Apple PodcastsSpotifyGoogle Podcasts

  • సిక్స్ ప్యాక్ అనబడే నా కౌపీనం : హర్ష

    అబ్బా నా చేతిలో సైకిల్ వుంటే, పొట్ట యిలా పెరిగిపోయేనా, రాకుండా ఆగున్న సిక్స్ ప్యాక్ ఈ పాటికి వచ్చి పడి పొయ్యేనా, అని జోరీగలా పోరగా పోరగా, యిక వీడిని యిలా ఉపేక్షిస్తే కందిరీగలా కుడతాడు అని డిసైడ్ అయ్యి ఓ నెల  కిందట మా ఆవిడ నాకు ఓ పదమూడు వేలు పెట్టి ఓ హైబ్రిడ్ సైకిల్ కొనిచ్చింది. అదే చేతితో, ఒక బెల్, గాలి కొట్టుకొనే పంప్, మెత్తగా వుండే సీట్,  అలాగే…

  • మా ఐ.టి వాళ్ళు కొండను తవ్వారు, ఎలుకను పట్టారు!

    “ఎవరక్కడా!” అని కోపంగా అరిచాడు మహారాజు “తమరి ఆజ్ఞ మహారాజా” అంటూ గజ గజలాడుతూ వచ్చాడు, అంతరంగ రక్షకుడు అయిన భద్రుడు. “నా రాజ్యం లో, నా రాకుమారుడి కి భోజనం లో ఎండు చేప అందలేదు. మేము దీన్ని ఎంత మాత్రమూ సహింప జాలము. నా దృష్టిలో ఇది ఒక అత్యయిక ఘటన. వెంటనే మన సర్వ సైన్యాధ్యక్షుల వారైన రామానుజాన్నీ మూలకారణాన్ని శోధించి, నివారణోపాయాన్ని పంపమనండి” “చిత్తం మహారాజా” అంటూ అక్కడనుండి నిష్క్రమించి, సర్వ…

  • ఈ కథకి టైటిల్ పెట్టటం నా వల్ల కాదు!

    నా అమెరికా ప్రయాణం మరియు డెన్వర్ కి చేరటంలో పడ్డ అష్టకష్టాలు నేను ఇదివరకే మీకు నా అమెరికా యాత్రలో వివరించాను. నా డెన్వర్ కష్టాలు అంతటితో ఆగలేదు. నేను మరియు మన నాయుడుపేట వాసి అయిన బుడ్డ రాజేషు ఒక సంక్లిష్టమైన ప్రాజెక్ట్ ని చేపట్టాము. అదేమియనగా మా ఖాతాదారుని యొక్క ఖాతాదారుల వివరాలను ఒక పాత డేటాబేస్ నుండి కొత్త డేటా బేస్ కి వలస యొనర్చటం.

  • దేశం కానీ దేశంలో , బ్రతుకు చక్రమాగితే!

    నిజామాబాద్ కి చెందిన నర్సింలూ కన్నా, నా సహోద్యోగి సీటెల్ లో ఒకప్పుడు. మనిషి చాల చలాకీగా, ఆరోగ్యంగా మరియు క్రీడాకారుల కుండే దేహదారుఢ్యంతో వుండే వాడు. కమా వాళ్ళు ఆడే సరదా క్రికెట్ కి, నాయకుడు కూడా. తనకి ఇద్దరు పిల్లలు – ఒక అమ్మాయీ మరియు ఒక అబ్బాయి. వాళ్ళ అమ్మాయి మా చిన్నదానికన్నా వయస్సులో రెండు నెలలు చిన్న మరియు మా పెద్దదానికంటే పొడవులో రెండు అంగుళాలు మిన్న. మేము సహోద్యోగులము మరియు…

  • నా మొదటి ప్రవాస జీవనానుభవం!

    నా మొదటి ప్రవాస జీవితం దక్షిణాఫ్రికా లోని జోహనెస్బర్గ్ లో మొదలయ్యింది. ఆనాడు దక్షిణాఫ్రికా లో రెండు ప్రధాన బ్యాంకు సమూహాలుండెడివి, ఒకటి ఏ.బి.ఎస్.ఏ మరియు రెండవది నెడ్కోర్. నేను ఏ.బి.ఎస్.ఏ బ్యాంకు వాళ్ళ అసెట్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ లో పని చేసే వాడిని.

  • ట్రాఫిక్ తో ఆత్మ సాక్షాత్కారం!

