-
ఆచార్య కొలకలూరి ఇనాక్ గారితో ‘హర్షణీయం’ ఇంటర్వ్యూ !
తెలుగు సాహిత్యంలో వున్న అన్ని సాహితీ ప్రక్రియలలో విశేష కృషి సలిపిన ఆచార్య కొలకలూరి ఇనాక్, గత ఆరు దశాబ్దాలు గా తెలుగు భాషని తన రచనలతో సుసంపన్నం చేస్తున్నారు. ఆయన సాహితీసేవకు గుర్తింపునిస్తూ, జ్ఞానపీఠ్ సంస్థ, ప్రతిష్టాత్మకమైన ‘మూర్తిదేవి’ అవార్డుతో, కేంద్రప్రభుత్వం వారు ‘పద్మశ్రీ’ పురస్కారం తో ఆయనను సత్కరించడం జరిగింది. రెండు వారాల క్రితం ‘హర్షణీయం’ ఇనాక్ గారితో ఆయన రచనలు, జీవితాన్ని గురించి సంభాషించే అవకాశం కలిగింది. ఈ ఎపిసోడ్ లో ఆ ఇంటర్వ్యూ…
-
‘ఇల్లు’!
ఎండాకాలం ఒంటి నిట్టాడి ఇంటిపట్టున రెండు నిట్టాళ్ళ ఇల్లు వేయాలని మా అమ్మా నాయన నిర్ణయించుకొన్నారు. మా చిన్న ఇల్లు పీకి పెద్ద ఇల్లు వేస్తామని పల్లె అంతా టాంటాం వేశాను. ఒంటి నిట్టాడి ఇంటికి మధ్యలో నిట్టాడి ఉంటుంది. రెండు నిట్ఠాళ్ళ ఇంటికి రెండు నిట్టాళ్ళు గోడల మీద ఉంటాయి. ఆ రెండు దూలాల మీద ఇల్లు నిలబడుతుంది. చిన్న ఇల్లు, దాని తడిక గోడలు, పీకి చిన్నపాక ఆగ్నేయం మూలకు వేసి, ఇంట్లోని సామాను…