😃 హర్షణీయం 😃

అందరికీ

హర్షణీయం గురించి!

నా పేరు హర్షవర్ధన్ . నా బాల్యం నుంచి, అమ్మమ్మలు, నాన్నమ్మలు, తాతయ్యలు, పెద్దమ్మలు, పెద్దనాన్నలు, చిన్నాన్నలు, చిన్నమ్మలు, అన్నలు, అక్కలు మరియు స్నేహితులతో జరిగిన చాలా ఘటనలు నాకు జ్ఞాపకమే, వాళ్ళతో పాటూ, నా చుట్టూ పక్కల వున్నవారితో , సహోద్యోగులతో  వున్న అనుబంధాలు, అనుభవాల సమాహారమే ఈ ‘హర్షణీయం‘.

ఈ కథలూ, వాటిలో పాత్రలూ, నా జీవితంలోనించే, సంగ్రహించి, సృష్టించుకున్నాను. అక్కడక్కడా పేర్లు మాత్రమే మార్చబడ్డాయి గోప్యత కోసం.

నా కథలు మొదటి నుండి ‘వాట్సాప్’ ద్వారా చదివి తిట్లు ఎక్కువ, పొగడ్తలు తక్కువ రూపేణా వెలిబుచ్చిన మా స్నేహ బృందం, అసలు నిన్ను ఊరంతా తిట్టాలిరా, అందుకే నువ్వు నీ కథలను బ్లాగ్ రూపేణా తేవాలి, అని దురుద్దేశపూరిత సలహా ఇచ్చి నన్ను చెడకొట్టారు. వీరితో పాటూ నా సహోద్యోగులూ, నేను నా కథలతో వాళ్ళను హింసించినా, మొహమాటానికైనా నీ కథలు కొన్నైనా బాగున్నాయని చెప్పి నా మనస్సుని రంజింపచేశారు. వీళ్ళందరికీ నా కృతజ్ఞతలు.

హర్షణీయం లో కథలన్నీ ప్రచురించిన క్రమంలో ‘అన్నీ కథలు’ అన్న పుటలో ఆడియో సహితం గా సమీకరించి బడ్డాయి. సమయాభావం వలన కథలు చదవలేని వారికొరకు అన్నీ కథలకు సంబంధించిన ఆడియో లు ‘ హర్షారావం ‘ అన్న మాపుటలో చేర్చ బడ్డాయి.

కథలన్నీ ఇష్టపడి రాసినా కొన్ని కథలే అందరికీ నచ్చుతాయి. ఆలా అందరికీ నచ్చిన ఆ కొన్ని కథలను ‘ఇష్టకథలు’ కింద ప్రచురించాము. మొదటి సారి హర్షణీయం కి విచ్చేసిన పాఠకులు ఈ పుట , హర్షణీయం గురించి ఒక ఫీల్ గుడ్ ఫాక్టర్ ఇస్తుందని మా ఆశ.

ఈ సందర్భంగా, ‘హర్షణీయం’ కథల్ని ఓపిగ్గా తమ ముందేసుకుని, మార్పులూ , చేర్పులతో, తూర్పార బట్టే మా ఎడిటోరియల్ బృందానికి, కథల్ని ఆడియో రూపం లో తెమ్మని, సలహా పారేసిన నా స్నేహితుడు గిరి గాడికి అభివాదాలు.

వెబ్సైటు చక్కగా డిజైన్ చేసి ఇచ్చిన మిత్రుడు హర్ష దేవులపల్లి కి, లోగో ని ఆకర్షణీయంగా డిజైన్ చేసి ఇచ్చిన ఇంకో మిత్రుడు నరేష్ కి కృతజ్ఞతలు.

