-
శ్రీరమణ గారు – బంగారు మురుగు
తెలుగు వారికి శ్రీ శ్రీ రమణ గారు కథా రచయిత గా , కాలమిస్ట్ గా , సంపాదకీయులుగా అత్యంత సుపరిచితులు. బంగారు మురుగు – శ్రీ రమణ గారు రచించిన ‘మిధునం ‘ కథా సంకలనం లోనిది. ఒక బామ్మ గారు, మనవణ్ణి తన ప్రాణానికి ప్రాణంలా ఎలా చూసుకుంది? తన తదనంతరం అదే ప్రేమను అందించడానికి, తన బంగారాన్ని, ఇంకో యోగ్యురాలైన వ్యక్తి చేతికి ఎలా అందించిందీ ? అనేదే ఈ కథలో ముఖ్యాంశం.…
-
‘పీవీ తో నేను’ – శ్రీరమణ గారి రచన ‘వెంకట సత్య స్టాలిన్’ నించి.
రచయిత పరిచయం: తెలుగు వారు గర్వపడే కథలు రచించిన రచయితల మొదటి వరుసలో శ్రీ శ్రీరమణ గారు వుంటారు. ఇది గాక వారు తెలుగు ప్రసార మాధ్యమాలన్నిటిలోనూ గత యాభై ఏళ్లపైబడి విమర్శ, సమీక్ష, సంపాదకీయం లాంటి అనేక రంగాల్లో పని చేస్తూ ఎంతోమందికి మార్గదర్శకత్వం చేస్తున్నారు. అతి సున్నితమైన హాస్యం తో రచనలు చేయడంలో ఆయన సిద్ధహస్తులు. తెలుగులో పేరడీ ప్రక్రియకు , ఒక గౌరవ ప్రదమైన సాహితీ స్థాయి కల్పించిన రచయిత గా ఆయన…
-
హర్షణీయంలో పెద్దిభొట్లవారి ‘ఇంగువ’ !
హర్షణీయానికి స్వాగతం. ఇప్పుడు కథా నీరాజనం శీర్షికలో మీరు వినబోతున్న కథ పేరు ‘ఇంగువ’ . ఈ కథ సుప్రసిద్ధ కథా రచయిత కీర్తిశేషులు పెద్దిభొట్ల సుబ్బరామయ్య గారి ‘ పెద్దిభొట్ల సుబ్బరామయ్య కథలు ‘ అనే కథా సంకలనం రెండో భాగం లోనిది. ఆంధ్రా లొయొలా కాలేజీలో అధ్యాపకునిగా జీవిత కాలం సేవలందించిన ఆయన , కవి సామ్రాట్ , శ్రీ విశ్వనాథ సత్యనారాయణ గారి ప్రియ శిష్యులు కూడా. ఈ పుస్తకం మొదటి రెండో…
-
‘ఓ హెన్రీ స్టోరీ’ – వెంకట్ శిద్ధారెడ్డి గారి ‘సోల్ సర్కస్’ కథాసంకలనం లోంచి!
హర్షణీయానికి స్వాగతం. ఇప్పుడు వినబోతున్న కథ శ్రీ వెంకట్ శిద్ధారెడ్డి గారు రాసిన , కథాసంకలనం ‘సోల్ సర్కస్’ లోనిది. వెంకట్ శిద్ధారెడ్డి గారు నెల్లూరు జిల్లాలో జన్మించి,కోరుకొండ సైనిక్ స్కూల్ , తరువాత హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో తన విద్యాభ్యాసాన్ని పూర్తి చేశారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలోకి ప్రవేశించి , దేశ విదేశాల్లో పని చేసిన ఆయన ‘సోల్ సర్కస్’ అనే కథ తో , రచయితగా పత్రికా రంగంలోకి అడుగుపెట్టారు. 2019 వ సంవత్సరంలో…
-
సుప్రసిద్ధ సినీ దర్శకులు వంశీ గారి కథ ‘ఏకాదశి చంద్రుడు’
