Apple PodcastsSpotifyGoogle Podcasts

  • మా ఊరి నీళ్ల పురాణాలు – హర్ష

    పైన చెరువు, మధ్యలో వూరు, వూరికింద పొలాలు, పొలాల క్రింద,  ఎంత ఎండాకాలం లో అయినా ఒక్క పాయన్నా పారే వాగులతో,  అద్భుతమైన గ్రావిటీ నీటి పారుదల వ్యవస్థ వున్న మా వూళ్ళో,   తవ్వితే పడేది మాత్రం  ఉప్పునీళ్ళే.  నీళ్లు పడ్డం అయితే ఇరవై ముప్పై అడుగుల్లోపలే పడతాయి, నోట్లో పోసుకుంటే కానీ తెలీదు ఎంత ఉప్పగా వుంటాయో. రాక రాక వచ్చిన జామ చెట్టు కాయలు, బాదం కాయలు, సపోటా కాయలు కూడా జవ్వ …

  • ‘పేరులోనేమున్నది’ – హర్ష

    “రేయ్! గిరి బావా! నువ్వూ, మీ తమ్ముడు వంశీ గాడు దేవళం దగ్గరకు రండిరా!, ఆడుకుందాం!” అని కేక వేశా  నేను. మా బ్యాచ్ లో ఏ రోజు ఏ ఆట ఆడాలో డిసైడ్ చేసేది వాడే. ఒక్కో రోజు గుడ్లు ఆట లేక గోళీలాట, లేక బొంగరాలాట, లేక కుందుడు గుమ్మ, పల్లంచి, ఇవన్నీ కుదరక పోతే ఒక గదికి అంతా దుప్పట్లు కట్టేసి చీకటి చేసేసి బూతద్దం ఉపయోగించి ఫిలిం గోడమీద ఫోకస్ చేసి…

  • హర్ష రాసిన ‘ఎండమావి’ – సారంగ పత్రిక నుంచి!

    ఈ కథ ‘ ఎండమావి’ హర్ష రాసింది , సారంగ’ వెబ్ మ్యాగజైన్ లో ప్రచురితమైంది. కథ చదవడానికి – https://magazine.saarangabooks.com/%e0%b0%8e%e0%b0%82%e0%b0%a1%e0%b0%ae%e0%b0%be%e0%b0%b5%e0%b0%bf/ ‘హర్షణీయం’ పాడ్కాస్ట్ ని ‘గానా’ (Ganaa) అప్ ద్వారా వినాలంటే –https://gaana.com/podcast/harshaneeyam-season-1 స్పాటిఫై యాప్ లో వినాలంటే –http://bit.ly/harshaneeyam (Harshaneeyam on Spotify) ఆపిల్ ఐట్యూన్స్ లో వినాలంటే –http://apple.co/3qmhis5 (Harshaneeyam on Apple. Podcast) హర్షణీయం కు సబ్ స్క్రైబ్ చెయ్యడానికి -harshaneeyam@gmail.com కు మెయిల్ లేదా ‘77807 43545 ‘ అనే…

  • మా బస్సు బాగోతాలు

    “ఒరే ఎంకా ! యెందాకరా ఒకటే లగెత్తుతుండావు?” “ఉండరా! సుబ్బా! పడవెళ్లి పోతుందిరా! నేను నీతో యవ్వారం పెట్టుకుంటే కుదరదు. గెండారం దాకా పోవాలా” అంటూ ఎంకడు హడావిడి పడిపోతాడు.  “మా ఉప్పలపాటి గురుంచి ఏమన్నా మీకు ఉప్పు వుండి వుంటే మీరే తెగ ఆశ్చర్య పోవాల! ఉప్పలపాటి కి గెండారానికి మధ్య పిల్లకాల్వ కూడా లేదు, ఈ ఎంకడు ఎలా పడవెక్కుతాడు అని” అయితే మీకు బొత్తిగా మా ఉప్పలపాటి వాళ్ళ ఎకసెక్కాలు బొత్తిగా తెలీవన్న మాట. ముందు వెనక కర్వ్డ్…

  • అమ్మూరు

    1981 వ సంవత్సరం – చిన్నా : “అమ్మా ! నేనొచ్చేసా!” అంటూ పుస్తకాల సంచీని ఒక మూలకి, చేతి లోని క్యారేజీ ని ఇంకో మూలకి విసిరేస్తూ వచ్చి అమ్మకి అతుక్కు పోయాడు చిన్నా. స్కూల్ నుండి వొచ్చేటప్పటికి అమ్మ ఎదురుచూస్తూ కనపడితే వాడి ఆనందం పట్టనలివి కాదెవ్వరికీ.  “అబ్బో! మా చిన్న ఐదు ఊర్లు ఏలేసి వచ్చాడమ్మా” అంటూ ఒక ముద్దు పెట్టుకుంది అమ్మ.  “అమ్మా ! ఈ రోజు స్కూల్ నుంచి వస్తుంటే ఏం జరిగిందో తెలుసా? ఊర్లోకి రెండు కార్లు వస్తూ కనపడ్డాయమ్మా.…

  • బెల్లంకొండ వెంకటేశ్వర్లు !

