ఇష్టకథలు

మా అమ్మ తప్పిపోయింది, నా చిన్నప్పుడు!

అమ్మమ్మ వాళ్ళది దగదర్తి మండలం లోని ఉప్పలపాడు గ్రామం. నాన్నమ్మ వాళ్ళది కావలి దగ్గర్లోని ఉలవపాళ్ళ గ్రామం . మాకు మాతృస్వామ్యము ఇష్టం కాబట్టి అమ్మమ్మ నాన్నమ్మ అని మొదలెట్టా. ఇటు నుండి అటు వెళ్లాలన్న, అటు నుండి ఇటు వెళ్లాలన్న రాజు పాళెం లో దిగి బస్సులు మారాలి. నాకు ఈ పాళెం ఏందిరా బాబూ అని చిన్ననాటి నుండి డౌట్ కానీ అరవ దేశానికెళ్లాక అర్థమయ్యింది పాళ్యం రూపాంతరం అయ్యి పాళెం అయ్యిందని. ఎలా […]

స్కై ల్యాబ్, మా గడ్డివాములో పడింది!

నా చిన్నతనపు ఇంకో కథ. మేము ఎక్కువ మా అమ్మమ్మా వాళ్ళ ఊరిలోనే గడిపేశాం చిన్న తనమంతా. మా ఇల్లు పెద్ద స్థలం లో ఆస్బెస్టాస్ రేకులు కప్పిన ఒకే ఒక్క పెద్ద గది,  ముందు పంచ, పక్కన ఒక తాటి ఆకులు కప్పిన వంటగది. ఇంటికి కుడి పక్క పెద్ద బాదం చెట్టు వెనక ఒక ఉసిరిగి చెట్టు, ఎడమ పక్క పెద్ద స్థలం లో గడ్డి వాము, ఆ వాముకి ఆవల పెద్ద ఎరువు […]

నేను పగలకొట్టిన పిచ్చుకను నాకు ఇవ్వండి తెచ్చి!

నాకు నా చిన్నప్పటి రోజులు ఇప్పటికీ జ్ఞాపకమే. నాలుగేళ్లు వుంటాయనుకుంటా నాకు అప్పుడు. మా పెద్దమ్మతో నెల్లూరు వెళ్ళినప్పుడు, సతాయించి సతాయించి ఒక కారు బొమ్మ కొనిపిచ్చుకున్నా. కాస్త అదిమి పెట్టి వెనక్కి లాగితే స్ప్రింగ్ ముడుచుకొని, వదలగానే రయ్యిమంటూ ముందు కెళ్లే ఎర్ర కారు అది. కొన్ని రోజులైతే దానితోనే నా లోకం. ఉన్నట్టుండి ఒకసారి దాని ముందు చక్రం ఊడి పోయింది. సరి చేసి పెడితే కొంచెం దూరం వరకు చక్రం ఉండటం, తర్వాత […]

నాకు వున్నాయి, పొలమారిన జ్ఞాపకాలు!

మా అక్క కూతురి పెళ్లి గత నవంబరు నెలలో జరిగింది. ఆ పెళ్ళిలో నా చిన్ననాటి సహాధ్యాయిని నన్ను కలిసి, కిరణు !  నాకు నీ పిల్లల్ని చూపించు అని అడిగింది. నేను కాస్త దూరంలో  వున్న నా కూతుర్లని పిలిచి, నా సహాధ్యాయిన్ని పరిచయం చేస్తూ, తాను నా చిన్ననాటి స్నేహితురాలు అని చెప్పా. తాను వెంటనే, చిన్ననాటి కాదు, నేను మీ నాన్నకి పుట్టినప్పటి నుండి స్నేహితురాలిని అని నన్ను సరి చేసింది. ఆ […]

మా వూరి మైలురాయి కమ్యూనిస్టులు!

అనీల్ గాడు నాకు వున్నాయి, పొలమారింది జ్ఞాపకాలు కథ చదివి అది హర్ష గాడి కార్ల్ మార్క్స్ పోకడ కథ అని వ్యాఖ్యానించాడు. నేను కూడా మా ఊర్లలో వుండే కొన్ని కమ్యూనిస్ట్ గాధలని చెప్పాలని అప్పుడే అనుకున్న. ఎవరో ఒక పేరుమోసిన కమ్యూనిస్ట్ గారిని అడిగారట, మీరు పక్కా  కమ్యూనిస్ట్ లు కదా, మరి ఖరీదైన మధ్యంసేవిస్తారు, రెండవ వివాహంకూడా ఆడేశారు, కొంచెం విలాసవంతమైన జీవనం గడుపుతారు, ఇది ఏవిధమైన కమ్యూనిజం అని. దానికి ఆయన […]

లక్ష్మి, లేకపోవటం చాలా చేదు నిజం!