హర్షణీయానికి స్వాగతం. ఈరోజు ‘కథా నీరాజనం’ శీర్షికన, ఏకాదశి చంద్రుడు అనే కథ మీరు వినబోతున్నారు. ఈ కథ వంశీ గారు ‘ ఖచ్చితంగా నాకు తెలుసు’ అనే కథా సంపుటి నించి స్వీకరించ బడింది. కథలోకెళ్లే ముందర వంశీ గారి గురించి ఓ రెండు మాటలు. వంశీ గారు ఎంత గొప్ప సినీ దర్శకుల్లో, అంత గొప్ప కథారచయిత కూడా. నేను చూసిన వంశీ గారి మొదటి సినిమా ‘సితార’. ఆ సినిమాలో వంశీ గారి…
-
‘వంశీ’ గారి కథ ‘శంకర్రావ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్’
ఈ వారం ‘కథా నీరాజనం’ లో సుప్రసిద్ధ సినీ దర్శకులు , కథా రచయిత , వంశీ గారి ‘ శంకర్రావు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ‘ అనే కథను పరిచయం చేస్తున్నాం. ఆడియోలో ముందుగా హర్షా, గిరి, ఇంకో మిత్రుడు బాలాజీ, వంశీ గారి రచనల గురించి. ప్రత్యేకంగా ఈ కథ పై తమ అభిప్రాయాలను తెలియచేయడం జరుగుతుంది, ఈరోజున మనకున్న గొప్ప తెలుగు కథారచయితల్లో నిస్సందేహంగా వంశీ గారొకరు. ఆయనదైన ట్రేడ్ మార్క్ హాస్యంతో, అతిసుందరమైన…
-
సాబువ్వ
మబ్బులు కమ్మిన ఆకాశాన్ని తీక్షణంగా చూస్తున్న వరదయ్యను చూసి “ఏందయ్యా.. పైన మోడం గట్టిందెప్పుడూ సూళ్ళేదా” అని భార్య భూదేవమ్మ నవ్వుతోంది. “కాదే దేవమ్మా .. ఎప్పుడూ ఓ సుక్క గూడా రాల్చని మబ్బులు గూళ్ళు గూళ్ళుగా ఔపిస్తూ ఎందుకే ఆశల్లేపుతాయి.. మనం గూడా మనుసులమే కదా!! ఓ రెండు సినుకులు రాలిస్తే పైన నీళ్ళు ఆవిరైపోతాయా” అని దేవమ్మను చూసి అంటూంటే.. నువ్వు రమ్మని పిలిసి సూడు వత్తాయ్.. నే పోతాండా, ఆడ ఎండుగెడ్డి పీకాల,…
-
బెల్లం టీ ‘నెమలి కన్ను’ మురళి గారు
ఈ సారి, హర్షాతిధ్యం శీర్షికన, శ్రీ మురళి గారి, బ్లాగ్ ‘నెమలి కన్ను’ పరిచయం చేస్తున్నాం. ఆయన, 2009 వ సంవత్సరం నించి తన బ్లాగ్ ను నిర్వహిస్తున్నారు. తాను స్వయంగా చక్కటి కథలను రాయడమే కాకుండా , తన బ్లాగ్ ద్వారా తెలుగు సాహిత్యంలో చక్కని కథలను, ఎన్నో సంవత్సరాలనుంచీ తన పాఠకులకు పరిచయం చేస్తున్నారు. వాటిల్లో తెలుగు కథల్లో ‘స్త్రీ’ పాత్రలపై విశ్లేషణ, కన్యాశుల్కం పాత్రలపై వారి వ్యాఖ్యానం ఎన్నదగినవి. అడిగిన తడవునే, తన…
-
హృదయస్పందనల చిరు సవ్వడి!
ఈ సారి, హర్షాతిధ్యం శీర్షికన, శ్రీ భాస్కర్ రామి రెడ్డి గారి, బ్లాగ్ పరిచయం చేస్తున్నాం. ఆయన, గత పది సంవత్సరాలుగా తన బ్లాగ్ ను చక్కటి, చిక్కటి తెలుగులో, ‘హృదయస్పందనల చిరుసవ్వడి’ పేరు తో నిర్వహిస్తున్నారు. ఆయన బ్లాగ్ కి లింకుని క్రింద ఇవ్వడం జరిగింది. హర్షణీయం పాఠకులకి, ఒక మంచి అనుభూతిని వారి రచనలు తప్పకుండా మిగులుస్తాయి. బ్లాగ్ లింక్ : http://chiruspandana.blogspot.com/2015/10/blog-post_8.html? ‘పిల్లలని కనాలంటే’ అనే పేరుతో తన బాల్యపు మధుర స్మృతులు…
-
అతిథి దేవోభవ!
