Apple PodcastsSpotifyGoogle Podcasts

  • అనుకున్నదొకటీ: హర్ష

    “అరే అబయా హర్షయ్య నువ్వెక్కడుండావో అని ఎతకతానే వుండా పొద్దుకాడినుండి, ఇక్కడుండావా” అంటూ వచ్చాడు నాకు చిన్నాయన వరుస అయిన శేఖరయ్య “ఏంది చిన్నాయన మందల” అంటూ పలకరించా. “నీ దశ తిరిగిందబ్బయ్యా! నీకు పిల్లనిచ్చిన మావ వుళ్లా! సుబ్బ మావ! ఆయనకి ఇరవై లక్షల ఆస్తి కలిసొచ్చిందంట. ఊరంతా ఒకటే ఆగమయిపోతావుంటే, ఆ ముక్క నీ చెవిన బడ్డదో లేదో అని నాకు విన్నకాడినుండి ఒకటే కడుపుబ్బరం గా వుండిందనుకో. ఆ సంగతేందో తేల్చుకోపో మీ…

  • అందగాడు, ధవళవర్ణము వాడు, మా పెద్దనాన్న!

    మా అమ్మకి పెద్ద అక్క నాకు వరసకు పెద్దమ్మని మా ఉప్పలపాడు ప్రక్క గ్రామమైన రామలింగాపురంలో ఇచ్చాము. పెదనాన్నగారు వ్యవసాయదారుడు, మహా అందగాడు. ఆయన, ఎవరక్కడా! అని గంభీర స్వరంతో పిలిస్తే మా పెద్దమ్మ, గజ గజ వణుకుతూ ఎక్కడివక్కడ వదిలేసి పరిగెత్తడం నేను చాలా సార్లు చూసా. ఆలా వణుకుతూనే నాకు ఇద్దరన్నల్ని, ఇద్దరు అక్కల్ని ఇచ్చేసిందావిడ. నేను నాలుగవ తరగతి వరకూ మా ఉప్పలపాటి ప్రాధమిక పాఠశాలలోను, ఆరు ఏడు తరగతులు పెదపుత్తేడు లోని…

  • మా తాత రాసిన రాత!

    “చిన్నయ్య! ఈ రోజు నువ్వు ఒక అమ్మాయిని చూడడానికి వెళ్లి రావాలి. నీతో పాటు, మీ అక్క, బావ, మా చిన్నమ్మ వస్తారు” ఆ రోజు ఉదయమే, మా అన్న పెళ్లి అయ్యింది. మేము ఇవ్వాల్సిన రిసెప్షన్ కూడా అదే రోజు రాత్రి, పక్కరోజు వినాయక చవితి అవటం తో, డిన్నర్ కి కావాల్సిన ఏర్పాట్లు అన్నీ చూసుకొని, సాయంత్రం నాలుగప్పుడు ఇంటికి చేరుకున్నా, వళ్ళంతా నొప్పులు , పులిసిపొయ్యినట్టుంది ఎడ తెగని తిరుగుళ్ల వల్ల. కాస్త…

  • పెద్దంతరం చిన్నంతరం!

    “కొంచెం అన్నం పక్కన పెట్టుకొని అందులో పప్పు కలుపుకోండి!” “ఆ! ఆ ! అంతా పప్పే కలిపేసుకున్నావ్, నేను కొంత అన్నము లోకే కలుపుకోమన్నానా!” “కొంచెం అన్నం మిగుల్చుకుంటే అరటికాయ కూర వేద్దామనుకున్నా!” “ఇంక ఇక రసం వేసుకొని, అరటికాయ కూర నంజుకో, ఆ తర్వాత కొంచెం పెరుగు వేసుకుందురు కానీ!” నాకర్థమయ్యింది మా అమ్మ మా నాన్న కి భోజనం వడ్డిస్తుందని, కాదు, కాదు, ఏమి తినాలో ఎంత తినాలో ఓ బొమ్మరిల్లు భార్యలా ఆయన…

  • కథా చక్రభ్రమణం

    మా అమ్మమ్మ చిన్నప్పుడు నాకు పలు రకాల కథలు చెప్పేది, కొన్ని కథలు సందర్భాను సారంగా, మరి కొన్ని నాకిష్టమైనవవడంతో నేను పదే పదే అడిగేవి.

  • మా ఇంట్లో ప్రజాస్వామ్యం పని చేయలేదు!