నాన్న వాళ్ళది ఉలవపాళ్ళ. నేషనల్ హైవే లో నెల్లూరు నుండి కావలికి వెళ్తుంటే సున్నబ్బట్టి , అల్లూరు గేట్ దాటిన తర్వాత హైవే నుండి ఒక కిలో మీటర్ లోపలి కెళ్ళాలి. ఒకప్పుడు బిట్రగుంట లోకో ఇంజిన్ మైంటెనెన్సు కి ఫేమస్. ఆ చుట్టు పక్కల ఊర్లలో సగం మంది రైల్వే ఎంప్లాయిస్. డ్రైవర్స్, ఫిట్టర్స్, గ్యాంగ్ మెన్ ఎవరి అర్హతల్ని బట్టి వారు ఆ చుట్టుపక్కల గ్రామాలనుండి బాగా సర్వీసెస్ లో వుండే వారు. మా […]

ఆఫీసు పని ఇంట్లో చేస్తున్నారంటే!

మిస్ వైజ్ మా పెద్ద పాప అమృత క్లాస్ టీచర్, సీటెల్ లో వున్నప్పుడు. పేరెంట్స్ టీచర్ మీటింగ్ లో కలిసాము ఆవిడని, అకడమిక్ ఇయర్ మొదటలో . “నేను కావాలనే ఒక క్లాస్ పీరియడ్ కి, ఇంకో పీరియడ్ కి మధ్యలో పదిహేను నుండి ఇరవై నిముషాలు గ్యాప్ ఇచ్చాను. స్టూడెంట్స్ ఆ గ్యాప్ లో నేను ఇచ్చిన వర్క్ చేసుకోవచ్చు లేక పోతే వాళ్ళు వేరే ఆక్టివిటీస్ చేసుకోవచ్చు. నేను వాళ్ళను కంపెల్ చెయ్యను. […]

ఆవూ, దూడా చేలోనే మేస్తున్నాయి, మాలాగా !

చెన్నై లో నివసించే వాళ్ళము మేము 2009 వ సంవత్సరములో. పిల్లలిద్దరూ వెళ్ళాచ్చేరీ లోని నవదిశ మాంటిస్సోరి స్కూల్ లో ఏడూ మరియు ఐదవ తరగతుల్లో చేరారు. ఆరు నెలలు గడిచాకా మా చిన్నది వాళ్ళ తరగతిలో రెండు సమూహాలు ఉన్నాయనీ, ఆ రెండు సమూహాలకి  ఎప్పుడూ పడదని, ఒకరు ఎడ్డెము అంటే ఇంకొకరు  తెడ్డెమని చెప్పటం మొదలెట్టింది. కొన్ని రోజుల తర్వాత యీ రెండు సమూహాల మధ్య తనే సమన్వయ కర్తనని, ఆ మరి కొన్ని […]

అమ్మలందరు అంతే ! మా అమ్మ కూడా !

ఒరే హర్షాగా!  “మీ అమ్మకి నేను ఇక ఏమీ చెప్పానురా”, అంటూ కణ కణ లాడి పోయాడు మా నారాయణ రెడ్డి వాళ్ళ షడ్డకుడి కొడుకు రిసెప్షన్ అయ్యాక. ఎదో అయ్యింది ఆ రిసెప్షన్ కి మా అమ్మ అటెండ్ అయ్యాక అని నవ్వుకున్నా. మంచి నీళ్ల గ్లాస్ ఇచ్చి, “చెప్పరా ఏమయ్యిందో అన్నా”, వినటానికి సిద్దపడుతూ. పెళ్లి కార్డు ఇవ్వడానికి వచ్చినప్పుడు మీ అమ్మ అడిగార్రా, అమ్మాయి ఏమి చదివింది, ఎలా ఉంటుంది అని. “పర్వాలేదమ్మా […]

మా లక్ష్మీ పెద్దమ్మ పెద్ద అదృష్టవంతురాలు!

