఒక…

  • నా మొదటి ప్రవాస జీవనానుభవం!

    నా మొదటి ప్రవాస జీవితం దక్షిణాఫ్రికా లోని జోహనెస్బర్గ్ లో మొదలయ్యింది. ఆనాడు దక్షిణాఫ్రికా లో రెండు ప్రధాన బ్యాంకు సమూహాలుండెడివి, ఒకటి ఏ.బి.ఎస్.ఏ మరియు రెండవది నెడ్కోర్. నేను ఏ.బి.ఎస్.ఏ బ్యాంకు వాళ్ళ అసెట్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ లో పని చేసే వాడిని. మా బస మరియు రవాణా అంత మా కంపెనీ నే ఏర్పాటు చేసింది. జోహనెస్బర్గ్  కంతటికీ అందమైన సాండ్ టన్ అనే ప్రదేశంలో సాన్మారియో అనే గృహ సముదాయం లో. చాలా…

  • మా పల్లెటూరోళ్ల, గత కాలపు వినోదాలు!

    నేను చాల రోజుల నుండి మన మధ్య నుండి మాయమై పోయిన ఒకప్పటి వినోదాల గురుంచి రాయాలనుకుంటున్న. కాక పోతే గత పల్లెవాసిగా నావన్నీ ఒకప్పటి గ్రామాల్లో కనిపించి ఇప్పుడు మాయమయ్యినవి అయ్యుంటాయి. మొదట మనందరికీ ఇష్టమైన ఆసక్తికర మైన రికార్డింగ్ డాన్స్ లతో మొదలెడుతా. మా వూరిలో శ్రీరామనవమి నాలుగు రోజులో ఐదు రోజులో జరిగేది. ఒక్కో రోజు ఒక్కొక్కరి ఉభయం.

  • దేశం కానీ దేశంలో , బ్రతుకు చక్రమాగితే!

    నిజామాబాద్ కి చెందిన నర్సింలూ కన్నా, నా సహోద్యోగి సీటెల్ లో ఒకప్పుడు. మనిషి చాల చలాకీగా, ఆరోగ్యంగా మరియు క్రీడాకారుల కుండే దేహదారుఢ్యంతో వుండే వాడు. కమా వాళ్ళు ఆడే సరదా క్రికెట్ కి, నాయకుడు కూడా. తనకి ఇద్దరు పిల్లలు – ఒక అమ్మాయీ మరియు ఒక అబ్బాయి. వాళ్ళ అమ్మాయి మా చిన్నదానికన్నా వయస్సులో రెండు నెలలు చిన్న మరియు మా పెద్దదానికంటే పొడవులో రెండు అంగుళాలు మిన్న. మేము సహోద్యోగులము మరియు…

  • ఈ కథ చదవాలంటే, ఓపిక అనే బతుకు కళ ఖచ్చితంగా కావాలి!

    నా సరికొత్త వాహనానికి నెంబర్ ప్లేట్ బిగించుకుందామని రవాణాశాఖ కార్యాలయానికి వెళ్ళా. అక్కడ నా వంతు రావడానికి సమయం పట్టింది కొంత. ఈ లోపల అక్కడ చిన్న చితకా పిల్లకాయలు గాలి పటాలు ఎగరేస్తుంటే వాళ్ళని గమనించటం మొదలెట్టా. వాళ్ళ కేరింతలు, వాళ్ళ ఆనందం వర్ణనాతీతం అది చరవాణుల్లో కదలక మెదలక ఆటలాడే మన పిల్లలకు బహుదూరం.

  • నాకున్నూ, నా పిల్లలకున్నూ, ఓ రోజు జరిగిన సంభాషణ!

    నాకున్నూ నా పిల్లల మధ్య జరిగి నొక సంభాషణ నిక్కడ రాస్తున్నా. చిన్నది టెన్త్ లోను పెద్ద దింటర్లో నున్నప్పటి మాట. వాళ్ళు వాళ్ళ స్కూల్ లోను లేక కాలేజీ లో జరిగిన సంఘటనలు మాతో చెబుతూ వుంటారు.

