Apple PodcastsSpotifyGoogle Podcasts

  • ‘వార్తాహరులు’ – ఉణుదుర్తి సుధాకర్ గారు
    ‘వార్తాహరులు’ – ఉణుదుర్తి సుధాకర్ గారు

    ‘వార్తాహరులు’ అనే కథ, రచయిత ఉణుదుర్తి సుధాకర్ గారు. సుధాకర్ గారి ‘తూరుపు గాలులు’ అనే సంపుటం లోనిది. మనదేశంలో బ్రిటిష్ వారు, టెలిగ్రాఫ్ వ్యవస్థ ఏర్పరచడానికి దారి తీసిన పరిస్థితులను ఆధారంగా తీసుకొని రాసిన కథ. మెరైన్ ఇంజనీర్ గా పని చేసిన సుధాకర్ గారు రాసిన ‘యారాడ కొండ’ ఆటా నిర్వహించిన నవలల పోటీలో ద్వితీయ బహుమతి పొందిన నవల. ‘హిస్టారికల్ ఫిక్షన్’ రాస్తున్న అతి కొద్దిమంది రచయితల్లో సుధాకర్ గారు ముందు వరసలో…

  • ‘జెన్’ – పతంజలి శాస్త్రి గారి రచన
    ‘జెన్’ – పతంజలి శాస్త్రి గారి రచన

    రిటైరై,  కొడుకూ కోడలితో జీవించే నాయుడు గారు. వృత్తి రీత్యా ఒక మెకానిక్. ప్రపంచాన్ని ఆశావహ దృక్పధంతో చూస్తూ, ఓపిగ్గా,  చుట్టూవుండే పరిస్థితులను కావలసిన విధంగా మలుచుకుంటూ,  జీవించడాన్ని ఇష్టపడతారు.  ఆయనకు పూర్తిగా విరుద్ధ స్వభావం వుండే ఆయన కొడుకు కృష్ణ , తన జీవితంలో వుండే అసంతృప్తిని వస్తువులపై చూపించడమే కాక , తన భార్యను కూడా వాటి గాటన కట్టేసే  మనిషి. కథలోవుండే ఇంకో ముఖ్యపాత్ర ‘అమ్మతల్లి’ –  స్నేహితుడు పనికి రాదని పారేస్తూంటే…

  • ‘సంపెంగపువ్వు’ – గోపీచంద్ గారు.
    ‘సంపెంగపువ్వు’ – గోపీచంద్ గారు.

    ‘సంపెంగ పువ్వు’ గోపీచంద్ గారు రాసిన కథ . 1971 వ సంవత్సరం, జనవరి నెల యువ మాస పత్రిక లో ప్రచురింపబడింది. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత గోపీచంద్ గారు ప్రసిద్ధ రచయిత, సినిమా రంగంలో ప్రవేశించి దర్శక నిర్మాత గా కొన్ని చిత్రాలను నిర్మించారు. కొన్ని సినిమాలకు రచయితగా కూడా పని చేశారు. ఈ కథను మీకు అందించదానికి, అనుమతినిచ్చిన శ్రీమతి రజని గారికి కృతజ్ఞతలు. ముందుగా, రజని గారు గోపీచంద్ గారి…

  • ‘గాలివాన’ – పాలగుమ్మి పద్మరాజు గారి రచన
    ‘గాలివాన’ – పాలగుమ్మి పద్మరాజు గారి రచన

    కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు గ్రహీత ప్రముఖ రచయిత పాలగుమ్మి పద్మరాజు గారు రాసిన ‘గాలివాన ’ కథ , పాలగుమ్మి పద్మరాజు రచనలు – మొదటి వాల్యూమ్ లోనిది . న్యూయార్క్ హెరాల్డ్ ట్రిబ్యూన్  నిర్వహించిన కథల పోటీలో రెండవ బహుమతి పొందింది. పుస్తకం కొనడానికి కావాల్సిన  web link కథను మీకందించడానికి అనుమతినిచ్చిన  పాలగుమ్మి సీత గారికి కృతజ్ఞతలు. ఎపిసోడ్లో ముందుగా కథ గురించి పాలగుమ్మి సీత గారు మాట్లాడతారు. హర్షణీయం’ పాడ్కాస్ట్ ని ‘గానా’…

  • ‘మంత్రపుష్పం’ – మల్లాది రామకృష్ణ శాస్త్రి గారు
    ‘మంత్రపుష్పం’ – మల్లాది రామకృష్ణ శాస్త్రి గారు