మా అమ్మమ్మకి వాళ్ళ నాన్నగారు తన చెల్లెలి కొడుకు తో పెళ్లి నిశ్చయించాడు. ఆ వరుడు తనకన్నా వయస్సులో చాలా పెద్దవాడు అవటం తో, ఛీ ! నాకు వద్దు అని తన ఈడు వాడైనా మా తాతని వివాహమాడేసింది. ఆ రోజుల్లో నాయన మాట ఎదిరించి వివాహం చేసుకోవటం మహా సంచలనం. వాళ్ళ నాన్న గారు తన మాట ఎక్కడ పోతుందో అని, మరీ చిన్నపిల్ల, లక్క పిడతలతో ఆడుకుంటున్న మా అమ్మమ్మ చెల్లెల్ని తీసుకెళ్లి […]

నా మొదటి అమెరికా యాత్ర, అచ్చు ఆచారికి మల్లె!

ఆచారి! అమెరికా యాత్రలా, నా మొదటి అమెరికా యాత్ర గురుంచి, తప్పకుండా రాయాలి. నేను, సుప్రియ, ఇద్దరు పిల్లలతో క్రీస్తు శకం 2000, మార్చ్ 31 వ తేదీ ముంబై నుండి కొలరాడో లోని డెన్వర్ కి బయలుదేరాము. అమ్రుకి రెండు నిండి మూడేళ్లు, ఆముకి మూడు నెలలు. ఇంతకు ముందు దక్షిణాఫ్రికాలో మూడేళ్లు ఉండటంతో ఈ ప్రయాణాన్ని చాలా ఆత్మవిశ్వాసం తో మొదలుపెట్టాము, మాకేంటి అనే ధీమా తో. జె .ఎఫ్ .కే లో మార్చ్ […]

నేనూ, నా మైనర్ సర్జరీ!

ఈ రోజు మా పదో తరగతి సహాధ్యాయని వాళ్ళ అమ్మాయి పెళ్ళికి స్నేహితువులమందరిమి హాజరయ్యాము. అలా వచ్చిన వారిలో, ఒక స్నేహితుడు రియాజ్ బాషా. తనకి ఆక్సిడెంట్ అయితే హాస్పిటల్ లో అడ్మిట్ అయ్యాడు కొంత కాలం క్రిందట. హాస్పిటల్ అంతా తనని చూడడానికి వచ్చిన జనాలతో నిండిపోతే ఆ డాక్టర్ కి తాను ఒక సమరసింహారెడ్డి ని అనే బిల్డ్ అప్ ఇద్దామనుకున్నాను అని చెప్పటంతో నాకు కూడా నా గతకాలపు ఘటన వలయాలు వలయాలు […]

నేను, నా ఉషాయణం!

ఈ మధ్య ఒక కథ చదివా, అది అచ్చు నా కథే, నా కథే కాదు మీ అందరి కథే. ఆ కథ ప్రేరణతోనే ఈ కథ చెబుతున్నా. నేను మరియు ఉషా, ఒకటో తరగతి నుండి ఏడో తరగతి వరకూ క్లాస్ మేట్స్. బాగా తెల్లగా, చలాగ్గా అచ్చు మన హీరోయిన్ జయప్రదకు నకలుగా ఉంటుంది ఉష. స్కూల్ మరియు ట్యూషన్ లో పక్క పక్కనే కూర్చోవాల్సిందే. హోమ్ వర్క్ సబ్మిట్ చేసినా ఆ పిల్ల […]

నా శాసనోల్లంఘనల పర్వం!

వేంకటాద్రి ఎక్స్ప్రెస్ సినిమాలో, కథానాయకుని తండ్రి, ఒక కుటుంబ రాజ్యాంగం రాసిపడేసి, ఆ రాజ్యాంగాన్ని ఉల్లంఘించిన వారి ఉల్లంఘనలను లెక్కపెడుతుంటాడు. ఇక్కడ కథానాయకుడు అనగానే నీకా లక్షణాలు లేవు అంటారని తెలుసు నాకు, ఇక్కడ కర్త కథానాయకుడు కాదు, కథానాయకుని తండ్రి. అలాగే మా నాన్నగారు (ఇక మీదట ప్రతీ దగ్గర నాన్న అనే వ్రాస్తానని మనవి, నా దగ్గర గారు గారు అని పలుమార్లు వస్తే మీరే అనగలరు, అతి వినయం దూర్తలక్షణమని) రాసిన రాజ్యాంగాన్ని […]

అందగాడు, ధవళవర్ణము వాడు, మా పెద్దనాన్న!