  • నా కథల వెనుక అసలు కథ !

    నా స్నేహితులు నన్నడిగారు, నీ కథలతో పడలేకున్నామురా, అసలు నువ్వెందుకు చెప్పాలనుకుంటున్నావు  అని. అసలే కథల కామరాజును కదా నేను, అందుకే నా కథల వెనక కథ ఇక్కడ చెప్తున్నా. నా  బాల్యం ఉన్నంతలో బాగానే జరిగింది, నేను బడికి వెళ్లే వరకు. నాకెందుకో మొదటి నుండి బడికి వెళ్ళటమంటే చెడ్డ చిరాకు. బడి ఎగ్గొట్టడానికి కడుపు నొప్పులు, ఎండలో ఎక్కువసేపు నిలబడి జ్వరాలు తెచ్చుకోవటాలు, ఆ జ్వరాలు నాకే కాదు మా అయ్యోర్లకు కూడా వచ్చేయని…

  • నేను, నా మనవడూ!

    మా పెద్దమ్మ కూతురి మనవడు అభిరాం. వాడి వయస్సప్పుడు మూడేళ్లు. కొన్నాళ్ళు నేను ప్రాజెక్ట్ పని మీద చెన్నైలో వాళ్ళింట్లో ఉండాల్సి వచ్చింది. వాళ్ళదొక డూప్లెక్స్ బాడుగిల్లు. పైన నాకొక బాత్ రూమ్ కూడా కలిసి వుండే పెద్ద రూమ్ ఇచ్చేసారు వాళ్ళు.

  • మా అమ్మ తప్పిపోయింది, నా చిన్నప్పుడు!

    అమ్మమ్మ వాళ్ళది దగదర్తి మండలం లోని ఉప్పలపాడు గ్రామం. నాన్నమ్మ వాళ్ళది కావలి దగ్గర్లోని ఉలవపాళ్ళ గ్రామం . మాకు మాతృస్వామ్యము ఇష్టం కాబట్టి అమ్మమ్మ నాన్నమ్మ అని మొదలెట్టా. ఇటు నుండి అటు వెళ్లాలన్న, అటు నుండి ఇటు వెళ్లాలన్న రాజు పాళెం లో దిగి బస్సులు మారాలి.

  • స్కై ల్యాబ్, మా గడ్డివాములో పడింది!

    నా చిన్నతనపు ఇంకో కథ. మేము ఎక్కువ మా అమ్మమ్మా వాళ్ళ ఊరిలోనే గడిపేశాం చిన్న తనమంతా. మా ఇల్లు పెద్ద స్థలం లో ఆస్బెస్టాస్ రేకులు కప్పిన ఒకే ఒక్క పెద్ద గది, ముందు పంచ, పక్కన ఒక తాటి ఆకులు కప్పిన వంటగది. ఇంటికి కుడి పక్క పెద్ద బాదం చెట్టు వెనక ఒక ఉసిరిగి చెట్టు, ఎడమ పక్క పెద్ద స్థలం లో గడ్డి వాము, ఆ వాముకి ఆవల పెద్ద ఎరువు…

  • నేను పగలకొట్టిన పిచ్చుకను నాకు ఇవ్వండి తెచ్చి!

    నాకు నా చిన్నప్పటి రోజులు ఇప్పటికీ జ్ఞాపకమే. నాలుగేళ్లు వుంటాయనుకుంటా నాకు అప్పుడు. మా పెద్దమ్మతో నెల్లూరు వెళ్ళినప్పుడు, సతాయించి సతాయించి ఒక కారు బొమ్మ కొనిపిచ్చుకున్నా. కాస్త అదిమి పెట్టి వెనక్కి లాగితే స్ప్రింగ్ ముడుచుకొని, వదలగానే రయ్యిమంటూ ముందు కెళ్లే ఎర్ర కారు అది.

  • నా సహోద్యోగులు, హాస్యచతురులు !

