• ఈ కథ చదవాలంటే, ఓపిక అనే బతుకు కళ ఖచ్చితంగా కావాలి!

    నా సరికొత్త వాహనానికి నెంబర్ ప్లేట్ బిగించుకుందామని రవాణాశాఖ కార్యాలయానికి వెళ్ళా. అక్కడ నా వంతు రావడానికి సమయం పట్టింది కొంత. ఈ లోపల అక్కడ చిన్న చితకా పిల్లకాయలు గాలి పటాలు ఎగరేస్తుంటే వాళ్ళని గమనించటం మొదలెట్టా. వాళ్ళ కేరింతలు, వాళ్ళ ఆనందం వర్ణనాతీతం అది చరవాణుల్లో కదలక మెదలక ఆటలాడే మన పిల్లలకు బహుదూరం.