మా అమ్మకి పెద్ద అక్క నాకు వరసకు పెద్దమ్మని మా ఉప్పలపాడు ప్రక్క గ్రామమైన రామలింగాపురంలో ఇచ్చాము. పెదనాన్నగారు వ్యవసాయదారుడు, మహా అందగాడు. ఆయన, ఎవరక్కడా! అని గంభీర స్వరంతో పిలిస్తే మా పెద్దమ్మ, గజ గజ వణుకుతూ ఎక్కడివక్కడ వదిలేసి పరిగెత్తడం నేను చాలా సార్లు చూసా. ఆలా వణుకుతూనే నాకు ఇద్దరన్నల్ని, ఇద్దరు అక్కల్ని ఇచ్చేసిందావిడ. నేను నాలుగవ తరగతి వరకూ మా ఉప్పలపాటి ప్రాధమిక పాఠశాలలోను, ఆరు ఏడు తరగతులు పెదపుత్తేడు లోని […]

బుడ్డ వెంకన్న, మళ్ళీ పుట్టాడు!

బుడ్డ వెంకన్న పచ్చని మేని ఛాయతో, గిరజాల జుత్తుతో, ఆరడుగులకన్నా ఎక్కువ ఎత్తు వున్న భావం అధికమైన వాడై,  కొంచెం వొంగినట్టుండి,  ఉప్పలపాటి చుట్టూ పక్కల వూర్లకన్నిటికీ అందగాడు. ముగ్గురు సోదరీమణులు, ఒక సోదరుడు కలిగిన వాడు. పల్లెల్లో వ్యవసాయదారుల ఇళ్లల్లో కొందరే చదువుకోగలుగుతారు, కొందరు వయవసాయప్పనులు ఒంట బట్టించుకుంటారు, మరి కొందరు, యీ రెండూ చేయరు. ఈ బుడ్డ వెంకన్న మూడవ కోవకి చెందిన వాడు. ఊరందరికీ బుడ్డ వెంకన్న అంత మంచి వాడులేడు, చేయని […]

నేను, నా మనవడూ!

మా పెద్దమ్మ కూతురి మనవడు అభిరాం. వాడి వయస్సప్పుడు మూడేళ్లు. కొన్నాళ్ళు నేను ప్రాజెక్ట్ పని మీద చెన్నైలో వాళ్ళింట్లో ఉండాల్సి వచ్చింది. వాళ్ళదొక డూప్లెక్స్ బాడుగిల్లు. పైన నాకొక బాత్ రూమ్ కూడా కలిసి వుండే పెద్ద రూమ్ ఇచ్చేసారు వాళ్ళు. వాడు ఉదయాన్నే తాతా! కాఫీ తాగుతావా అంటూ వచ్చేసేవాడు. అప్పటి నుండి నేను ఆఫీసుకు వెళ్లే వరకూ నేను వాడితోనే ఆటలు. ఒక రోజు నేను కాఫీ తాగుతుంటే వచ్చి నా బుగ్గ […]

మా నెల్లూరోళ్లు, ఎంతైనా ప్రత్యేకమబ్బా!

మా నెల్లూరోళ్లు చాల ప్రత్యేకమబ్బా. ఓర్నీ పాసు గూలా, ఏందిరా! అబ్బయ్యా అంటూ భోళాగా పలకరిచ్చేస్తారు. ఆటో గాని రిక్షా అతను కానీ ఎక్కండి అనరు, బేరం కుదరగానే ఎక్కు అంటారు అలాగే ఎవర్నైనా నువ్వు అంటారే గాని మీరు అనరు. కొంచెం బయట ఊర్ల నుండి వచ్చినోళ్ళకి మా ఏకవచన సంబోధన కొంచెం కష్టమే. మా వాళ్ళకి నచ్చేది సినిమాలు, భోజనాలు మరియు పాలిటిక్స్. ఒకప్పుడు మాకు అదిరే హాల్స్ ఉండేవి. మూడు హాళ్లు, నర్తకి, […]

అతిధి దర్శనాలు

అధ్యాయాలు

హర్షణీయం సభ్యత్వం కొరకు మీ ఈమెయిల్.

ధన్యవాదములు

హర్షణీయం

FREE
VIEW