Apple PodcastsSpotifyGoogle Podcasts

 • ఆచార్య పుల్లెల శ్రీరామచంద్రుడు గారి గురించి ఉప్పులూరి కామేశ్వర రావు గారు
  ఆచార్య పుల్లెల శ్రీరామచంద్రుడు గారి గురించి ఉప్పులూరి కామేశ్వర రావు గారు

  మహామహోపాధ్యాయ ఆచార్య పుల్లెల శ్రీరామచంద్రుడు ఆంధ్రీకరించిన వాల్మీకి రామాయణానికి తెలుగులో ప్రత్యేకమైన స్థానం వుంది. రామాయణంపై తెలుగులో వచ్చిన గ్రంథాలలో శ్రీరామచంద్రుడు గారు చేసిన అనువాదం  ప్రామాణికంగా చెప్పబడుతుంది. సంస్కృతం, తెలుగు , హిందీ లలో విశేషమైన ప్రతిభ  కలిగిన శ్రీరామచంద్రుడు 1966 లో సంస్కృతంలో పీహెచ్డీ పట్టా పొందారు. తెలుగు, ఆంగ్ల, సంస్కృత భాషల్లో రెండువందల పైగా రచనలు చేశారు. 2011 లో పద్మశ్రీ అవార్డును స్వీకరించారు. ఈ ఎపిసోడ్ లో ఆయనతో ప్రత్యేకమైన సాన్నిహిత్యం కలిగిన…

 • ‘సత్యలింగం’ – పతంజలి శాస్త్రి గారి రచన (గుప్తా’91 సంపుటం నించి)
  ‘సత్యలింగం’ – పతంజలి శాస్త్రి గారి రచన (గుప్తా’91 సంపుటం నించి)

  సత్యలింగం’ పతంజలి శాస్త్రి గారు రాసిన ‘గుప్తా’91’ సంపుటం లోనిది. పుస్తకం కొనడానికి కింద ఇచ్చిన లింక్ వాడొచ్చు. గత సంవత్సరం చదివిన నేను చదివిన కథల్లో నిస్సందేహంగా  సత్యలింగం అత్యుత్తమైన కథ. కథలోకెడితే ‘టీటీ’ అని పిలవబడే రైల్వే టికెట్ కలెక్టర్ కాంతారావు స్నేహితుడు స్వామి. తన ఇంట్లో అద్దెకుండే  కూర్మయ్య నాయుడి గురించి స్వామికి చెప్పుకుంటూ ఉంటాడు కాంతారావు. నాయుడు విపరీతమైన కోపిష్టి. ఒళ్ళూపైతెలీని కోపంతో ఇబ్బందుల్లో ఇరుక్కుంటూ ఉంటాడు. తన జీవితంలో ప్రశాంతత…

 • కవి , అనువాదకులు శ్రీ ముకుంద రామారావు గారితో సంభాషణ
  కవి , అనువాదకులు శ్రీ ముకుంద రామారావు గారితో సంభాషణ

  అదే గాలి, అదే ఆకాశం, అదే నేల, అదే కాంతి, అదే నీరు …… కవిత్వాన్ని పాంచభౌతిక పదార్థంగా నిర్వచించి దేశ విదేశాల కవిత్వాన్ని స్వయంగా అనుభవించి పదిమందీ ఆస్వాదించడానికి అనువదించి అందిస్తున్న ముకుంద రామారావు స్వయంగా కవి. అనువాద రంగంలో ఆయన కృషి అనితర సాధ్యం. ‘శతాబ్దాల సూఫీ కవిత్వం’ ద్వారా సూఫీ తత్త్వ సారాన్ని కాచి తెలుగులోకి వడగట్టి పోశారు. నోబెల్ బహుమతి పొందిన కవుల కవిత్వ జీవిత విశేషాల్ని క్రోడీకరిస్తూ వారి విశిష్ట…

 • అనిల్ అట్లూరి గారితో సంభాషణ
  అనిల్ అట్లూరి గారితో సంభాషణ

  ఈ ఎపిసోడ్ లో రచయిత, అనువాదకులు, కాలమిస్ట్ అనిల్ అట్లూరి గారు తన సాహితీ జీవితం గురించి, పుస్తక ప్రచురణ రంగంలో వస్తున్న అనేక మార్పుల గురించి విస్తారంగా హర్షణీయంతో మాట్లాడారు. అనిల్ అట్లూరి గారి తండ్రి ప్రముఖ సినీ రచయిత, కథా రచయిత అట్లూరి పిచ్చేశ్వర రావు గారు. తల్లి చౌదరాణి గారు స్థాపించిన ‘రాణి బుక్ సెంటర్’ ద్వారా అనిల్ అట్లూరి తెలుగు పుస్తకాలను అనేక దశాబ్దాలు మద్రాసులోని పుస్తక ప్రేమికులకు అందించారు. అనిల్…