    ఆరవ తరగతి మొదలయ్యి మూడు నెలలు అయ్యింది. ఆరు ఊర్ల కు కలిపి ఒక జెడ్.పి ఉన్నత పాఠశాల మా బడి. వేరు వేరు ఊర్ల నుండి వచ్చిన పిల్లకాయలందరమీ ఒకరికొకరు అప్పుడప్పుడే అలవాటు పడుతున్నాము ఒక రోజు బడికి వచ్చేసరికి, మా తరగతిలోనే ఓ కొత్తమొహం కనిపించింది నాకు. మధ్యాహ్నమయ్యేసరికి ఆ వచ్చిన అబ్బాయి వివరాలు తెలిసి పోయాయి. పేరు, బెల్లంకొండ వెంకటేశ్వర్లు. అప్పటిదాకా బుచ్చి లో చదువులు వెలగబెట్టి,యీ రోజే మా బడిలో చేరాడు.…

  • ఒక అన్నార్థుడి గోల!

    రేయ్! కిరణు రాత్రికి, నేను మన గొట్ల పాలెం గౌతమి టాకీస్ లో పాండవ వనవాసం సినిమా కి వెళ్తున్నా”“ఎవరితో వెళ్తున్నావు రా! గిరి బావ”“ఇంకెవరి తో రా మా అన్న శుంఠ తో”“నిన్ననే కదరా! ఇద్దరు కొట్టుకున్నారు”“అలా అనిపించిందా మీ అందరికీ, ఎక్కడ కొట్టుకున్నాం రా , వాడు కొట్టటమే కానీ నన్ను”“సర్లే రా! మళ్ళీ వాడితోనే సిగ్గులేకుండా వెళ్తున్నావా మళ్ళీ”“రేయ్! కిరణ్ గా, నువ్వెవడివిరా మా అన్నని వాడితో గీడీతో అనడానికి. అయినా మా…

  • మా గిరిజక్క పిచ్చి చిట్టాలు!

    “మా నాయన పేరు మీ పేరు ఒకటే,  సుందర రామయ్య, అందుకే నిన్ను ఇక నుండి నాయనా అనే పిలుస్తాను” అంది మా పక్కింటి  గిరిజక్క, మా నాన్నతో.  “సరేనమ్మా  నువ్వు ఆర్డర్ వేసింతర్వాత, కాదనే ధైర్యం ఎవరికీ ఉందమ్మా” అన్నారు నాన్న.  మా నాన్న, కాట్రాక్టింగ్ పార్టనర్ అయిన గోవింద రెడ్డి అంకుల్  భార్య  గిరిజక్క.  ‘చండశాసన గండర గండి’ మాటల్లో మటుకు.  “ఏమే! మాధవీ, వాసవీ,  ఇకనుంచీ, మా నాయిన్ని  మీరు తాత అనే…

  • నేనెక్కాల్సిన బస్సు!

    “అమ్మా ! ఎందుకమ్మా! ఎన్ని సార్లు నాన్న చెయ్యెత్తినా ఏ బస్సూ ఆగట్లేదు” ? మిట్ట మధ్యాహ్నం పన్నెడున్నర, ఎండాకాలం. హైవే పక్కనే నిల్చొని వున్నాం నేను అమ్మా నాన్న. “ఇంక ఆగలేనమ్మా ఇంటికి పోదాం !, ఇంటికి పొయ్యి రాజయ్య తో ఆడుకుంటా!” “లేదు చిన్నా! నీకు ఒంట్లో బాగ లేదు కదా, నెల్లూరు పొయ్యేసి డాక్టర్ దగ్గర మందు తెచ్చుకుందాం. నెల్లూళ్ళో బొమ్మల పుస్తకం కూడా కొనిస్తా ! బస్సొచ్చే లోపల, అక్కడ పొయ్యే…

  • అప్పుడప్పుడూ ‘ఉదయించే’ మా సుడిగాడు!

    “బాస్, ఏ బ్రాంచ్ నీది”, అడి గాడు రామారావు, నన్ను, నేను మా హాస్టల్ మెస్సు లోకి ఎంటర్ కాంగానే.

  • పాపం, మా సీన మావ!

    నేను ఆ రోజు బడి నుండి వచ్చేసరికి ముసునూరి నుండి మా సీన మామ వచ్చున్నాడు. ఈ సీన మామ వస్తే ఆయన వెంట పడి వూరు మీద లేక పోతే గుంజి పళ్లకోసమో లేక టేకు పళ్ళ కోసమో మా ఊరి హై వే కి ఆనుకొని వున్న చిట్టడవుల వెంట పడి బలాదూర్ తిరగటం నాకు చాలా ఇష్టం.

  • మా దేవళపు ఇసిత్రాలు!

    నాకు ఈ మధ్యన మా ఉప్పలపాడు చాలా గుర్తుకొస్తోంది. నాకు దిగులేసినప్పుడల్లా అలా గుర్తుకొస్తోంది, ఎందుకో!