    మనం వారంలో ఐదురోజులు మరియు రోజుకి కనీసం ఎనిమి గంటలు ఆఫీసుల్లో గడిపేస్తాం. మన కొలీగ్స్ లో హాస్యచతురత ఉంటే పని ఒత్తిడిని తట్టుకోవచ్చు. చతురత దండిగా వుండే ఒకానొక కొలీగ్ సామ్ ప్రదీప్. అప్పుడప్పుడు కలిసి భోజనానికి వెళ్తాము.

  • నాకు వున్నాయి, పొలమారిన జ్ఞాపకాలు!

    మా అక్క కూతురి పెళ్లి గత నవంబరు నెలలో జరిగింది. ఆ పెళ్ళిలో నా చిన్ననాటి సహాధ్యాయిని నన్ను కలిసి, కిరణు !  నాకు నీ పిల్లల్ని చూపించు అని అడిగింది. నేను కాస్త దూరంలో  వున్న నా కూతుర్లని పిలిచి, నా సహాధ్యాయిన్ని పరిచయం చేస్తూ, తాను నా చిన్ననాటి స్నేహితురాలు అని చెప్పా. తాను వెంటనే, చిన్ననాటి కాదు, నేను మీ నాన్నకి పుట్టినప్పటి నుండి స్నేహితురాలిని అని నన్ను సరి చేసింది. ఆ…

  • మా లాటి ఎర్ర బస్సు జంటను, ఎక్కడన్నా కాంచారా!

    నేను నాలుగు చక్రాల వాహనం తోలటాన్ని దక్షిణాఫ్రికాలో నేర్చుకున్నా. చాలా పద్దతి గా నేర్పించారు. తోలేటప్పుడు సైడ్ వ్యూ మిర్రర్ లు, రియర్ వ్యూ మిర్రర్ లు పదే పదే చూడటం ఆ శిక్షణలో ఎక్కువ భాగం. సరే తోలడానికి అన్నీ అనుమతులు రావటంతో సుప్రియాని వాహనంలో ఎక్కించుకొని హుషారుగా, షికారుకు బయలుదేరాను.

  • మా వూరి మైలురాయి కమ్యూనిస్టులు!

    అనీల్ గాడు నాకు వున్నాయి, పొలమారింది జ్ఞాపకాలు కథ చదివి అది హర్ష గాడి కార్ల్ మార్క్స్ పోకడ కథ అని వ్యాఖ్యానించాడు. నేను కూడా మా ఊర్లలో వుండే కొన్ని కమ్యూనిస్ట్ గాధలని చెప్పాలని అప్పుడే అనుకున్న. ఎవరో ఒక పేరుమోసిన కమ్యూనిస్ట్ గారిని అడిగారట, మీరు పక్కా కమ్యూనిస్ట్ లు కదా, మరి ఖరీదైన మధ్యంసేవిస్తారు, రెండవ వివాహంకూడా ఆడేశారు, కొంచెం విలాసవంతమైన జీవనం గడుపుతారు, ఇది ఏవిధమైన కమ్యూనిజం అని.

  • లక్ష్మి, లేకపోవటం చాలా చేదు నిజం!

    నాన్న వాళ్ళది ఉలవపాళ్ళ. నేషనల్ హైవే లో నెల్లూరు నుండి కావలికి వెళ్తుంటే సున్నబ్బట్టి , అల్లూరు గేట్ దాటిన తర్వాత హైవే నుండి ఒక కిలో మీటర్ లోపలి కెళ్ళాలి. ఒకప్పుడు బిట్రగుంట లోకో ఇంజిన్ మైంటెనెన్సు కి ఫేమస్. ఆ చుట్టు పక్కల ఊర్లలో సగం మంది రైల్వే ఎంప్లాయిస్. డ్రైవర్స్, ఫిట్టర్స్, గ్యాంగ్ మెన్ ఎవరి అర్హతల్ని బట్టి వారు ఆ చుట్టుపక్కల గ్రామాలనుండి బాగా సర్వీసెస్ లో వుండే వారు.