    చేతిలో ఓ పది రూపాయలు ఆడినప్పుడు, మా అమ్మ అడిగేది మా ముగ్గురిని, ఈ రోజు ఏమన్నా తింటానికి చేసుకుందాం, మీ ఇష్టప్రకారం ఏమి చేయాలో మీరే తేల్చుకోండి అని.

  • ఆవూ, దూడా చేలోనే మేస్తున్నాయి, మాలాగా !

    చెన్నై లో నివసించే వాళ్ళము మేము 2009 వ సంవత్సరములో. పిల్లలిద్దరూ వెళ్ళాచ్చేరీ లోని నవదిశ మాంటిస్సోరి స్కూల్ లో ఏడూ మరియు ఐదవ తరగతుల్లో చేరారు. ఆరు నెలలు గడిచాకా మా చిన్నది వాళ్ళ తరగతిలో రెండు సమూహాలు ఉన్నాయనీ, ఆ రెండు సమూహాలకి ఎప్పుడూ పడదని, ఒకరు ఎడ్డెము అంటే ఇంకొకరు తెడ్డెమని చెప్పటం మొదలెట్టింది.

  • నా కూతుర్ల, భావప్రకటన!

    నా పెద్ద కూతురు అమృత, చిన్ననాటి నుండి తనలోని ఆలోచనలు చాలా స్పష్టంగ వ్యక్త పరిచేది. మా స్నేహితుడు గిరిగాడి భాషలో చెప్పాలంటే భావవ్యక్తీకరణ మరియు భావప్రకటన. తన మూడవ ఏటనే మేము తనని డెన్వర్ కి కొనిపోయాము.

  • మనోభావాలు దెబ్బ తీసిన ఐదేళ్ల అమృత!

    మేము డెన్వర్ లో వున్నరోజులు అవి. ఒకరోజు నేను ఆఫీసులో ఉండగా అమృత వాళ్ళ ఉపాధ్యాయురాలి నుండి ఫోన్ వచ్చింది, వచ్చి వెంటనే కలవమని. ఆవిడని అడిగాను నేను మరుసటి రోజు వచ్చి కలవవచ్చా అని, దానికావిడ ఈరోజే వచ్చి కలిస్తే మంచిదని చెప్పటం తో ఆఫీసు నుండి బయలుదేరాను.

  • మరవ కూడని వారు!

    నేను మన సూరి కథ రాశాక, ఇప్పుడల్లా అనారోగ్యాల మీద రాయకూడదు అని అనుకున్నా, కానీ ఆ నియమం వెంటనే పక్కన పెట్టి ఈ కథ రాస్తున్నా. ఎందుకు రాశానో ఈ కథ చివరలో రెండు మాటలుగా చెప్పాలనుకున్నా.

  • మన జీవితాల నాయకా నాయకులు! రెండవ భాగం

    నేను ఇంతవరకూ రాసిన కథల పాత్రల జీవితంలో ఎదో ఒక సంఘర్షణ ఉండేది. అలా సంఘర్షణ వున్న పాత్రల గురుంచి రాస్తేనే ఓ మంచి కథ అవుతుంది అని నమ్మేవాడిని. కానీ ఆర్ధిక పరమైన కొన్ని సంఘర్షణలు తప్ప వ్యక్తిగతమైన సంఘర్షణలు లేకుండా జీవితాన్ని గడిపి, ప్రేమలను మాత్రమే పంచిన మన పెద్దమ్మలు, పెద్ద నాన్నలు, చిన్నాన్నలు, చిన్నమ్మలు, మామలు, అత్తలు మొదలగు వారి గురించి కూడా రాయాలి. వీళ్లంతా మనమెక్కడో వెతుక్కోవాల్సిన పనిలేకుండా మనపక్కనే వుంటూ…

  • మన జీవితాల నాయకా నాయకులు! ఒకటవ భాగం

    ఈ మధ్య మా అమ్మతో మాట్లాడుతుంటే, తన చిన్ననాటి స్నేహితురాలైన ఈదల పద్దమ్మ గారి గురుంచి చెప్తూ, తన చిన్నతనంలో తనంతటి వయస్సు వుండే ఆవిడ చాలా పెద్దదైన వాళ్ళ పెరడు అంతా ఊడ్చి, కళ్ళాపి చల్లి, ముగ్గులు పెట్టి, ఆ తర్వాత అంట్లు అన్నీ తోమేస్తే మా అమ్మ తనకి సహాయం చేసేది అంట్లు కడగటంలో. మా అమ్మనడిగా నేను, మరి మీ ఇంట్లో ఈ పనంతా ఎవరు చేసేవారు అని. మా చిన్నక్క ఐన…

  • నా శాసనోల్లంఘనల పర్వం!