 • ‘రోహిణి’ – పతంజలి శాస్త్రి గారి కథ, కథా పరిచయం
  ‘రోహిణి’ – పతంజలి శాస్త్రి గారి కథ, కథా పరిచయం

  రోహిణి’ పతంజలి శాస్త్రి గారి ‘రామేశ్వరం కాకులు’ అనే కథాసంకలనం లోనిది. • ఈ కథపై చక్కని సూచనలివ్వడమే కాక, ఆడియోని మీకందించడానికి సహకరించిన మిత్రులు ఛాయా మోహన్ గారికి కృతజ్ఞతలు. **’రామేశ్వరం కాకులు పుస్తకం’ అమెజాన్ లో దొరుకుతోంది. – http://amzn.to/3bFv5W2. కథనం: చరిత్ర లోని ఒక కథను Allegorical గా తీసుకొని, సమకాలీన సమస్యను ఎత్తిచూపుతూ, ఒక పరిష్కార మార్గాన్ని సూచనగా చెప్పడం, ఈ కథలో ముఖ్య ప్రక్రియ. ఈ ప్రక్రియ తో తెలుగు…

 • ఆచార్య కొలకలూరి ఇనాక్ గారితో ‘హర్షణీయం’ ఇంటర్వ్యూ !
  ఆచార్య కొలకలూరి ఇనాక్ గారితో ‘హర్షణీయం’ ఇంటర్వ్యూ !

  తెలుగు సాహిత్యంలో వున్న అన్ని సాహితీ ప్రక్రియలలో విశేష కృషి సలిపిన ఆచార్య కొలకలూరి ఇనాక్, గత ఆరు దశాబ్దాలు గా తెలుగు భాషని తన రచనలతో సుసంపన్నం చేస్తున్నారు.  ఆయన సాహితీసేవకు గుర్తింపునిస్తూ, జ్ఞానపీఠ్ సంస్థ, ప్రతిష్టాత్మకమైన ‘మూర్తిదేవి’ అవార్డుతో, కేంద్రప్రభుత్వం వారు ‘పద్మశ్రీ’ పురస్కారం తో ఆయనను సత్కరించడం జరిగింది.  రెండు వారాల క్రితం ‘హర్షణీయం’ ఇనాక్ గారితో ఆయన రచనలు, జీవితాన్ని గురించి సంభాషించే అవకాశం కలిగింది. ఈ ఎపిసోడ్ లో ఆ ఇంటర్వ్యూ…

 • తిలక్ గారి ‘దేవుణ్ణి చూసిన మనిషి’
  తిలక్ గారి ‘దేవుణ్ణి చూసిన మనిషి’

  తెలుగు వచనా కవిత్వాన్ని తన అద్భుతమైన ప్రతిభతో ఉన్నత శిఖరాలకు తీసుకువెళ్లిన కవి, శ్రీ దేవరకొండ బాలగంగాధర తిలక్. అతి చిన్న వయసులో , యాభై సంవత్సరాలు కూడా నిండకుండా అయన మరణించడం తెలుగు వారి దురదృష్టం. తిలక్ గారి మరణానంతరం 1968లో ముద్రణ పొందిన తిలక్ కవితల సంపుటి ‘ అమృతం కురిసిన రాత్రి ‘ ఉత్తమ కవితాసంపుటిగా కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు 1971 లో పొందింది. ఇదిగాక ఆయన కొన్ని అద్భుతమైన కథలను రచించారు. ఇప్పుడు వినబోయే కథ ‘దేవుణ్ణి…

 • ‘సత్యం’ – శ్రీ చంద్ర కన్నెగంటి
  ‘సత్యం’ – శ్రీ చంద్ర కన్నెగంటి

  హర్షణీయానికి స్వాగతం. ఈ ఎపిసోడ్ లోని కథ ‘సత్యం’ శ్రీ చంద్ర కన్నెగంటి గారి రచన. ఇది వారి ‘మూడో ముద్రణ’ అనే కథా సంకలనం లోనిది. ఈ పుస్తకం కొనేటందుకు కావలసిన వివరాలు ఇదే వెబ్ పేజీ లో ఇవ్వడం జరిగింది. గుంటూరు జిల్లాలో జన్మించిన శ్రీ చంద్ర కన్నెగంటి, ప్రస్తుతం సాఫ్ట్ వేర్ రంగ నిపుణులుగా యూఎస్ ఏ లో పని చేస్తున్నారు. తానా పత్రికకు సంపాదకులుగా కూడా వారు ఇంతకు మునుపు ,…