  • చిన్నప్పుడే చితికిపోయిన నా చిన్నమెదటి, భేతాళ ప్రశ్న

    పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్లి, ఎప్పటిలా చెట్టుపైనుంచి శవాన్ని దించి, భుజాన వేసుకొని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవ సాగాడు. అప్పుడు శవంలోని భేతాళుడు, “ఓ! రాజా ఇంత అర్థరాత్రివేళ, భీతిగొలిపే ఈ స్మశాన వాతావరణం లో, ఎదో సాధించాలన్న నీ పట్టుదల కారణంగా, నీవు చేస్తున్న ఈ పని నీకు అత్యంత సహజంగా కనపడుతున్నట్టు నా కనిపిస్తుంది. నాకెందుకలా అనిపిస్తుందో, ఉదాహరణగా నీకు అచ్చు నీలాటి పట్టుదల చూపిన భగీరథుని…

  • మా పంచింగ్ ఫలక్ నామ!

    నాకు రామ్ అని ఒక సహోద్యోగి ఉండేవారు చెన్నైలో. ఆయన సందర్భోచితంగా వేసే పంచ్ లు అంటే నాకు చాలా సరదా, కానీ ఎప్పుడు నా మీద ప్రయోగిస్తారేమో అని జాగ్రత్తతో ఉంటా. వాళ్ళ టీంలో ఒక నిష్ టెక్నాలజీల నైపుణ్యముండే పిల్లకాయలున్నారు. అదే నిపుణత వేరే కస్టమర్కి కూడా అవసరమయ్యింది.

  • మా నెల్లూరోళ్లు, ఎంతైనా ప్రత్యేకమబ్బా!

    మా నెల్లూరోళ్లు చాల ప్రత్యేకమబ్బా. ఓర్నీ పాసు గూలా, ఏందిరా! అబ్బయ్యా అంటూ భోళాగా పలకరిచ్చేస్తారు. ఆటో గాని రిక్షా అతను కానీ ఎక్కండి అనరు, బేరం కుదరగానే ఎక్కు అంటారు అలాగే ఎవర్నైనా నువ్వు అంటారే గాని మీరు అనరు. కొంచెం బయట ఊర్ల నుండి వచ్చినోళ్ళకి మా ఏకవచన సంబోధన కొంచెం కష్టమే.

  • ఆఫీసు పని ఇంట్లో చేస్తున్నారంటే!

    మిస్ వైజ్ మా పెద్ద పాప అమృత క్లాస్ టీచర్, సీటెల్ లో వున్నప్పుడు. పేరెంట్స్ టీచర్ మీటింగ్ లో కలిసాము ఆవిడని, అకడమిక్ ఇయర్ మొదటలో . “నేను కావాలనే ఒక క్లాస్ పీరియడ్ కి, ఇంకో పీరియడ్ కి మధ్యలో పదిహేను నుండి ఇరవై నిముషాలు గ్యాప్ ఇచ్చాను. స్టూడెంట్స్ ఆ గ్యాప్ లో నేను ఇచ్చిన వర్క్ చేసుకోవచ్చు లేక పోతే వాళ్ళు వేరే ఆక్టివిటీస్ చేసుకోవచ్చు. నేను వాళ్ళను కంపెల్ చెయ్యను.…

  • అమ్మలందరు అంతే ! మా అమ్మ కూడా !

    ఒరే హర్షాగా! “మీ అమ్మకి నేను ఇక ఏమీ చెప్పానురా”, అంటూ కణ కణ లాడి పోయాడు మా నారాయణ రెడ్డి వాళ్ళ షడ్డకుడి కొడుకు రిసెప్షన్ అయ్యాక. ఎదో అయ్యింది ఆ రిసెప్షన్ కి మా అమ్మ అటెండ్ అయ్యాక అని నవ్వుకున్నా. మంచి నీళ్ల గ్లాస్ ఇచ్చి, “చెప్పరా ఏమయ్యిందో అన్నా”, వినటానికి సిద్దపడుతూ.