    వేంకటాద్రి ఎక్స్ప్రెస్ సినిమాలో, కథానాయకుని తండ్రి, ఒక కుటుంబ రాజ్యాంగం రాసిపడేసి, ఆ రాజ్యాంగాన్ని ఉల్లంఘించిన వారి ఉల్లంఘనలను లెక్కపెడుతుంటాడు. ఇక్కడ కథానాయకుడు అనగానే నీకా లక్షణాలు లేవు అంటారని తెలుసు నాకు, ఇక్కడ కర్త కథానాయకుడు కాదు, కథానాయకుని తండ్రి. అలాగే మా నాన్నగారు (ఇక మీదట ప్రతీ దగ్గర నాన్న అనే వ్రాస్తానని మనవి, నా దగ్గర గారు గారు అని పలుమార్లు వస్తే మీరే అనగలరు, అతి వినయం దూర్తలక్షణమని) రాసిన రాజ్యాంగాన్ని…

  • రామ లక్ష్మణు లాటి వారేమో అలా, సుందోపసుందులేమో ఇలా!

    నాకు మేనత్త రవణమ్మకిన్ను మా నాన్న మేనమామ రవణయ్యకిన్నుపెళ్లి చేసేసారు, మా తాత ఆదెయ్య మరియు మా నాన్నమ్మ ఆదెమ్మ లు కలిసి. మా నాయనకి, మా చిన్నాయన కి, నాకు, మా అన్నకీ ఆఖరుకి మా అమ్మ అక్కల పిల్లకాయలకి అందరికీ ఆయన రవణ మావే. ఆయన మాకు ఇల్లరికపుటల్లుడు. మాటల్లోనే కాదు చేతల్లో కూడా మహాదూకుడు. ఆయన నడిస్తే పక్కనోళ్లు పరిగెత్తాలి, ఇద్డుమ్ వడ్ల బస్తా భుజం మీద నుండి విసిరేస్తే ఆరడుగుల దూరంలో…

  • ఎంత వరకూ తిట్టగలదో, చెప్పకనే చెప్పిన మా చిన్నది!

    మా చిన్నది ఈ రోజున తన సహాధ్యాయుడైన ఒక అబ్బాయిని, దున్నపోతు, పనికిమాలిన వెధవ అంటూ తిట్టటం మొదలుపెట్టింది. వినీ, వినీ ఇక వినలేక, ఏమయ్యిందమ్మా అనడిగా. మా స్నేహితురాలి చరవాణి నంబరుని మా బస్సు డ్రైవేరొకడు అడిగాడని ఇచ్చేసాడు మరో ఆలోచన లేకుండా. ఇప్పుడా డ్రైవర్, నా మా చిన్నది ఈ రోజున తన సహాధ్యాయుడైన ఒక అబ్బాయిని, దున్నపోతు, పనికిమాలిన వెధవ అంటూ తిట్టటం మొదలుపెట్టింది. వినీ, వినీ ఇక వినలేక, ఏమయ్యిందమ్మా అనడిగా.…

  • అంతేగా, అంతేగా అనండి, అటుపై చూడండి!

    ఓయ్ వాషింగ్ మెషిన్ లో నా చీరలు వేసున్న వెళ్లి ఆరవెయ్యి అంది మా ఆవిడ. ఇలా అడపా దడపా నాలో ఎమన్నా పురుషాహంకారం లేచి బుసలు కొడుతుందో లేదో అని పరీక్ష పెడుతుంది తను. గుడ్ బాయ్, అని మెచ్చుకుంది ఆరేసి వచ్చాక. ఆరేసుకో పోయి పారేసుకున్నావు హరీ, నీ కోకెత్తికెళ్లింది కొండగాలీ అంటూ ఆరెయ్యటంలో ఆనందం ఎందరికి తెలుసు. మా అన్న అయితే, ఛీ ! నువ్వు మరీ హెన్ను పెక్కుడు హస్బెండువి (పరమ…

  • నా మొదటి ప్రవాస జీవనానుభవం!

    నా మొదటి ప్రవాస జీవితం దక్షిణాఫ్రికా లోని జోహనెస్బర్గ్ లో మొదలయ్యింది. ఆనాడు దక్షిణాఫ్రికా లో రెండు ప్రధాన బ్యాంకు సమూహాలుండెడివి, ఒకటి ఏ.బి.ఎస్.ఏ మరియు రెండవది నెడ్కోర్. నేను ఏ.బి.ఎస్.ఏ బ్యాంకు వాళ్ళ అసెట్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ లో పని చేసే వాడిని. మా బస మరియు రవాణా అంత మా కంపెనీ నే ఏర్పాటు చేసింది. జోహనెస్బర్గ్  కంతటికీ అందమైన సాండ్ టన్ అనే ప్రదేశంలో సాన్మారియో అనే గృహ సముదాయం లో. చాలా…

  • నాకున్నూ, నా పిల్లలకున్నూ, ఓ రోజు జరిగిన సంభాషణ!

