-
‘ఇసుక అద్దం’ శ్రీ వూహ గారితో సంభాషణ
శ్రీ వూహ గారి మొదటి కథా సంపుటం ‘ఇసుక అద్దం’డిసెంబర్ నెలలో రిలీజ్ అయ్యింది. ఈ ఎపిసోడ్ లో తన కథారచన గురించి, తనను ప్రభావితం చేసిన విషయాల గురించి శ్రీ వూహమాట్లాడారు. ఇసుక అద్దం కొనడానికి క్రింది లింక్ ను ఉపయోగించండి.
-
రచయిత అజయ్ ప్రసాద్ గారితో సంభాషణ
తెలుగులో మనకున్న అత్యంత ప్రతిభావంతులైన రచయితలలో అజయ్ ప్రసాద్ గారు ఒకరు. హర్షణీయంతో చేసిన ఈ సంభాషణలో తన రచనా జీవితం గురించి , ఈ మధ్యే వచ్చిన ఆయన కథా సంపుటం ‘గాలి పొరలు’ గురించి ఆయన వివరించారు. ప్రకాశం జిల్లా అద్దంకి వారి సొంత వూరు. ప్రస్తుతం ఉద్యోగ రీత్యా హైదరాబాద్ లో వుంటున్నారు. మంచి చదువరి. చక్కటి రచయిత. గాలి పొరలు ఆయన రెండో కథా సంపుటం. పుస్తకం కొనడానికి కింది లింక్…
-
కవి , అనువాదకులు శ్రీ ముకుంద రామారావు గారితో సంభాషణ
అదే గాలి, అదే ఆకాశం, అదే నేల, అదే కాంతి, అదే నీరు …… కవిత్వాన్ని పాంచభౌతిక పదార్థంగా నిర్వచించి దేశ విదేశాల కవిత్వాన్ని స్వయంగా అనుభవించి పదిమందీ ఆస్వాదించడానికి అనువదించి అందిస్తున్న ముకుంద రామారావు స్వయంగా కవి. అనువాద రంగంలో ఆయన కృషి అనితర సాధ్యం. ‘శతాబ్దాల సూఫీ కవిత్వం’ ద్వారా సూఫీ తత్త్వ సారాన్ని కాచి తెలుగులోకి వడగట్టి పోశారు. నోబెల్ బహుమతి పొందిన కవుల కవిత్వ జీవిత విశేషాల్ని క్రోడీకరిస్తూ వారి విశిష్ట…
-
అనిల్ అట్లూరి గారితో సంభాషణ
ఈ ఎపిసోడ్ లో రచయిత, అనువాదకులు, కాలమిస్ట్ అనిల్ అట్లూరి గారు తన సాహితీ జీవితం గురించి, పుస్తక ప్రచురణ రంగంలో వస్తున్న అనేక మార్పుల గురించి విస్తారంగా హర్షణీయంతో మాట్లాడారు. అనిల్ అట్లూరి గారి తండ్రి ప్రముఖ సినీ రచయిత, కథా రచయిత అట్లూరి పిచ్చేశ్వర రావు గారు. తల్లి చౌదరాణి గారు స్థాపించిన ‘రాణి బుక్ సెంటర్’ ద్వారా అనిల్ అట్లూరి తెలుగు పుస్తకాలను అనేక దశాబ్దాలు మద్రాసులోని పుస్తక ప్రేమికులకు అందించారు. అనిల్…
-
‘త్రిపుర’ గారి గురించి డాక్టర్ మూలా సుబ్రహ్మణ్యం
ఈ ఎపిసోడ్లో శ్రీ మూలా సుబ్రహ్మణ్యం గారు, ప్రసిద్ధ రచయిత త్రిపుర గారి గురించి మాట్లాడతారు. శ్రీ సుబ్రహ్మణ్యం VLSI ఆర్కిటెక్చర్ లో డాక్టరేట్ తీసుకుని, ప్రస్తుతం పాలక్కాడ్ ఐఐటీ లో పని చేస్తున్నారు. స్వతహాగా, చక్కటి కవి రచయిత . ,’ఆత్మనొక దివ్వెగా’ నవల , ‘సెలయేటి సవ్వడి’ కవితా సంపుటి వీరి ప్రసిద్ధ రచనలు.