    మొన్ననగా వెళ్లారు సుప్రియ మరియు పిల్లకాయలు, జూబిలీ హిల్స్ లో వాళ్ళ అక్క వాళ్ళింటికి. నేనెళ్ళి నసపెట్టి తీసుకురాక పోతే, వాళ్లకు నేనొకడ్ని వుండానని గుర్తుకే రాదు. టాకీ టౌన్ దగ్గర హైవే 65 మీదకి ఎక్కా, ట్రాఫిక్ స్మూత్ గానే ఉండడంతో కొంచెం స్పీడ్ పెంచా, అంతలోనే మియాపూర్ బస్సు స్టాండ్ దగ్గర, ఒక గుంపు రోడ్ ని అడ్డంగా దాటుతూ, అందులోనూ ఒకడు చెయ్యెత్తి మరీ, మీ వెహికల్స్ అన్నీ ఆపండెహె అన్నట్టు.

  • మా నెల్లూరోళ్ల కథలు కంచికి చేరవబ్బా!

    ఓడమ్మా భడవా ఐదు నిమిషాల్లో నెల్లూరుని కళ్ళకు కట్టినట్టు విన్పించావు కదరా సామి, అన్నారు మా నెల్లూరోళ్లు వాళ్ళ కథవిని. కొందరైతే నేను ఏమేమి కవర్ చేయలేదో వాటిల్ని అన్నిటిని రాసి పంపించారు, అబ్బయ్య అసలు నీవు ఈటిల్ని ఎట్టా మర్చిపోయినావు అని. సో బాహుబలి పార్ట్ 2 మాదిరి మన నెల్లూరోళ్లు పార్ట్ 2 తయారు చేశా.

  • ఆరుముగం దెబ్బ మా నెల్లూరు అంతా అబ్బా!

    నేను ఎనభైయ్యవ దశకంలో ఇంటర్మీడియట్ చదివే రోజుల్లో అనుకుంటా మా సంతపేటలోని తూకుమానుమిట్టలో రాత్రికి రాత్రే ఆరుముగం & కో అనే కుంపిణి అదిరిపోయే వ్యాపార ప్రణాళికతో వెలిసింది. “ఇందు మూలముగా అందరికి తెలియ చేయటమేమనగా మీరు గాని మా దగ్గరకు వచ్చి మా వస్తు పట్టికలో కనపడ్డ వస్తువును కనపడినట్టు ఆత్రముగా మూడవ వంతు ధర పెట్టి టిక్కు పెట్టుకుంటే మీకు ఆ వస్తువు రెండు నెలల్లో పువ్వుల్లో పెట్టి అప్పచెప్పబడును” అనే వాళ్ళ ప్రకటన…

  • ఇసుకే బంగారమాయెనా !

    మనకి రామాయణ మహాభారత కథలు చెబుతూ మన పెద్దలు కొన్ని పిట్ట కథలు చెప్పేవారు. ఈ పిట్ట కథలు చాలా వరకు గ్రంధస్తం అవ్వవు మరియు ఇవి చాలా వరకు ప్రాదేశికాలు (లోకలైజ్డ్ అని నా ఉద్దేశ్యం). మా తెలుగు అయ్యవారు చెప్పిన చాలా పిట్ట కథల్లో నాకు చాలా ఇష్టమైన కథ ఇది.

  • గొలుసుకట్టు కుబేరులు!

    అవి మేము కొలరాడో లోని, డెన్వర్ కి మరియు బౌల్డర్ కి మధ్యన కల లూయివిల్లీ అనే విరాట రాజ్యం లో నివసించే రోజులు. అక్కడ మేము గుర్తు పట్టగల లేక మమ్మల్ని గుర్తు పట్టగల తెలుగు కుటుంబాలు లేవు, తెలుగు దాకా ఏల అసలు భారతీయ కుటుంబాలే లేవు. మీ పవర్ స్టార్ రేంజ్ కాదు కానీ నేను అక్కడ ఒక అజ్ఞాత వాసిని. మా సహోద్యోగి మిత్ర కుటుంబాలన్నీ డెన్వర్ లో మేము లేకుండా,…

  • నాలో నేను! ఒక అవలోకనం!

    ఆ మధ్య ఒకసారి మా అనీల్గాడు నాతో సంభాషిస్తూ, రాసే కొద్దీ నీ కథలు మెరుగుపడుతున్నాయి. అలాగే నీ పాత్రలతో సహజీవనం చేస్తూ నువ్వు కూడా వ్యక్తిగా మెరుగు పడాలని ఆశిస్తున్నా అన్నాడు. ఇదే మాట మా సీనియర్ బాలాజీ కూడా అన్నాడు మా వాడంతా కరుగ్గా కాదు, కాస్త మెతగ్గా, ఈ కథలు నీ వ్యక్తిత్వాన్ని ఇంకాస్త మెరుగు పరుస్తాయని.