కేరళ – ఒక కేళీరవం, కళల మౌక్తికం.. ప్రపంచమంతా ప్రేమగా పిలిచే ” గాడ్స్ ఓన్ కంట్రీ “.ఎలా వర్ణిద్దాం ఈ అద్భుతాన్ని!! పర్యాటకులను కట్టిపడేసే వాయనాడ్ లో ఉదయించే సూర్యుడిని తాకే చల్లటి మబ్బుల్లా, మున్నార్ టీ తోటల్లో వీచే పిల్లగాలుల్లా, జారే జలపాతాల్లా, సోయాగాల సాగర తీరాల్లా, బ్యాక్ వాటర్స్ లా, రబ్బర్ తోటల్లా, వంద శాతం అక్షరాస్యతలా.. దేవుళ్ళంతా ఆనంతపద్మనాభుడిలా, గురువాయూర్ కృష్ణుడిలా, శబరిమల మణికంఠుడిలా మాకు రక్ష. మాది ఒక వ్యవసాయం…
-
ప్రణవం – ప్రణయం – పరిణయం
చక్కగా టేపు వేసున్న కవర్ కొరియర్ లో వస్తే వెనక్కి తిప్పి చూశాను. పంపిన ఊరు అందరికీ తెలిసిన మదనపల్లె అయినా పంపివాయన పేరు నాకు తెలియని ఆనందరావు.
-
లీలా కాలనీ
తలుపులు దబదబా బాదుతున్న శబ్దం . గడియారం చూస్కుంటే సాయంత్రం ఆరున్నర అయ్యింది.. డోర్ ఓపెన్ చేస్తే, బయట నిలబడున్నాడు నీటు గా డ్రెస్సు అయ్యి తన స్టాండర్డ్ నిశాచర వస్త్రాలు – బ్లాక్ జీన్సు, బ్లాక్ టీషర్ట్ లో రామకృష్ణ. “మంచి నిద్ర పాడుచేశావ్ ! కొంపలేంమునిగాయనీ” ? “బైకు తాళాలిస్తావా, ఇప్పటికే లేట్ అయిపోయింది.” ? తాళాలు ఇస్తూ చెప్పాను , ” పొద్దున్నే ఫ్యాక్టరీ నించి వస్తూంటే రిజర్వు లోకి వచ్చింది ,…
-
అర్థాంతర ప్రయాణాలు!
అమ్మ పొట్టలోనే ఇంకొన్ని రోజులు హాయిగా వుందామనుకున్న నన్ను, అలా ఉండటం కుదరదు అంటూ ఫోర్సెప్స్ లాటి పరికరాలు వాడి మరీ ఈ లోకం లోకి తీసుకొచ్చారు అమ్మ తో పని చేసే సహ డాక్టర్స్.
-
చిన్నీ వాళ్ళ చంద్రత్త!
“చిన్నీ ! నీ పెళ్ళికి చంద్రత్త వాళ్ళు రావట్లేదట , ఇందాక నువ్వు షాపింగ్ కి వెళ్ళినప్పుడు , మావ ఫోన్ చేశారు, చంద్రత్త కి కొంచెం ఒంట్లో బాలేదట. ” అన్నారు నాన్న.
-
పిన్ని అనబడే వరలక్ష్మి గారు, అనే పిచ్చి రాముడి కథ!
మన పిచ్చి రాముడు గారు రాసిన, ‘అమ్మ గురించి’ చదవగానే, ఆయన్ని ఆయన ఒక అమాయకుడి గా చిత్రీకరించు కొని, వాళ్ళ అమ్మ గారు “నా పిచ్చి తండ్రి” అని ఎలా పిలుచుకునేదో, ఎలా కాపాడుకొని కడుపులో దాచుకొనేదో అని రాసిన విధానం నా మనస్సుకు చాలా హత్తుకున్నది.
-
నెల్లూరు ట్రంక్ రోడ్డు నందలి నా ‘జాతక’ కథ!
ఆ రోజు, ఒంగోల్లో ఏదో పెళ్లి ఉందని, వారం రోజులు కని, మా ఆవిడ బయలు దేరుతూంటే, ఆవిణ్ణి, రైలు ఎక్కించి, ట్రంకు రోడ్డుకొచ్చాను.
-
నవ్వితే నవ్వండి
హర్షణీయం మొదలు పెట్టి 3 మాసాలు అయ్యింది. ఈ కొద్దికాలంలోనే ఐదు వేల మంది పాఠకులు మా బ్లాగ్ ని సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా ‘హర్షాతిధ్యం’ అనే కొత్త శీర్షిక మేము మొదలుపెడ్తున్నాం. దీని ప్రధాన ఉద్దేశ్యం, తెలుగు బ్లాగ్ ప్రపంచంలో వుండే చక్కటి కథల్ని, హర్షణీయం పాఠకులకు ప్రతి నెలా మొదటి వారంలో పరిచయం చెయ్యడం.
-
మా విజయ్ – “అన్న”
చేతి లో ఒక చిన్న బాగు తో, నా రూం బయట, కుర్చీలో కూర్చుని వెయిట్ చేస్తున్నాడాయన.