    నాకున్నూ నా పిల్లల మధ్య జరిగి నొక సంభాషణ నిక్కడ రాస్తున్నా. చిన్నది టెన్త్ లోను పెద్ద దింటర్లో నున్నప్పటి మాట. వాళ్ళు వాళ్ళ స్కూల్ లోను లేక కాలేజీ లో జరిగిన సంఘటనలు మాతో చెబుతూ వుంటారు.

  • నేను, నా మనవడూ!

    మా పెద్దమ్మ కూతురి మనవడు అభిరాం. వాడి వయస్సప్పుడు మూడేళ్లు. కొన్నాళ్ళు నేను ప్రాజెక్ట్ పని మీద చెన్నైలో వాళ్ళింట్లో ఉండాల్సి వచ్చింది. వాళ్ళదొక డూప్లెక్స్ బాడుగిల్లు. పైన నాకొక బాత్ రూమ్ కూడా కలిసి వుండే పెద్ద రూమ్ ఇచ్చేసారు వాళ్ళు.

  • మా లాటి ఎర్ర బస్సు జంటను, ఎక్కడన్నా కాంచారా!

    నేను నాలుగు చక్రాల వాహనం తోలటాన్ని దక్షిణాఫ్రికాలో నేర్చుకున్నా. చాలా పద్దతి గా నేర్పించారు. తోలేటప్పుడు సైడ్ వ్యూ మిర్రర్ లు, రియర్ వ్యూ మిర్రర్ లు పదే పదే చూడటం ఆ శిక్షణలో ఎక్కువ భాగం. సరే తోలడానికి అన్నీ అనుమతులు రావటంతో సుప్రియాని వాహనంలో ఎక్కించుకొని హుషారుగా, షికారుకు బయలుదేరాను.

  • మా వూరి మైలురాయి కమ్యూనిస్టులు!

    అనీల్ గాడు నాకు వున్నాయి, పొలమారింది జ్ఞాపకాలు కథ చదివి అది హర్ష గాడి కార్ల్ మార్క్స్ పోకడ కథ అని వ్యాఖ్యానించాడు. నేను కూడా మా ఊర్లలో వుండే కొన్ని కమ్యూనిస్ట్ గాధలని చెప్పాలని అప్పుడే అనుకున్న. ఎవరో ఒక పేరుమోసిన కమ్యూనిస్ట్ గారిని అడిగారట, మీరు పక్కా కమ్యూనిస్ట్ లు కదా, మరి ఖరీదైన మధ్యంసేవిస్తారు, రెండవ వివాహంకూడా ఆడేశారు, కొంచెం విలాసవంతమైన జీవనం గడుపుతారు, ఇది ఏవిధమైన కమ్యూనిజం అని.

  • ఆఫీసు పని ఇంట్లో చేస్తున్నారంటే!

    మిస్ వైజ్ మా పెద్ద పాప అమృత క్లాస్ టీచర్, సీటెల్ లో వున్నప్పుడు. పేరెంట్స్ టీచర్ మీటింగ్ లో కలిసాము ఆవిడని, అకడమిక్ ఇయర్ మొదటలో . “నేను కావాలనే ఒక క్లాస్ పీరియడ్ కి, ఇంకో పీరియడ్ కి మధ్యలో పదిహేను నుండి ఇరవై నిముషాలు గ్యాప్ ఇచ్చాను. స్టూడెంట్స్ ఆ గ్యాప్ లో నేను ఇచ్చిన వర్క్ చేసుకోవచ్చు లేక పోతే వాళ్ళు వేరే ఆక్టివిటీస్ చేసుకోవచ్చు. నేను వాళ్ళను కంపెల్ చెయ్యను.…

  • అమ్మలందరు అంతే ! మా అమ్మ కూడా !

    ఒరే హర్షాగా! “మీ అమ్మకి నేను ఇక ఏమీ చెప్పానురా”, అంటూ కణ కణ లాడి పోయాడు మా నారాయణ రెడ్డి వాళ్ళ షడ్డకుడి కొడుకు రిసెప్షన్ అయ్యాక. ఎదో అయ్యింది ఆ రిసెప్షన్ కి మా అమ్మ అటెండ్ అయ్యాక అని నవ్వుకున్నా. మంచి నీళ్ల గ్లాస్ ఇచ్చి, “చెప్పరా ఏమయ్యిందో అన్నా”, వినటానికి సిద్దపడుతూ.

  • మా లక్ష్మీ పెద్దమ్మ పెద్ద అదృష్టవంతురాలు!

    మా అమ్మమ్మకి వాళ్ళ నాన్నగారు తన చెల్లెలి కొడుకు తో పెళ్లి నిశ్చయించాడు. ఆ వరుడు తనకన్నా వయస్సులో చాలా పెద్దవాడు అవటం తో, ఛీ ! నాకు వద్దు అని తన ఈడు వాడైనా మా తాతని వివాహమాడేసింది. ఆ రోజుల్లో నాయన మాట ఎదిరించి వివాహం చేసుకోవటం మహా సంచలనం. వాళ్ళ నాన్న గారు తన మాట ఎక్కడ పోతుందో అని, మరీ చిన్నపిల్ల, లక్క పిడతలతో ఆడుకుంటున్న మా అమ్మమ్మ చెల్లెల్ని తీసుకెళ్లి…

  • అందగాడు, ధవళవర్ణము వాడు, మా పెద్దనాన్న!

    మా అమ్మకి పెద్ద అక్క నాకు వరసకు పెద్దమ్మని మా ఉప్పలపాడు ప్రక్క గ్రామమైన రామలింగాపురంలో ఇచ్చాము. పెదనాన్నగారు వ్యవసాయదారుడు, మహా అందగాడు. ఆయన, ఎవరక్కడా! అని గంభీర స్వరంతో పిలిస్తే మా పెద్దమ్మ, గజ గజ వణుకుతూ ఎక్కడివక్కడ వదిలేసి పరిగెత్తడం నేను చాలా సార్లు చూసా. ఆలా వణుకుతూనే నాకు ఇద్దరన్నల్ని, ఇద్దరు అక్కల్ని ఇచ్చేసిందావిడ. నేను నాలుగవ తరగతి వరకూ మా ఉప్పలపాటి ప్రాధమిక పాఠశాలలోను, ఆరు ఏడు తరగతులు పెదపుత్తేడు లోని…

  • బుడ్డ వెంకన్న, మళ్ళీ పుట్టాడు!

    బుడ్డ వెంకన్న పచ్చని మేని ఛాయతో, గిరజాల జుత్తుతో, ఆరడుగులకన్నా ఎక్కువ ఎత్తు వున్న భావం అధికమైన వాడై, కొంచెం వొంగినట్టుండి, ఉప్పలపాటి చుట్టూ పక్కల వూర్లకన్నిటికీ అందగాడు. ముగ్గురు సోదరీమణులు, ఒక సోదరుడు కలిగిన వాడు.

  • వినదగు నెవ్వరు చెప్పిన !

    మల్లిగాడు కరెక్ట్. మనం ప్రతి రోజు చాలా విషయాలు అందరి దగ్గరా నేర్చుకుంటాం. అవి మన పిల్లల దగ్గర నుండి అయితే ఇంకా బాగుంటాయి. నేను ఈ రోజు నా పిల్లల దగ్గర ఏమి నేర్చుకున్నానో చెప్తా. పెద్దపాప అమృతకి ఐదేళ్లు అనుకుంటా, తనకి చదరంగము నేర్పించాలని అనుకున్నా, అలాగే మొదలెట్టాను ఒక అయస్కాంతపు చదరంగపు అట్ట కొని. పరవాలేదు త్వరగానే నేర్చుకున్నది.

  • నేనూ, నా మైనర్ సర్జరీ!

    ఈ రోజు మా పదో తరగతి సహాధ్యాయని వాళ్ళ అమ్మాయి పెళ్ళికి స్నేహితువులమందరిమి హాజరయ్యాము. అలా వచ్చిన వారిలో, ఒక స్నేహితుడు రియాజ్ బాషా. తనకి ఆక్సిడెంట్ అయితే హాస్పిటల్ లో అడ్మిట్ అయ్యాడు కొంత కాలం క్రిందట. హాస్పిటల్ అంతా తనని చూడడానికి వచ్చిన జనాలతో నిండిపోతే ఆ డాక్టర్ కి తాను ఒక సమరసింహారెడ్డి ని అనే బిల్డ్ అప్ ఇద్దామనుకున్నాను అని చెప్పటంతో నాకు కూడా నా గతకాలపు ఘటన వలయాలు వలయాలు…