హర్షాతిధ్యం:

హర్షణీయం‘ లో ఇంకో శీర్షిక ‘హర్షాతిధ్యం‘ . దీని ద్వారా మేము తెలుగు బ్లాగ్ ప్రపంచం లోని ‘రచయితలని’ , అలాగే ‘కథా నీరాజనం’ అనే శీర్షిక ద్వారా తెలుగు కథా ప్రపంచంలోని గొప్ప రచయితలని, వారి వారి రచనల ద్వారా, మీకు పరిచయం చేయాలనే , ప్రయత్నం చేస్తున్నాము.

హర్షాతిధ్యం, కథల ఎంపిక లో ఎన్నో విలువైన సూచనలిస్తున్న, సోదరులు, నవోదయ పబ్లికేషన్స్ రధసారధులు , సాంబశివరావు గారికి , కోటేశ్వరరావు గారికి కృతజ్ఞతలు.

అందుబాటులోలేని కొన్ని కథా సంకలనాల, కథల కాపీలను , హర్షణీయంకు అందిస్తున్న అనిల్ బత్తుల గారికి, పల్లవి వెంకట నారాయణ గారికి , లోగిలి మణికంఠ గారికి, కథానిలయం సుబ్బారావు గారికి కృతజ్ఞతలు.

చేరిక:

ఇదిగాక ‘హర్షణీయం’ మొదలు పెట్టినప్పట్నుంచీ, ఈ కథలు చదివి పెట్టి , ప్రోత్సాహిస్తున్న మీ అందరికీ, నా వేవేల నమస్సుమాంజలులు. మీ సూచనలతో మేము ‘హర్షణీయం’ లో క్రమేణా కొన్ని మార్పులు చెయ్యడం జరిగింది.

ప్రతి కథ క్రింద, మీ వ్యాఖ్యానానికి అనువుగా చోటు కల్పించడం జరిగింది. అలాగే, బ్లాగ్ గురించి మీ అభిప్రాయం , తెలియజెయ్యడానికి, ‘మీ అభిప్రాయం‘ అని వేరే పేజీ కేటాయించడం జరిగింది.

మీరు మీ ‘హర్షణీయం’ సభ్యత్వం నమోదు చేసుకోడానికి, సైడ్ బార్ మెనూ లో, ప్రతి పోస్ట్ కింద చోటు కల్పించడం జరిగింది.

హర్షణీయం ’ ని మీరిప్పుడు ‘ఆపిల్ ఐట్యూన్స్‘ ద్వారా , ‘స్పాటిఫై‘ ద్వారా వినవచ్చు.

అలాగే ‘ఫేస్ బుక్ ‘ , ట్విట్టర్’ లేదా ‘ఇంస్టాగ్రామ్‘ ద్వారా అనుసరించవచ్చు.

మమ్మల్ని మెయిలు ద్వారా సంప్రదించ తలచుకుంటే, మీరు ‘ harshaneeyam@gmail.com ‘ ద్వారా సంప్రదించవచ్చు.

చివరిగా , ‘హర్షణీయం‘ చక్కటి ‘తెలుగు చిట్టి కథల’ కి అత్యున్నత వేదిక కావాలని, మా హర్షణీయం జట్టు సభ్యులందరి ఆకాంక్ష.

మేము మా ఆకాంక్ష నెరవేర్చుకునే దిశలో ప్రయాణం చెయ్యడానికి, మీరు హర్షణీయాన్ని , క్రమం తప్పకుండా చదివి, విని, మీ తెలుగు కథా సదభిమాన స్నేహితులకి పరిచయం చేసి, బ్లాగ్ బాగోగులు మాకు తెలియపరచమని మా ప్రార్థన.

మా పాఠకుల అభిప్రాయాలు :

మిత్రులు శ్రీ.రామానుజం గారు.

హర్షణీయ – ప్రపంచం

అతిధి దర్శనాలు

అధ్యాయాలు

హర్షణీయం సభ్యత్వం కొరకు మీ ఈమెయిల్.

ధన్యవాదములు

హర్షణీయం సభ్యత్వం కొరకు మీ ఈమెయిల్.