-
‘సమాంతరాలు’ పతంజలి శాస్త్రి గారి కొత్త కథా సంపుటం
ప్రసిద్ధ రచయిత పతంజలి శాస్త్రి గారి ‘సమాంతరాలు’ కథాసంపుటం విడుదల సందర్భంగా , ఛాయా మోహన్ గారితో కలిసి , హర్షణీయం – పతంజలి శాస్త్రి గారితో చేసిన సంభాషణ , ఈ ఎపిసోడ్లో . పుస్తకం కొనడానికి ఈ లింక్ ఉపయోగించండి. (https://bit.ly/samantharaalu) . పుస్తకం, ఆడియో వెర్షన్ ‘ఆడియో బైట్స్’ యాప్ కు సబ్స్క్రయిబ్ చేసి వినవచ్చు. (https://audiobites.storytel.com/) . తెలుగులో మొదటిసారిగా, ఆడియో , ప్రింటెడ్ వెర్షన్స్ ఒకే సారి లభ్యం అవ్వడం, ‘సమాంతరాలు’…
-
రచయిత ఉణుదుర్తి సుధాకర్ గారితో సంభాషణ
ఆటా బహుమతి పొందిన ‘యారాడకొండ’ నవలా రచయిత శ్రీ . ఉణుదుర్తి సుధాకర్. వృత్తి రీత్యా మెరైన్ ఇంజనీర్ అయిన శ్రీ సుధాకర్ రాసిన ‘తూరుపు గాలులు’ కథాసంపుటం కూడా విశేష ఆదరణ పొందింది. ఇప్పుడు కొత్తగా రాసిన ఇంకో కథల పుస్తకం ‘ చలిచీమల కవాతు. హర్షణీయం టీం ఆయనతో జరిపిన ఇంటర్వ్యూ ఇప్పుడు మీ కోసం. ‘చలిచీమల కవాతు’ పుస్తకం కొనడానికి ఈ లింక్ ని ఉపయోగించండి – https://amzn.to/3BzBpsO హర్షణీయం ఇంటర్వ్యూ మీరుఎంతకాలంనించీకథలురాస్తున్నారు?…
-
స వెం రమేష్ గారితో హర్షణీయం
స.వెం.రమేశ్ గారు జీవితమంతా తెలుగు భాషా ప్రాచుర్యానికే అంకితం చేసిన అపురూపమైన మనిషి. హర్షణీయంతో ఆయన మనం కోల్పోతున్న భాషా వైభవాన్ని సంస్కృతిని గురించి, మాట్లాడుతూ , ఈ ప్రయాణంలో తాను దాచుకున్న అనేక అనుభవాలను అనుభూతులను పంచుకున్నారు.
-
పుస్తక ప్రేమికుడు, అనిల్ బత్తుల గారితో హర్షణీయం
అనిల్ బత్తుల ఒక పుస్తక ప్రేమికుడు. ప్రేమ అంటే పుస్తకాలు కొనడం, చదవడం తో ఆగిపోకుండా, లభ్యం కాని అరుదైన తెలుగు పుస్తకాలను వెతికి వెంటాడి వాటిని వెలుగులోకి తీసుకొచ్చేంత. ఇదికాకుండా, సోవియెట్ పిల్లల జానపద కథలను ప్రచురించారు. వేల పుస్తకాలను తన ఖర్చుతో సేకరించి, లైబ్రరీలకు అందచేశారు. పదేళ్లు ఐటీ రంగంలో పని చేసి, రిసైన్ చేసి , ఇప్పుడు నిజామాబాద్ పక్కనుండే ఒక పల్లెకు షిఫ్ట్ అయ్యి, వరల్డ్ సినెమా లో పిల్లల గురించి…
-
కథానవీన్ గారితో హర్షణీయం
కథా నవీన్’ గా సుప్రసిద్ధులైన శ్రీ వాసిరెడ్డి నవీన్ గారు , తెలుగు కథా సాహిత్య రంగంలో గత నలభై ఏళ్ళు గా పరిశ్రమ చేస్తున్నారు. విస్తృతంగా తెలుగు కథ గురించి వ్యాసాలు రాసారు. ‘ ప్రజాసాహితి’ పత్రిక సంపాదకునిగా పని చేశారు.. అనేక దేశాల్లో , తెలుగు కథ గురించి విశ్లేషణాత్మక ఉపన్యాసాలు చేసారు.1990 లో ‘తెలుగు కథా సాహితి’ అనే సంస్థ ను ఏర్పాటు చేసి, ప్రతి సంవత్సరంలో ప్రచురితమైన కథల్లో కొన్ని ఉత్తమమైన…
-
రచయిత దేవులపల్లి క్రిష్ణమూర్తి గారితో ఇంటర్వ్యూ! ‘నల్లగొండ మల్లి’ గారితో కల్సి
-
మనసు ఫౌండేషన్ ఎం.వి.రాయుడు గారితో ఇంటర్వ్యూ !
ఇంజనీరింగ్ డిగ్రీ , M.Sc through research , ఇండియన్ ఇన్స్టిట్యూట్ అఫ్ సైన్స్ లో పూర్తి చేసిన ఎం. వి రాయుడు గారు, పవర్ ఎలక్ట్రానిక్స్ లో డాక్టరేట్ తీసుకున్నారు . మనసు ఫౌండేషన్ ని 2006 వ సంవత్సరం లో తన సోదరులైన డాక్టర్ గోపీచంద్ , డాక్టర్ చంద్ర మౌళి గార్లతో కలిసి స్థాపించారు. తెలుగులో ఇప్పటిదాకా ప్రచురితమైన అన్ని పుస్తకాలను డిజిటల్ ఆర్కైవింగ్ చేసి భద్రపరచాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్న మనసు…