-
‘ఏర్పాట్లు ‘ – ఇందిరా పార్థసారథి
తమిళ రచయిత ఇందిరా పార్థసారధి రాసిన ‘ఏర్పాట్లు’ అనే ఈ కథ ను తెలుగులోకి అనువదించింది జిల్లెళ్ళ బాలాజీ గారు. ఛాయా పబ్లికేషన్స్ ప్రచురించిన ‘నీళ్ళ కోడి’ కథాసంకలనం లోనిది. ఇందిరా పార్థసారధి సుప్రసిద్ధ తమిళ రచయిత. తన రచనలకు, సరస్వతీ సమ్మాన్, సంగీత నాటక అకాడమీ, సాహిత్య అకాడమీ, పద్మశ్రీ లాంటి ఎన్నో పురస్కారాలను పొందారు. ‘నీళ్ళ కోడి’ కొనడానికి – https://amzn.to/44Jov9x
-
కథ – యంత్ర విజయం : వీబీ సౌమ్య గారు
ఈ ఎపిసోడ్ లోని కథ ‘యంత్ర విజయం’ రాసింది, వి.బి. సౌమ్య గారు. Natural Language Processing (NLP) లో PhD చేసారు. ప్రస్తుతం కెనడాలోని నేషనల్ రీసెర్చ్ కౌన్సిల్‌లో పని చేస్తున్నారు. అనువాదకురాలు, రచయిత. జులై నెల – సంచిక వెబ్ మ్యాగజైన్ లో ప్రచురించారు. కథను చదువుకోడానికి వెబ్ లింక్ – షో నోట్స్ లో వుంది. https://bit.ly/yantrav కృత్రిమ మేధ అంటే? https://bit.ly/AItelugu కర్బన పాదముద్రలంటే? https://bit.ly/carbonfprint *హర్షణీయం పాడ్కాస్ట్ గురించి…
-
‘సత్యలింగం’ – పతంజలి శాస్త్రి గారి రచన (గుప్తా’91 సంపుటం నించి)
సత్యలింగం’ పతంజలి శాస్త్రి గారు రాసిన ‘గుప్తా’91’ సంపుటం లోనిది. పుస్తకం కొనడానికి కింద ఇచ్చిన లింక్ వాడొచ్చు. గత సంవత్సరం చదివిన నేను చదివిన కథల్లో నిస్సందేహంగా సత్యలింగం అత్యుత్తమైన కథ. కథలోకెడితే ‘టీటీ’ అని పిలవబడే రైల్వే టికెట్ కలెక్టర్ కాంతారావు స్నేహితుడు స్వామి. తన ఇంట్లో అద్దెకుండే కూర్మయ్య నాయుడి గురించి స్వామికి చెప్పుకుంటూ ఉంటాడు కాంతారావు. నాయుడు విపరీతమైన కోపిష్టి. ఒళ్ళూపైతెలీని కోపంతో ఇబ్బందుల్లో ఇరుక్కుంటూ ఉంటాడు. తన జీవితంలో ప్రశాంతత…
-
‘చిలుకంబడు దధికైవడి’ – మూలం తమిళ రచయిత జెయమోహన్ రచన ‘మత్తుఱు తయిర్’
ఈ కథకు మూలం ప్రముఖ తమిళ రచయిత జెయమోహన్ రాసిన ‘మత్తుఱు తయిర్’ (Mathuru thayir Jayamohan | மத்துறு தயிர் ஜெயமோகன்) అనే కథ. జెయమోహన్ గారి ‘అఱం’ అనే కథాసంకలనం లోనిది. ‘అఱం’ లోని పన్నెండు కథలు, నిజ జీవితంలోని ప్రత్యేకమైన, ప్రసిద్ధమైన వ్యక్తుల గురించి మనకు చెబుతూ రచయిత రాసిన కథలు. ఈ కథలోని ముఖ్య పాత్ర , తిరువనంతపురం విశ్వవిద్యాలయ ఆచార్యుడుగా తమిళ సాహిత్యాన్ని బోధించిన ప్రొఫెసర్ జేసుదాసన్. (https://tamil.wiki/wiki/Professor_Jesudasan)…