  • మనకీ మందులున్నాయబ్బా!

    చాలా పెద్ద కథని ఒక్క మాటలో చెప్పాలంటే నాకు గత ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా, ఆయుర్వేదము మరియు హోమియో వైద్యాలమీద నమ్మకం సడలింది. అదిగో మీకు వెంటనే కోపం వస్తుంది కదా! అయితే వినండి, నాకూ ఆయుధముంది, ఇది నా అభిప్రాయం మాత్రమే అని బుకాయించే ఆయుధము. సహజంగా నా అభిప్రాయాలు చివరకు తప్పని తేలుతుంటాయి, ఆ చివర ఎప్పుడు అని తెలుసుకోవాలంటే మీకు ఓపిక అనే గొప్ప గుణం ఉండాలి.

  • గడ్డు కాలంలో నాతో నేను!

    ఈ రోజు తీరిగ్గా కూర్చొని ఆలోచిస్తుంటే మా ఇంజనీరింగ్ అయ్యాక మాకు లభించిన ఒక సంవత్సరం ఖాళీ మనకు చాలా జీవుతానుభవాలనే నేర్పించి ఉంటుందని అనిపించింది. ఈ మధ్య ఒక సినిమాలో చూశా డిగ్రీ అయ్యి బయటకి రాగానే నెక్స్ట్ ఏంటి అని ప్రతీ వాడూ అడిగేవాడే అని కథానాయకుడు బాధగా పాడుకొనే పాటని. మేము బయటకు రావటం అందరిలా కూడా రాలేదు కదా, మీరు మర్చిపోయారా, పరీక్షలు ఎగ్గొట్టి ఒక్క సంవత్సరం కాజేసుకొని వచ్చిన బ్యాచ్…

  • ఈ కథకి టైటిల్ పెట్టటం నా వల్ల కాదు!

    నా అమెరికా ప్రయాణం మరియు డెన్వర్ కి చేరటంలో పడ్డ అష్టకష్టాలు నేను ఇదివరకే మీకు నా అమెరికా యాత్రలో వివరించాను. నా డెన్వర్ కష్టాలు అంతటితో ఆగలేదు. నేను మరియు మన నాయుడుపేట వాసి అయిన బుడ్డ రాజేషు ఒక సంక్లిష్టమైన ప్రాజెక్ట్ ని చేపట్టాము. అదేమియనగా మా ఖాతాదారుని యొక్క ఖాతాదారుల వివరాలను ఒక పాత డేటాబేస్ నుండి కొత్త డేటా బేస్ కి వలస యొనర్చటం. ఈ క్రమంలో మేమిద్దరం కలిసి ఒక…

  • దేశం కానీ దేశంలో , బ్రతుకు చక్రమాగితే!

    నిజామాబాద్ కి చెందిన నర్సింలూ కన్నా, నా సహోద్యోగి సీటెల్ లో ఒకప్పుడు. మనిషి చాల చలాకీగా, ఆరోగ్యంగా మరియు క్రీడాకారుల కుండే దేహదారుఢ్యంతో వుండే వాడు. కమా వాళ్ళు ఆడే సరదా క్రికెట్ కి, నాయకుడు కూడా. తనకి ఇద్దరు పిల్లలు – ఒక అమ్మాయీ మరియు ఒక అబ్బాయి. వాళ్ళ అమ్మాయి మా చిన్నదానికన్నా వయస్సులో రెండు నెలలు చిన్న మరియు మా పెద్దదానికంటే పొడవులో రెండు అంగుళాలు మిన్న. మేము సహోద్యోగులము మరియు…

  • ఈ కథ చదవాలంటే, ఓపిక అనే బతుకు కళ ఖచ్చితంగా కావాలి!

    నా సరికొత్త వాహనానికి నెంబర్ ప్లేట్ బిగించుకుందామని రవాణాశాఖ కార్యాలయానికి వెళ్ళా. అక్కడ నా వంతు రావడానికి సమయం పట్టింది కొంత. ఈ లోపల అక్కడ చిన్న చితకా పిల్లకాయలు గాలి పటాలు ఎగరేస్తుంటే వాళ్ళని గమనించటం మొదలెట్టా. వాళ్ళ కేరింతలు, వాళ్ళ ఆనందం వర్ణనాతీతం అది చరవాణుల్లో కదలక మెదలక ఆటలాడే మన పిల్లలకు బహుదూరం.

  • నా కథల వెనుక అసలు కథ !