-
తరలి రాద తనే వసంతం
‘తరలి రాద తనే వసంతం’ అనే నా పాట తోనే ఆ రోజు ఇళయరాజా లైవ్ కన్సెర్ట్ మొదలయ్యింది.
-
కలడు కలం డనెడు వాడు?
నెల్లూళ్ళో మా టౌన్ హాల్ అంతా నిండిపోయింది . రెండువేల కి మించి ప్రజానీకం.
-
ఆధునిక తెలుగు సాహిత్యంలో ట్రావెలాగ్!
ఆధునిక తెలుగు సాహిత్యం లో అన్ని ప్రక్రియలకంటే ముందు వచ్చినది యాత్రా సాహిత్యమే.
-
సన్నిధానం!
ఇన్ని రకాల జనాలు, వీళ్ళందరూ ఎందుకొచ్చారో అనుకున్నా చుట్టూ చూస్తూ. లాల్చీ పైజామాలు, పంచెలు, చీరలు, పంజాబీ డ్రెస్సులలో రక రకాల వయస్సుల వాళ్ళు. ముందు వరుసలో అప్పుడే పెళ్లి అయిన ఓ జంట పసుపు బట్టలలో కూర్చోనున్నారు. క్యూ కాంప్లెక్స్ నుండి మసక మసకగా కనపడుతుంది బంగారు గోపురం. వేకువ ఝాము ఐదున్నర అవుతుంది. డిసెంబర్ నెల, మంచు కురుస్తుంది బయట. అప్పుడు నేను బెంగుళూరు లో ఉండేవాడిని. ముందురోజు తిరుపతొచ్చి ఫ్రెండ్ ని కల్సి…
-
మా జి.వి.ఎస్ మాస్టారు గారు!
జి.వి.ఎస్ మాస్టారు గారు ఒంగోలు P.V.R.మునిసిపల్ హై స్కూల్ లో నా టీచర్. పూర్తి పేరు గాలి వెంకట సుబ్బారావు గారు. ఆరడుగుల మనిషి, స్ఫురద్రూపి, లెక్కలు మరియు సైన్స్ అయన స్పెషాలిటీ. ఇదికాక ఆయన అద్భుతమైన వక్త, విషయం ఏదైనా తెలుగు లో చాలా అందంగా, అనర్గళంగా మాట్లాడగలరు.
-
ప్రపంచ సాహిత్యంలో ట్రావెలాగ్!
ప్రాచ్య భారత దేశానికి మహా ఇతిహాస జాతీయ కావ్యాలైన రామాయణ, భారత, భాగవతాలు ఎట్లో, ప్రాచీన పాశ్చాత్య సంస్కృతికి మూల స్తంభమైన గ్రీకు నాగరికతకు వారి చరిత్రలు అయిన ఇలియడ్ మరియు ఒడిస్సీలు అలానే అని చెప్పవచ్చు.
-
తెలుగులో ట్రావెలాగ్ సాహిత్యం!
అందరికి నమస్కారము. ఈ వేదిక ద్వారా నేను, తెలుగులో ట్రావెలాగ్ సాహిత్యం అనే శీర్షిక పేరుతో మూడు వ్యాసాలు మీకు అందించ దలచుకున్నాను.
-
హర్షణీయంలో సాహితీవనం !
హర్షణీయం వయస్సు రెండు మాసాలు. ఈ రెండు మాసాల్లోనే నేను, నా మిత్ర బృందం దాదాపు 1800 మంది అతిథులను, వారిచే 9000 దర్శనాలను మరియు పునర్దర్శనాలను సంపాదించుకున్నాము. మొదట మా గిరిగాడి సలహాకు నవ్వుకున్నాము, మా కథలను ఆడియో రూపంలో కూడా పెట్టమన్నప్పుడు. కానీ ఇప్పుడు ఆశ్చర్యం గా మా కథలు ఆడియో రూపంలో రమారమి 5000 మార్లు దిగుమతి అయ్యాయి.
-
క్షమించండి, ఇది మగ పాఠకులకు మాత్రమే!
నాకు రాయటం వ్యసనంగా మారిందనుకుంటా . ఎదో ఒకటి రాయకుండా ఉండలేక పోతున్నా. నా కథా వస్తువులకు బాల్యం, బంధాలు మొదలగునవి ముడిసరుకులు. కానీ వ్యసనంగా మారాక ఫీల్ గుడ్ కథలు మాత్రమే కాదు, అన్నీ కథలు రాయాలి, రాసి మీలాటి విజ్ఞులచే, హర్షా! నీ దగ్గరనుండి ఇలాటి కథ ఊహించలేదు అని దాడి చేయించుకోవాలి.