-
హర్షణీయం శ్రోతలకు ( To Harshaneeyam Listeners)
హర్షణీయం పాడ్కాస్ట్ పై మీ అభిప్రాయం ( feedback form) – https://forms.gle/FiYgAbqjqncYUiqo7 హర్షణీయం టీం తో ఇంటర్వ్యూ సారంగ పత్రికలో – https://bit.ly/harsharanga హర్షణీయం పాడ్కాస్ట్ మొదలు పెట్టి ముప్ఫయి మూడు మాసాలయింది. తెలుగు కథల్లో మాకు నచ్చిన యాభై కథలకు పైగా పరిచయం చెయ్యడమే కాక , ముప్ఫయి ఐదు మంది తెలుగు కథా రచయితలను, ప్రచురణ కర్తలను, తెలుగు సాహిత్యం కోసం కృషి చేస్తున్న ప్రముఖులను హర్షణీయం పాడ్కాస్ట్ ద్వారా పరిచయం చేసాము.…
-
కథ : ‘కోరిన కోనల కురవని వాన’ మధురాంతకం రాజారాం గారి రచన
1993 వ సంవత్సరంలో కేంద్ర సాహిత్య అకాడమీ బహుమతి తన కథల పుస్తకానికి గెలుచుకున్న మధురాంతకం రాజారాం గారు తెలుగులో సుప్రసిద్ధ కథారచయిత. చిత్తూరు జిల్లాకు చెందిన రాజారాం గారు మూడు వందలకు పైగా కథలు రాసారు. వారి సమగ్ర కథాసంకలనం కిందటి వారం ఎమెస్కో పబ్లిషర్స్ వారు ప్రచురించారు. ఇందులో 295 కథలు ఐదు భాగాలలో ఇవ్వడం జరిగింది. కథలోకి వెళ్ళే ముందు – ఈ ఎపిసోడ్ షో నోట్స్ లో ఫీడ్బ్యాక్ ఫార్మ్ ఒకటి…
-
కథ : ‘కళాయి శాస్త్రం’ – అజయ్ ప్రసాద్ గారి ‘గాలిపొరలు’ నుంచి
‘కళాయి శాస్త్రం’ అనే ఈ కథ అజయ్ ప్రసాద్ గారి ‘గాలి పొరలు’ అనే కథా సంపుటంలో నుంచి. ప్రతి మనిషి జీవితంలో తారసపడే నిరంతరమైన వెతుకులాట గురించి రాసిన చక్కటి కథ. ప్రకాశం జిల్లా అద్దంకి రచయిత సొంత వూరు. ప్రస్తుతం ఉద్యోగ రీత్యా హైదరాబాద్ లో వుంటున్నారు. మంచి చదువరి. చక్కటి రచయిత. ఇది ఆయన రెండో కథా సంపుటం. పుస్తకం కొనడానికి కింది లింక్ ను ఉపయోగించండి. *హర్షణీయం పాడ్కాస్ట్ గురించి మీ…
-
‘సద్గతి’ – మధురాంతకం నరేంద్ర గారు
రచయిత తన రచనా వ్యాసంగాన్ని నలభై ఆరేళ్ళ క్రితం ప్రారంభించారు. వారిది సాహిత్య కుటుంబం. వారి తండ్రి గారు మధురాంతకం రాజారామ్ గారు , సోదరుడు మహేంద్ర గారు కూడా సుప్రసిద్ధ తెలుగు కథా రచయితలు.ఇది గాక , ఆయన ఆంగ్ల సాహిత్యంలో పరిశోధన చేసి , అధ్యాపక వృత్తిలో ప్రవేశించి, నలభై ఏళ్ల పైన, వేలమంది విద్యార్థులకి విద్యా దానం చేశారు.మన సమాజంలో, మన వ్యక్తిత్వాలలో వుండే వైచిత్రిని , అనేక రకాలైన సంఘర్షణలని అతి…
-
‘స్వింగ్’ – ఒంటరి పేజీ కథ
ఛాయా మోహన్ గారు రాసిన కథ ఇది. స్వింగ్ —————————– వేసవి సాయంత్రపు ఎండ, కాలం చీకటిలోకి జారిపోకుండా శాయశక్తులా ప్రయత్నిస్తోంది. పార్కులో పిల్లల సందడి అలల అల్లరిలా ఉంది. చాలా సేపటి నుంచి నా చూపు కొంచెం దూరంగా ఉయ్యాల ఎక్కి ఊగుతున్న పిల్లలు , అక్కడే తచ్చాడుతున్న ఓ ముసలాయన దగ్గర ఆగిపోయింది. ఓ పది మంది దాకా పిల్లలు వంతులు వంతులుగా ఉయ్యాల ఊగుతున్నారు. ఓ పిల్లాడు దిగంగానే ముసలాయన ఏదో అడుగుతున్నాడు. …
-
‘రామేశ్వరం కాకులు’
ఈ కథ పతంజలి శాస్త్రి గారు రాసిన ‘ రామేశ్వరం కాకులు’ పుస్తకం లోనిది. పుస్తకం కొనాలంటే – https://amzn.to/3rDN1YM రామేశ్వరం కాకులు : వెనకవైపు రెండు వేపచెట్లు పెరడంతా నీడ పెడతాయి. ఆ రెండు చెట్లనీడలో వానల్లో, ఎండల్లో, చలిలో క్షేమంగా ఉంటుంది పోలీసు స్టేషను. పెరటిగోడ పక్కభాగంలో లోపలికి రావడానికి చిన్న గేటుంది. సామాన్యంగా తెరవరు. వేపనీడలో ఒకవైపు రెండు స్నానాల గదులూ, ఒక పాయఖానా, వీటికి దూరంగా నాలుగు నీలం ప్లాస్టిక్ కుర్చీలు…
-
‘ నల్లజర్ల రోడ్డు’ – తిలక్ గారి కథ!
నల్లజర్ల రోడ్డు ‘తిలక్ కథలు’ అనే సంకలనం నుంచి. ఈ కథ మూడు భాగాలుగా ప్రసారం చెయ్యడం జరుగుతుంది. ఈ పుస్తకాన్ని నవచేతన వారు పబ్లిష్ చెయ్యడం జరిగింది. తిలక్ గారి కథలు ఆడియో రూపంలో మీకందించటానికి అనుమతినిచ్చిన శ్రీ మధుకర్ గారికి హర్షణీయం తరఫున హృదయ పూర్వక కృతజ్ఞతలు. పుస్తకం నవోదయ బుక్ హౌస్ వారి లింక్ ద్వారా ఆన్లైన్ లో కొనొచ్చు. – http://bit.ly/tilaknavodaya ‘ “నల్లజర్ల అడవి మీద చంద్రుడు భయంకరంగా ఉదయించాడు”. …
-
ఖదీర్ బాబు గారి ‘గేట్’!
‘గేట్’ ఖదీర్ బాబు గారి రచన. ‘ గత పాతికేళ్ళుగా తెలుగు కథ రచయితగా మనల్ని అలరిస్తున్న శ్రీ ఖదీర్ బాబు నెల్లూరు జిల్లా కావలి లో జన్మించారు. బి.ఎస్. సీ కంప్యూటర్ సైన్స్ లో పట్టభద్రులు. పత్రికా రంగంలో, సినీ రంగంలో తన సేవలందిస్తూ, రచనా ప్రక్రియను కొనసాగిస్తున్నారు. . వారు రాసిన పుస్తకాలలో కొన్ని ‘ దర్గామిట్ట కథలు ‘ , ‘ న్యూ బాంబే టైలర్స్ ‘ , ‘ పోలేరమ్మ బండ…