Apple PodcastsSpotifyGoogle Podcasts

  • ‘పది రోజులు’ – ఐదుకాళ్ళ మనిషి పుస్తకం నుంచి
    ‘పది రోజులు’ – ఐదుకాళ్ళ మనిషి పుస్తకం నుంచి

    ‘పది రోజులు’ అనే ఈ కథకు మూలం ‘పట్టు నాట్కళ్’ అని   శ్రీ అప్పాదురై ముత్తులింగం రచించినది. తమిళంలో ఈయన రాసిన కథలను, అతి చక్కగా తెలుగులోకి అనువదించారు శ్రీ అవినేని భాస్కర్ గారు. ఛాయా ప్రచురించిన ఈ పుస్తకం పేరు ‘ఐదు కాళ్ళ మనిషి’. శ్రీలంకలో జన్మించిన శ్రీ ముత్తులింగం శ్రీ లంక లో ఛార్టర్డ్ అకౌంటెన్సీ లో , ఇంగ్లాండ్ లో మానేజ్మెంట్ అకౌంటెన్సీ లో పట్టా పుచ్చుకున్నారు. శ్రీలంక పాకిస్తాన్ లతో…

  • శ్రీ కే ఎన్ వై పతంజలి గారి ‘మోటుమనిషి’
    శ్రీ కే ఎన్ వై పతంజలి గారి ‘మోటుమనిషి’

    “సామాజిక పరిణామాల్లో మంచికో చెడ్డకో బాధ్యులు కానివారెవ్వరూ ఉండరు. నా చుట్టూ ఉన్న సమాజం ఇంత దుర్మార్గంగా ఉండడానికి కచ్చితంగా నా బాధ్యత ఎంతో కొంత ఉండి తీరుతుంది. అది మార్చడానికి ఎంతో కొంత నా భాగస్వామ్యముంటుంది. ఆ బాధ్యతల నుంచి ఎవ్వరూ తప్పించుకోలేరు” – సుప్రసిద్ధ రచయిత కీర్తిశేషులు కె ఎన్ వై పతంజలి . హర్షణీయానికి స్వాగతం. ఇప్పుడు పరిచయం చేయబోతున్న కథ పేరు ‘మోటుమనిషి’. ఈ కథను హర్షణీయం ద్వారా పరిచయం చేయడానికి…