  • మా లక్ష్మీ పెద్దమ్మ పెద్ద అదృష్టవంతురాలు!

    మా అమ్మమ్మకి వాళ్ళ నాన్నగారు తన చెల్లెలి కొడుకు తో పెళ్లి నిశ్చయించాడు. ఆ వరుడు తనకన్నా వయస్సులో చాలా పెద్దవాడు అవటం తో, ఛీ ! నాకు వద్దు అని తన ఈడు వాడైనా మా తాతని వివాహమాడేసింది. ఆ రోజుల్లో నాయన మాట ఎదిరించి వివాహం చేసుకోవటం మహా సంచలనం. వాళ్ళ నాన్న గారు తన మాట ఎక్కడ పోతుందో అని, మరీ చిన్నపిల్ల, లక్క పిడతలతో ఆడుకుంటున్న మా అమ్మమ్మ చెల్లెల్ని తీసుకెళ్లి…

  • అందగాడు, ధవళవర్ణము వాడు, మా పెద్దనాన్న!

    మా అమ్మకి పెద్ద అక్క నాకు వరసకు పెద్దమ్మని మా ఉప్పలపాడు ప్రక్క గ్రామమైన రామలింగాపురంలో ఇచ్చాము. పెదనాన్నగారు వ్యవసాయదారుడు, మహా అందగాడు. ఆయన, ఎవరక్కడా! అని గంభీర స్వరంతో పిలిస్తే మా పెద్దమ్మ, గజ గజ వణుకుతూ ఎక్కడివక్కడ వదిలేసి పరిగెత్తడం నేను చాలా సార్లు చూసా. ఆలా వణుకుతూనే నాకు ఇద్దరన్నల్ని, ఇద్దరు అక్కల్ని ఇచ్చేసిందావిడ. నేను నాలుగవ తరగతి వరకూ మా ఉప్పలపాటి ప్రాధమిక పాఠశాలలోను, ఆరు ఏడు తరగతులు పెదపుత్తేడు లోని…

  • బుడ్డ వెంకన్న, మళ్ళీ పుట్టాడు!

    బుడ్డ వెంకన్న పచ్చని మేని ఛాయతో, గిరజాల జుత్తుతో, ఆరడుగులకన్నా ఎక్కువ ఎత్తు వున్న భావం అధికమైన వాడై, కొంచెం వొంగినట్టుండి, ఉప్పలపాటి చుట్టూ పక్కల వూర్లకన్నిటికీ అందగాడు. ముగ్గురు సోదరీమణులు, ఒక సోదరుడు కలిగిన వాడు.

  • నా మొదటి అమెరికా యాత్ర, అచ్చు ఆచారికి మల్లె!

    ఆచారి! అమెరికా యాత్రలా, నా మొదటి అమెరికా యాత్ర గురుంచి, తప్పకుండా రాయాలి. నేను, సుప్రియ, ఇద్దరు పిల్లలతో క్రీస్తు శకం 2000, మార్చ్ 31 వ తేదీ ముంబై నుండి కొలరాడో లోని డెన్వర్ కి బయలుదేరాము. అమ్రుకి రెండు నిండి మూడేళ్లు, ఆముకి మూడు నెలలు.

  • వినదగు నెవ్వరు చెప్పిన !

    మల్లిగాడు కరెక్ట్. మనం ప్రతి రోజు చాలా విషయాలు అందరి దగ్గరా నేర్చుకుంటాం. అవి మన పిల్లల దగ్గర నుండి అయితే ఇంకా బాగుంటాయి. నేను ఈ రోజు నా పిల్లల దగ్గర ఏమి నేర్చుకున్నానో చెప్తా. పెద్దపాప అమృతకి ఐదేళ్లు అనుకుంటా, తనకి చదరంగము నేర్పించాలని అనుకున్నా, అలాగే మొదలెట్టాను ఒక అయస్కాంతపు చదరంగపు అట్ట కొని. పరవాలేదు త్వరగానే నేర్చుకున్నది.