    నా స్నేహితులు నన్నడిగారు, నీ కథలతో పడలేకున్నామురా, అసలు నువ్వెందుకు చెప్పాలనుకుంటున్నావు  అని. అసలే కథల కామరాజును కదా నేను, అందుకే నా కథల వెనక కథ ఇక్కడ చెప్తున్నా. నా  బాల్యం ఉన్నంతలో బాగానే జరిగింది, నేను బడికి వెళ్లే వరకు. నాకెందుకో మొదటి నుండి బడికి వెళ్ళటమంటే చెడ్డ చిరాకు. బడి ఎగ్గొట్టడానికి కడుపు నొప్పులు, ఎండలో ఎక్కువసేపు నిలబడి జ్వరాలు తెచ్చుకోవటాలు, ఆ జ్వరాలు నాకే కాదు మా అయ్యోర్లకు కూడా వచ్చేయని…

  • నా సహోద్యోగులు, హాస్యచతురులు !

    మనం వారంలో ఐదురోజులు మరియు రోజుకి కనీసం ఎనిమి గంటలు ఆఫీసుల్లో గడిపేస్తాం. మన కొలీగ్స్ లో హాస్యచతురత ఉంటే పని ఒత్తిడిని తట్టుకోవచ్చు. చతురత దండిగా వుండే ఒకానొక కొలీగ్ సామ్ ప్రదీప్. అప్పుడప్పుడు కలిసి భోజనానికి వెళ్తాము.

  • చిన్నప్పుడే చితికిపోయిన నా చిన్నమెదటి, భేతాళ ప్రశ్న

    పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్లి, ఎప్పటిలా చెట్టుపైనుంచి శవాన్ని దించి, భుజాన వేసుకొని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవ సాగాడు. అప్పుడు శవంలోని భేతాళుడు, “ఓ! రాజా ఇంత అర్థరాత్రివేళ, భీతిగొలిపే ఈ స్మశాన వాతావరణం లో, ఎదో సాధించాలన్న నీ పట్టుదల కారణంగా, నీవు చేస్తున్న ఈ పని నీకు అత్యంత సహజంగా కనపడుతున్నట్టు నా కనిపిస్తుంది. నాకెందుకలా అనిపిస్తుందో, ఉదాహరణగా నీకు అచ్చు నీలాటి పట్టుదల చూపిన భగీరథుని…

  • మా పంచింగ్ ఫలక్ నామ!

    నాకు రామ్ అని ఒక సహోద్యోగి ఉండేవారు చెన్నైలో. ఆయన సందర్భోచితంగా వేసే పంచ్ లు అంటే నాకు చాలా సరదా, కానీ ఎప్పుడు నా మీద ప్రయోగిస్తారేమో అని జాగ్రత్తతో ఉంటా. వాళ్ళ టీంలో ఒక నిష్ టెక్నాలజీల నైపుణ్యముండే పిల్లకాయలున్నారు. అదే నిపుణత వేరే కస్టమర్కి కూడా అవసరమయ్యింది.

  • మా నెల్లూరోళ్లు, ఎంతైనా ప్రత్యేకమబ్బా!

    మా నెల్లూరోళ్లు చాల ప్రత్యేకమబ్బా. ఓర్నీ పాసు గూలా, ఏందిరా! అబ్బయ్యా అంటూ భోళాగా పలకరిచ్చేస్తారు. ఆటో గాని రిక్షా అతను కానీ ఎక్కండి అనరు, బేరం కుదరగానే ఎక్కు అంటారు అలాగే ఎవర్నైనా నువ్వు అంటారే గాని మీరు అనరు. కొంచెం బయట ఊర్ల నుండి వచ్చినోళ్ళకి మా ఏకవచన సంబోధన కొంచెం కష్టమే.

  • ‘గ్యాపకాలు’ – హర్ష

    “భలే గట్టోడు రా మీ రాం మావ, అటెండన్స్ తక్కువయిందని ఎఫ్.ఏ ఆఖరి పరీక్షలకు కూర్చోనివ్వలా ఆయన్ని ! అప్పుడు సంవత్సరం పాటు తాత తో పాటే ఉండి, గొడ్ల పేడ ఎత్తడం నుంచి కోతల దాకా పనులన్నీ బ్రెమ్మాండంగా నేర్చుకొని, మళ్ళీ ఎఫ్.ఏ పరీక్షలు రాస్తా, ఏ.జీ.బీ.ఎస్.సి చదువుకుంటా అని తాతని ఒప్పిచ్చి, మళ్ళీ పరీక్షకు కూర్చొని పాస్ అయ్యాడు.లెక్కల గ్రూప్లో వాడు, ఏ.జీ.బి.ఎస్.సీ ఎట్టా చదవతావురా అని జనాలందరూ నవ్వితే, కాలేజీ వాళ్ళని ఒప్పించుకొని…