    హర్షణీయంలో ఇప్పుడు వినబోయే కథ – మంత్రపుష్పం, మల్లాది రామకృష్ణ శాస్త్రి గారి రచన. తన 19వ ఏటనే కథారచన ప్రారంభించి దాదాపు 125 కథలను రాశారు. వీరు రాసిన డుమువులు కథ 14 భారతీయ భాషలలోకి అనువదింపబడింది. మచిలీపట్నంలో బి.ఎ. వరకు చదివారు. తరువాత మద్రాసులో సంస్కృతాంధ్రాలలో ఎం.ఎ.పట్టా పుచ్చుకున్నారు. నాట్యకళలో, చిత్రలేఖనంలో, సంగీతంలో కూడా వీరికి ప్రవేశం ఉంది. కృష్ణాతీరం అచ్చ తెలుగు నుడికారానికి పట్టం కట్టిన రచనగా తెలుగు సాహిత్య చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే నవలగా ఖ్యాతి గడించింది.…

  • వాకాటి పాండురంగరావు గారి ‘మందీ – మరొక్కడు’
    వాకాటి పాండురంగరావు గారి ‘మందీ – మరొక్కడు’

    హర్షణీయంలో వినబోయే కథ పేరు ‘మందీ – మరొక్కడు’ వాకాటి పాండురంగరావు గారి రచన. ఈ కథను అందించడానికి అనుమతినిచ్చిన అపరాజిత గారికి కృతజ్ఞతలు. సుప్రసిద్ధ కథా రచయిత , పాత్రికేయులు వాకాటి పాండురంగ రావు గారు 1934 లో  జన్మించారు. ఆయన  ఆనందవాణి, ఆంధ్ర జ్యోతి, న్యూస్ టైం, ఏ.పి.టైమ్స్, ఆంధ్రప్రభ వారపత్రికలలో వివిధ పాత్రికేయ సేవలనందించారు. శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో జర్నలిజం అధ్యాపకునిగా పనిచేసారు.  విశాఖపట్నం పోర్టుకు డిప్యూటీ దైరక్టరుగా కూడా పనిచేసారు. పాండురంగారావుకథలు , మిత్రవాక్యం , చేత వెన్నముద్ద ,సృష్టిలో తీయనిది, దిక్చూచి లు ఆయన ప్రసిద్ధ రచనలు.…

  • ‘హెడ్ మాస్టారు ‘ పాలగుమ్మి పద్మరాజు గారి రచన!
    ‘హెడ్ మాస్టారు ‘ పాలగుమ్మి పద్మరాజు గారి రచన!

    న్యూయార్క్ హెరాల్డ్ ట్రిబ్యూన్  అంతర్జాతీయ కథా అవార్డు గ్రహీత, కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు గ్రహీత ప్రముఖ రచయిత పాలగుమ్మి పద్మరాజు గారు రాసిన ‘హెడ్ మాస్టారు ’ కథ , పాలగుమ్మి పద్మరాజు రచనలు – మొదటి వాల్యూమ్ లోనిది .  పుస్తకం కొనడానికి కావాల్సిన  web link కథను మీకందించడానికి అనుమతినిచ్చిన  పాలగుమ్మి సీత గారికి కృతజ్ఞతలు. ఎపిసోడ్లో ముందుగా కథ గురించి పాలగుమ్మి సీత గారు మాట్లాడతారు. హర్షణీయం’ పాడ్కాస్ట్ ని ‘గానా’…

  • ‘చిట్టి తల్లి’ పాలగుమ్మి పద్మరాజు గారి రచన!
    ‘చిట్టి తల్లి’ పాలగుమ్మి పద్మరాజు గారి రచన!

    న్యూయార్క్ హెరాల్డ్ ట్రిబ్యూన్  అంతర్జాతీయ కథా అవార్డు గ్రహీత, కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు గ్రహీత ప్రముఖ రచయిత పాలగుమ్మి పద్మరాజు గారు రాసిన ‘చిట్టి తల్లి’ కథ , పాలగుమ్మి పద్మరాజు రచనలు – మొదటి వాల్యూమ్ లోనిది .  పుస్తకం కొనడానికి కావాల్సిన  web link కథను మీకందించడానికి అనుమతినిచ్చిన  పాలగుమ్మి సీత గారికి కృతజ్ఞతలు. కథను రెండు భాగాలుగా ఆడియో చెయ్యడం జరిగింది, నిడివి ఎక్కువ కావడం వల్ల . ఎపిసోడ్లో ముందుగా…

