-
నా కథల వెనుక అసలు కథ !
నా స్నేహితులు నన్నడిగారు, నీ కథలతో పడలేకున్నామురా, అసలు నువ్వెందుకు చెప్పాలనుకుంటున్నావు అని. అసలే కథల కామరాజును కదా నేను, అందుకే నా కథల వెనక కథ ఇక్కడ చెప్తున్నా. నా బాల్యం ఉన్నంతలో బాగానే జరిగింది, నేను బడికి వెళ్లే వరకు. నాకెందుకో మొదటి నుండి బడికి వెళ్ళటమంటే చెడ్డ చిరాకు. బడి ఎగ్గొట్టడానికి కడుపు నొప్పులు, ఎండలో ఎక్కువసేపు నిలబడి జ్వరాలు తెచ్చుకోవటాలు, ఆ జ్వరాలు నాకే కాదు మా అయ్యోర్లకు కూడా వచ్చేయని…