  • నేనూ, నా మైనర్ సర్జరీ!

    ఈ రోజు మా పదో తరగతి సహాధ్యాయని వాళ్ళ అమ్మాయి పెళ్ళికి స్నేహితువులమందరిమి హాజరయ్యాము. అలా వచ్చిన వారిలో, ఒక స్నేహితుడు రియాజ్ బాషా. తనకి ఆక్సిడెంట్ అయితే హాస్పిటల్ లో అడ్మిట్ అయ్యాడు కొంత కాలం క్రిందట. హాస్పిటల్ అంతా తనని చూడడానికి వచ్చిన జనాలతో నిండిపోతే ఆ డాక్టర్ కి తాను ఒక సమరసింహారెడ్డి ని అనే బిల్డ్ అప్ ఇద్దామనుకున్నాను అని చెప్పటంతో నాకు కూడా నా గతకాలపు ఘటన వలయాలు వలయాలు…

  • నేను, నా ఉషాయణం!

    ఈ మధ్య ఒక కథ చదివా, అది అచ్చు నా కథే, నా కథే కాదు మీ అందరి కథే. ఆ కథ ప్రేరణతోనే ఈ కథ చెబుతున్నా. నేను మరియు ఉషా, ఒకటో తరగతి నుండి ఏడో తరగతి వరకూ క్లాస్ మేట్స్. బాగా తెల్లగా, చలాగ్గా అచ్చు మన హీరోయిన్ జయప్రదకు నకలుగా ఉంటుంది ఉష. స్కూల్ మరియు ట్యూషన్ లో పక్క పక్కనే కూర్చోవాల్సిందే. హోమ్ వర్క్ సబ్మిట్ చేసినా ఆ పిల్ల…

  • ‘గ్యాపకాలు’ – హర్ష

    “భలే గట్టోడు రా మీ రాం మావ, అటెండన్స్ తక్కువయిందని ఎఫ్.ఏ ఆఖరి పరీక్షలకు కూర్చోనివ్వలా ఆయన్ని ! అప్పుడు సంవత్సరం పాటు తాత తో పాటే ఉండి, గొడ్ల పేడ ఎత్తడం నుంచి కోతల దాకా పనులన్నీ బ్రెమ్మాండంగా నేర్చుకొని, మళ్ళీ ఎఫ్.ఏ పరీక్షలు రాస్తా, ఏ.జీ.బీ.ఎస్.సి చదువుకుంటా అని తాతని ఒప్పిచ్చి, మళ్ళీ పరీక్షకు కూర్చొని పాస్ అయ్యాడు.లెక్కల గ్రూప్లో వాడు, ఏ.జీ.బి.ఎస్.సీ ఎట్టా చదవతావురా అని జనాలందరూ నవ్వితే, కాలేజీ వాళ్ళని ఒప్పించుకొని…

  • జన జీవన స్రవంతి !

    చీకటి ఊరిని, నెమ్మదిగా  కమ్ముకోడం కనిపిస్తోంది, కిటికీలోంచి చూస్తే.   దూరాన  కనపడే  మావిడి తోటల వెనకాల్నించీ  సూర్యుడు ఎవరో తరుముతున్నట్టు హడావిడిగా  కిందికి  దిగిపోతున్నాడు .  చదూతున్న పాత ఆంధ్రభూమి  మూసి పక్కన పడేసా నేను .  మిద్దె మీద గదిలో కూర్చోనున్నా.  అమ్మమ్మ వాళ్ళ వూరు, పమిడిపాడు కొచ్చి రెండు రోజులైంది.   ఎంసెట్ రాసి రిసల్ట్ కోసం వెయిటింగ్.  పన్నెండు మైళ్ళు  పమిడిపాడు  గుంటూరుకి.  మా అమ్మ ఏకైక  తమ్ముడు, గంగాధరం మావ, ఆయన భార్య…