  • ‘ఎందుకు పారేస్తాను నాన్నా!’ చాగంటి సోమయాజులు గారి రచన
    ‘ఎందుకు పారేస్తాను నాన్నా!’ చాగంటి సోమయాజులు గారి రచన

    చాగంటి సోమయాజులు గారు ‘చాసో’ గా తెలుగు పాఠక లోకానికి సుపరిచితులు. ఆధునిక తెలుగు కథను ప్రగతి శీల భావాలతో సుసంపన్నం చేసిన చాసో ఎన్నో గొప్ప కథలను రచించారు. 1945 వ సంవత్సరంలో ‘భారతి’ మాస పత్రికలో ప్రచురితమైన ఈ కథను హర్షణీయం ద్వారా మీకందించడానికి అనుమతినిచ్చింది చాగంటి తులసి గారికి , కథకు ఆడియో ని అందించిన చాగంటి కృష్ణ కుమారి గారికి కృతజ్ఞతలు. ఇదే పేజీలో ఈ కథపై, సారంగ వెబ్ మ్యాగజైన్…

  • ‘సీతా… రాముడొస్తున్నాడోయ్ ‘ – యండమూరి గారి రచన !
    ‘సీతా… రాముడొస్తున్నాడోయ్ ‘ – యండమూరి గారి రచన !

    నవలా రచయితగా లక్షల కొద్దీ అభిమానుల ఆదరం చూరగొన్న యండమూరి వీరేంద్రనాథ్ గారు, గొప్ప నాటికలను రచించారు, అలాగే అతి చక్కటి కథలను కూడా . ఆయన రచించిన కథలలోనించి 25 ఎంపిక చేసిన కథలతో వచ్చిన పుస్తకం ‘ ది బెస్ట్ అఫ్ యండమూరి వీరేంద్రనాథ్’ . ఆ పుస్తకంలోని చివరి కథ ఇప్పుడు మీరు వినబోయే, ‘సీతా…. రాముడొస్తున్నాడోయ్ ‘. ఈ కథను హర్షణీయం ద్వారా మీకందించడానికి అనుమతినిచ్చిన వీరేంద్రనాథ్ గారికి కృతజ్ఞతలు. ఈ…

  • ‘తోటి వేటగాళ్లు’ కేఎన్వై పతంజలి గారి కథ!
    ‘తోటి వేటగాళ్లు’ కేఎన్వై పతంజలి గారి కథ!

    ‘తోటి వేటగాళ్లు’ కే ఎన్ వై పతంజలి గారు రాసిన , వేట కథలు అనే కథాసంపుటం లోనిది. ఈ పుస్తకం కొనడానికి ఈ లింక్ ని ఉపయోగించండి. తోటి వేటగాళ్లు కథపై శ్రీ మందలపర్తి కిషోర్ గారి సమీక్ష కూడా ఆడియోలో మీరు వినవచ్చు. కథను మీకందించడానికి అనుమతినిచ్చిన శ్రీమతి ప్రమీలా పతంజలి గారికి కృతజ్ఞతలు. తోటి వేటగాళ్ళు ! బండివేగిసచెట్టు చేతులెత్తి, జుత్తు విరబోసుకు నిల్చుని రాక్షసుడిలాగుంది ఆ చీకటిలో.  దానినీ , దానితో…

  • ‘బేడమ్మ’ – శ్రీరమణ గారి కథ
    ‘బేడమ్మ’ – శ్రీరమణ గారి కథ

    ‘బేడమ్మ’ అనే ఈ కథ శ్రీరమణ గారు రచించింది. శ్రీరమణ గారు రాసిన శ్రీ ఛానల్ – 2 అనే సంకలనం లోనిది. పుస్తకం కొనడానికి క్రింది ఉన్న లింక్ ని ఉపయోగించండి. బేడమ్మ ఆవిడ అసలు పేరేమిటో తెలియదు. పుట్టు పూర్వోత్తరాలూ తెలియవు.  ఎవర్ని అడిగినా “మాకు గ్రాహ్యం వచ్చినప్పట్నించీ బేడమ్మ యిలాగే వుంది. గోగుకాడలా” అంటారు తప్ప వయసు చెప్పలేరు.  ఒంగిపోకపోయినా నిలువెల్లా  వార్థక్యం తెలుస్తూనే ఉండేది. బ్రాహ్మణ వీధిలో ఉన్న పది యిళ్లూ…