Apple PodcastsSpotifyGoogle Podcasts

పాఠశాల విద్యార్థులకు , తెలుగు సాహితీవేత్తలను పరిచయం చెయ్యడం ఎలా ?

ఎనిమిదేళ్ల కిందట , , అనంతపూర్ జిల్లాకి చెందిన తెలుగు అధ్యాపక దంపతులు, శ్రీ శ్రీనివాసులు గారు , శ్రీమతి యశోద గారు, అందరం మరిచి పోతున్న ప్రసిద్ధ తెలుగు కవులనీ , రచయితలనీ,ముఖ చిత్రాలతో , వివరాలతో పాఠశాలలో చదివే విద్యార్థులకు, పరిచయం చెయ్యాలని పూనుకున్నారు.

దానికి ఒక మార్గం ఆలోచించారు. కొన్ని రోజుల తర్వాత వారి అబ్బాయి షణ్ముఖ కూడా, ఆ ప్రయత్నానికి చేయూతనిస్తూ , హర్షిత పబ్లికేషన్స్ ని ప్రారంభించాడు.

వాళ్ళ జర్నీ ని ఈ హర్షణీయం ఎపిసోడ్లో మనం విందాం.

ఈ ప్రయత్నంలో మీరు గూడ పాలు పంచుకోవాలంటే, క్రింది అడ్రస్, ఫోన్ నంబర్ ద్వారా హర్షిత పబ్లికేషన్స్ షణ్ముఖ గారిని సంప్రదించండి.

Harshitha Publications, , 1-1189-94, NGO’s colony, Kadiri, Ananthapuram District, Andhra Pradewsh, India – 515591

Mobile Number: 8885818687, (www.harshithapublications.com)

“పాఠశాల విద్యార్థులకు , తెలుగు సాహితీవేత్తలను పరిచయం చెయ్యడం ఎలా ?”‌కి ఒక స్పందన

  1. తెలుగు సాహితీ మూర్తులు / కవుల జీవిత చరిత్ర సేకరణ, స్పష్టత కల్గిన ముఖ చిత్రాలకోసము గత 9/10 సంవత్సరాలనుండి మీరు చేసిన కృషి మీకు తెలుగు సాహిత్యము పట్ల ఉన్న మక్కువ , అభిరుచి అందులో తల్లి దండ్రితో పాటు గా మీ కుమారుడు ఉన్నతమైన చదువు చదివి కూడా తెలుగు భాషను అమితంగా ప్రేమిస్తూ యావత్ తెలుగు ప్రజలకు, విద్యార్థులకు తెలుగు సాహిత్యాన్ని పరిచయము చేసిన ప్రతి మహనీయుని చిత్ర పటాన్ని జీవిత విశేషాలను అందిస్తున్నకు మీకుటుంబానికి ప్రత్యేకమయిన ధన్యవాదములు తెలియజేస్తూ, తప్పకుండ మీరు పడ్డ శ్రమకు తగిన విధంగా ప్రోత్సహాము లభించాలని అందుకు తగ్గ గుర్తింపు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ , త్వరలోనే మా పాఠశాలకు మిమ్మల్ని ఆహ్వానిస్తామని తమరికి తెలియపరుస్తున్నాను.

Leave a Reply to SankarCancel reply

Discover more from Harshaneeyam

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading