Apple PodcastsSpotifyGoogle Podcasts

  • ‘ఒంటరి – జోడి’
    ‘ఒంటరి – జోడి’

    కథా మూలం అమెరికన్ రచయిత  షేర్ వుడ్  ఆండర్సన్ రాసిన – ‘బ్రదర్స్’ (https://americanliterature.com/author/sherwood-anderson/short-story/brothers) రచయిత గురించి –  మొదటి రెండవ ప్రపంచయుద్ధాల మధ్య కాలంలో రచనలు చేసిన షేర్ వుడ్ ఆండర్సన్, విలియం ఫాక్నర్, హెమింగ్వే లాటి రచయితలకి అభిమాన కథా రచయిత. మొదటి పారిశ్రామిక విప్లవం వల్ల పట్టణాల, గ్రామాలలో నివసించే ప్రజల జీవితాల్లో వచ్చిన మార్పులు, ఇబ్బందుల గురించి మానసికంగా విశ్లేషిస్తూ  అనేక కథలు రాసారు.  ఒంటరి జోడి (Brothers – Sherwood…

  • వర్షంలో పిల్లి ! (హెమింగ్వే రచన)
    వర్షంలో పిల్లి ! (హెమింగ్వే రచన)

    ‘ వర్షంలో పిల్లి’ , ఈ కథకు అనువాదకులు శ్రీ పతంజలి శాస్త్రి గారు. కథకు ఆంగ్ల మూలం ఎర్నెస్ట్ హెమింగ్వే రాసిన ‘Cat in the Rain’. కథకు అనువాదంతో పాటూ , కథ గురించి వారు ఇచ్చిన వివరణ కూడా ఇదే పేజీలో చదవవొచ్చు. ‘వర్షంలో పిల్లి’: తెలుగు అనువాదం – పతంజలి శాస్త్రి  (‘Cat in the Rain’: ఆంగ్ల మూలం – ఎర్నెస్ట్ హెమింగ్వే) ఆ హోటల్లో ఇద్దరే అమెరికన్లు దిగేరు.…

  • పతంజలి శాస్త్రి  గారి కి  జీవిత  సాఫల్య  పురస్కారం  !
    పతంజలి శాస్త్రి గారి కి జీవిత సాఫల్య పురస్కారం !

    అప్పాజోస్యుల విష్ణుభొట్ల కందాళం ఫౌండేషన్ (అజో – విభో – కందాళం ) 29 వ వార్షిక సందర్భంగా శ్రీ తల్లావజ్ఝల పతంజలి శాస్త్రి గారికి, ఆయన చేసిన సాహితీ కృషికి గుర్తింపుగా. ప్రతిభామూర్తి జీవితకాల సాధన పురస్కారాన్ని (PRATIBHAMURTHY LIFE TIME ACHIEVEMENT AWARD) జనవరి 9 వ తారీఖు 2021 న, కాకినాడలో ప్రదానం చేస్తున్నారు. ఈ సందర్భంగా శ్రీ నండూరి రాజగోపాల్ గారు పతంజలి శాస్త్రి గారిపై ఆంధ్రజ్యోతి దిన పత్రిక కై…

  • పతంజలి  శాస్త్రి  గారి కథల్లో   పాఠకుడి  పాత్ర
    పతంజలి శాస్త్రి గారి కథల్లో పాఠకుడి పాత్ర

    అప్పాజోస్యుల విష్ణుభొట్ల కందాళం ఫౌండేషన్ (అజో – విభో – కందాళం ) 29 వ వార్షిక సందర్భంగా శ్రీ తల్లావజ్ఝల పతంజలి శాస్త్రి గారికి, ఆయన చేసిన సాహితీ కృషికి గుర్తింపుగా. ప్రతిభామూర్తి జీవితకాల సాధన పురస్కారాన్ని (PRATIBHAMURTHY LIFE TIME ACHIEVEMENT AWARD) జనవరి 9 వ తారీఖు 2021 న, కాకినాడలో ప్రదానం చేస్తున్నారు. ఈ సందర్భంగా వారి కథారచనపై హర్షణీయం సమీక్ష. కథలో పాఠకుడి పాత్ర “ నేను రాసేటప్పుడు అంతా…

  • కూపే
    కూపే

    ‘కూపే’ ( మూలం: రేమండ్ కార్వర్ కథ ‘కంపార్ట్మెంట్’) అమెరికన్ రచయిత రేమండ్  కార్వర్ కథల్లో  అత్యంత ప్రాచుర్యం పొందిన రచనల్లో ‘Compartment’ ఒకటి. కథాంశం ఎనిమిదేళ్లుగా దూరమైన కొడుకుని కలవడం కోసం మేయర్స్ అనే వ్యక్తి చేసే ప్రయాణం.  సంభాషణల ద్వారా లేదా రచయిత జోక్యం ద్వారా కాకుండా, మేయర్స్ మనసులో ఆలోచనలూ, అతని చుట్టూ కనపడుతున్న వాతావరణం లో అతను గమనించే విషయాలూ వీటి  గురించి క్లుప్తంగా ప్రస్తావిస్తూ కథను ముందుకు తీసుకెళ్తారు రచయిత.…

  • ఆశ – ఆశంక
    ఆశ – ఆశంక

    ఆశ – ఆశంక : వడి వడిగా నడుస్తోంది సుభాషిణి. ఆ మట్టి  రోడ్డు మీద నడుస్తున్న వాళ్లందరినీ గబా గబా దాటుకొని వెళ్తోంది. సాయంకాలం నీరెండలో ధూళి ఆమె పాదాల నుంచి ఓ చిన్న తెరలా పైకి లేవటం కనపడుతోంది. మొహంలోకి  పరికించి చూస్తే తన పెదాలు బిగబట్టి మనసులోని అల్లకల్లోల్లాన్ని తొక్కిపెడుతోందా అనిపిస్తోంది.  ‘ఛకూలియా’ శనివారం సంత రద్దీ నించీ ఎలాగోలా తప్పించుకుని బయటపడింది తాను.  ఇంకా ఐదు కిలోమీటర్ల పైన నడవాలి ఇంటికి…

  • ‘ నల్లజర్ల రోడ్డు’  –  తిలక్  గారి కథ!
    ‘ నల్లజర్ల రోడ్డు’ – తిలక్ గారి కథ!

    నల్లజర్ల రోడ్డు ‘తిలక్ కథలు’ అనే సంకలనం నుంచి. ఈ కథ మూడు భాగాలుగా ప్రసారం చెయ్యడం జరుగుతుంది. ఈ పుస్తకాన్ని నవచేతన వారు పబ్లిష్ చెయ్యడం జరిగింది. తిలక్ గారి కథలు ఆడియో రూపంలో మీకందించటానికి అనుమతినిచ్చిన శ్రీ మధుకర్ గారికి హర్షణీయం తరఫున హృదయ పూర్వక కృతజ్ఞతలు. పుస్తకం నవోదయ బుక్ హౌస్ వారి లింక్ ద్వారా ఆన్లైన్ లో కొనొచ్చు. – http://bit.ly/tilaknavodaya ‘ “నల్లజర్ల అడవి మీద చంద్రుడు భయంకరంగా ఉదయించాడు”. …

  • ఖదీర్ బాబు  గారి  ‘గేట్’!
    ఖదీర్ బాబు గారి ‘గేట్’!

    ‘గేట్’ ఖదీర్ బాబు గారి రచన. ‘ గత పాతికేళ్ళుగా తెలుగు కథ రచయితగా మనల్ని అలరిస్తున్న శ్రీ ఖదీర్ బాబు నెల్లూరు జిల్లా కావలి లో జన్మించారు. బి.ఎస్. సీ కంప్యూటర్ సైన్స్ లో పట్టభద్రులు. పత్రికా రంగంలో, సినీ రంగంలో తన సేవలందిస్తూ, రచనా ప్రక్రియను కొనసాగిస్తున్నారు. . వారు రాసిన పుస్తకాలలో కొన్ని ‘ దర్గామిట్ట కథలు ‘ , ‘ న్యూ బాంబే టైలర్స్ ‘ , ‘ పోలేరమ్మ బండ…

  • ‘వనవాసి’ :  నవల పూర్తి యాభై  భాగాలు !
    ‘వనవాసి’ : నవల పూర్తి యాభై భాగాలు !

    1930 దశకంలో, బిభూతి భూషణ్ బందోపాధ్యాయ తన స్వీయానుభవాల ఆధారంగా రాసిన ‘ అరణ్యక్’ పర్యావరణం పై వచ్చిన అత్యుత్తమమైన నవలల్లో ఒకటి. దీనిని తెలుగులోకి ‘వనవాసి’ అనే పేరుతో సూరంపూడి సీతారాం గారు అనువదించారు. హైదరాబాద్ బుక్ ట్రస్ట్ ఈ పుస్తకాన్ని ప్రచురించింది హర్షణీయం , హైదరాబాద్ బుక్ ట్రస్ట్ వారి సౌజన్యంతో ఈ నవల ను శబ్ద-రూపకంగా మీకందిస్తున్నాము. ఆపిల్ యాప్ ద్వారా వినడానికి – https://podcasts.apple.com/in/podcast/harshaneeyam/id1522538540

  • Hydropower Projects – Ecological Destruction (Conversations with Environmentalists from Across the country)
    Hydropower Projects – Ecological Destruction (Conversations with Environmentalists from Across the country)

    వనవాసి ధారావాహిక లో భాగంగా , ఇప్పుడు మీరు వినబోయే ఉపన్యాసం , హర్షణీయంలో ఇంతకు ముందు ప్రముఖ పర్యావరణవేత్త శ్రీ హిమాంశు థక్కర్ గారు ఆంగ్లంలో ఇదే విషయంపై చేసిన ప్రసంగం ఆధారంగా వ్రాయబడింది.    ఈ ప్రసంగంలో ప్రస్తావించిన  అంశాలు   – మన దేశంలో హైడ్రో పవర్,, జల విద్యుత్ ఉత్పాదన ఎలా జరుగుతోంది?  జల విద్యుచ్ఛక్తి వల్ల ఎలాంటి తీవ్రమైన నష్టాలు , పర్యావరణానికి కలుగుతున్నాయి, ఎందుకు ప్రపంచ వ్యాప్తంగా ప్రభుత్వాలు  జల…

  • Environmental Issues – Climate change (Conversations from Eco Activists from across the country)
    Environmental Issues – Climate change (Conversations from Eco Activists from across the country)

  • ‘త్రిపుర’ గారి గురించి డాక్టర్  మూలా  సుబ్రహ్మణ్యం
    ‘త్రిపుర’ గారి గురించి డాక్టర్ మూలా సుబ్రహ్మణ్యం

    ఈ ఎపిసోడ్లో శ్రీ మూలా సుబ్రహ్మణ్యం గారు, ప్రసిద్ధ రచయిత త్రిపుర గారి గురించి మాట్లాడతారు. శ్రీ సుబ్రహ్మణ్యం VLSI ఆర్కిటెక్చర్ లో డాక్టరేట్ తీసుకుని, ప్రస్తుతం పాలక్కాడ్ ఐఐటీ లో పని చేస్తున్నారు. స్వతహాగా, చక్కటి కవి రచయిత . ,’ఆత్మనొక దివ్వెగా’ నవల , ‘సెలయేటి సవ్వడి’ కవితా సంపుటి వీరి ప్రసిద్ధ రచనలు.

  • ఎండమావుల్లో తిమింగలాల వేట – కే సభా గారి రచన
    ఎండమావుల్లో తిమింగలాల వేట – కే సభా గారి రచన

    కె.సభా (జూలై 1, 1923 – నవంబరు 4, 1980)  రాయలసీమలో  కథా రచనను తొలినాళ్ళలో ప్రారంభించి ఆ రుచిని తెలుగు  పాఠకలోకానికి దశాబ్దాలపాటు పంచిన బహుముఖ ప్రజ్ఞాశాలి. జాతీయోద్యమ చైతన్యంతో జీవితానుభవాలను, ఆదర్శాలను తన రచనా మూలాలుగా అందించిన దార్శనికుడు. కథా రచయితగా , నవలాకారుడిగా, కవిగా, గేయకర్తగా, బాలసాహిత్య నిర్మాతగా, సంపాదకునిగా, జానపద గేయ సంకలనకర్తగా, ప్రచురణకర్తగా కె.సభా విస్తారమైన సాహిత్య కృషిని చేశారు. కథను మీకందించడానికి సహకరించిన శ్రీమతి రమణ గారికి కృతజ్ఞతలు.  ముక్కంటి సీమలో పెద్ద కాటకం వచ్చింది. క్షామ దేవత…

  • ‘మనిషి లోపలి  విధ్వంసం’ – అల్లం రాజయ్య గారి రచన
    ‘మనిషి లోపలి విధ్వంసం’ – అల్లం రాజయ్య గారి రచన

    గత నలభై ఏళ్ల పైబడి రచన వ్యాసంగాన్ని కొనసాగిస్తున్న అల్లం రాజయ్య గారు తెలుగులో మనకున్న అత్యుత్తమ కథా రచయితల్లో ఒకరు. ఆయన రాసిన ‘మనిషి లోపలి విధ్వంసం’ ఇప్పుడు మీరు వినబోయే కథ. కథను మీకందించడానికి అనుమతినిచ్చిన అల్లం రాజయ్య గారికి కృతజ్ఞతలు. ఈ కథ వారి కథా సంపుటి, ‘ అతడు’ లోనిది. పుస్తకం కొనాలంటే ఈ లింకుని ఉపయోగించండి.  https://bit.ly/3scvsxP అదొక చిన్నరైల్వే స్టేషన్. ఆ స్టేషన్ భవనాలు నైజాం కాలంలో కట్టినవి.…

  • త్రిపుర గారి ‘పాము’
    త్రిపుర గారి ‘పాము’

    ‘త్రిపుర’ పేరు తో కథలు కవిత్వం రాసిన రాయసం వెంకట త్రిపురాంతకేశ్వర రావు గారు, తన విలక్షణమైన కథా శైలి తో ఎందరో అభిమానుల్ని సంపాదించుకోవటమే గాకుండా, అనేక మంది రచయితలకు ఆదర్శంగా నిలిచారు.  కథను మీకు పరిచయం చేయడానికి అనుమతినిచ్చిన శ్రీ ఉణుదుర్తి సుధాకర్ గారికి కృతజ్ఞతలు.  కథను అనల్ప పబ్లిషర్స్ ప్రచురించిన ‘త్రిపుర కథలు ‘ నించి తీసుకోవటం జరిగింది.  పుస్తకం కొనాలంటే – https://bit.ly/3mAwFhN

  • ‘సమాంతరాలు’ పతంజలి శాస్త్రి గారి కొత్త  కథా సంపుటం
    ‘సమాంతరాలు’ పతంజలి శాస్త్రి గారి కొత్త కథా సంపుటం

    ప్రసిద్ధ రచయిత పతంజలి శాస్త్రి గారి ‘సమాంతరాలు’ కథాసంపుటం విడుదల సందర్భంగా , ఛాయా మోహన్ గారితో కలిసి , హర్షణీయం – పతంజలి శాస్త్రి గారితో చేసిన సంభాషణ , ఈ ఎపిసోడ్లో . పుస్తకం కొనడానికి ఈ లింక్ ఉపయోగించండి. (https://bit.ly/samantharaalu) . పుస్తకం, ఆడియో వెర్షన్ ‘ఆడియో బైట్స్’ యాప్ కు సబ్స్క్రయిబ్ చేసి వినవచ్చు. (https://audiobites.storytel.com/) . తెలుగులో మొదటిసారిగా, ఆడియో , ప్రింటెడ్ వెర్షన్స్ ఒకే సారి లభ్యం అవ్వడం, ‘సమాంతరాలు’…

  • అర్నాద్ గారి ‘రిక్షా ప్రయాణం’
    అర్నాద్ గారి ‘రిక్షా ప్రయాణం’

    ప్రముఖ రచయిత అర్నాద్ గారి రచన ‘రిక్షా ప్రయాణం’. 1981 వ సంవత్సరంలో ఆంద్రజ్యోతి సంక్రాంతి కథల పోటీలో ప్రధమ బహుమతి పురస్కారం అందుకున్న కథ. కథను మీకందించడానికి అనుమతినిచ్చిన అర్నాద్ గారికి కృతజ్ఞతలు. “అమ్మా రిక్షా కావాలా” తైల సంస్కారం లేని ఉంగరాల జుట్టు, కోల ముఖంలో చురుకైన కళ్లు, సూది ముక్కు, బండ పెద వులు, మెడలో మురికి పట్టిన తాడు, దానికి వేళాడుతూ ఏడు కొండలవాడి ప్లాస్టిక్ బిళ్ళ, చిన్నచిన్న బొక్కల బనీను,…

  • ‘షరా’ గోపీచంద్ గారి రచన
    ‘షరా’ గోపీచంద్ గారి రచన

    ‘షరా’ గోపీచంద్ గారు రాసిన కథ . కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత గోపీచంద్ గారు ప్రసిద్ధ రచయిత, సినిమా రంగంలో ప్రవేశించి దర్శక నిర్మాత గా కొన్ని చిత్రాలను నిర్మించారు. కొన్ని సినిమాలకు రచయితగా కూడా పని చేశారు. గోపీచంద్ గారి కథలను మీకు అందించడానికి, అనుమతినిచ్చిన శ్రీమతి రజని గారికి కృతజ్ఞతలు. ఈ కథ ‘గోపీచంద్ రచనా సర్వస్వం – కథలు – 2 ‘ లోనిది. పుస్తకం కొనాలంటే ఈ లింకుని…

  • ‘పేపర్ టైగర్’  కథ – వాసిరెడ్డి నవీన్ గారి ముందు మాటతో
    ‘పేపర్ టైగర్’ కథ – వాసిరెడ్డి నవీన్ గారి ముందు మాటతో

    ఎన్ ఎస్  ప్రకాశరావు గారు కథకులు, వ్యాసరచయిత. కెమికల్ ఇంజనీరింగులో పిహెచ్.డి చేశారు. ‘ఎన్నెస్ కథలు’ వీరి కథాసంపుటి. ఈ కథల సంపుటి చాలా ఆదరణకు నోచుకుంది. విశాఖ రచయితల సంఘంలో క్రియాశీల సభ్యులుగా సేవలందించారు. ముందుగా ఈ కథ గురించి ‘ కథా’ నవీన్ గారు మాట్లాడతారు. కథను మీకందించడానికి అనుమతినిచ్చిన శ్రీమతి నళిని గారికి, ముందు మాటనందించిన నవీన్ గారికి   కృతజ్ఞతలు.  “ఈ వర్షం ఇప్పుడిప్పుడే వదిలేలాగ లేదబ్బాయ్!” అన్నారు నరసింహం గారు,…

  • రచయిత ఉణుదుర్తి సుధాకర్ గారితో సంభాషణ
    రచయిత ఉణుదుర్తి సుధాకర్ గారితో సంభాషణ

    ఆటా బహుమతి పొందిన ‘యారాడకొండ’ నవలా రచయిత శ్రీ . ఉణుదుర్తి సుధాకర్. వృత్తి రీత్యా మెరైన్ ఇంజనీర్ అయిన శ్రీ సుధాకర్ రాసిన ‘తూరుపు గాలులు’ కథాసంపుటం కూడా విశేష ఆదరణ పొందింది. ఇప్పుడు కొత్తగా రాసిన ఇంకో కథల పుస్తకం ‘ చలిచీమల కవాతు. హర్షణీయం టీం ఆయనతో జరిపిన ఇంటర్వ్యూ ఇప్పుడు మీ కోసం. ‘చలిచీమల కవాతు’ పుస్తకం కొనడానికి ఈ లింక్ ని ఉపయోగించండి – https://amzn.to/3BzBpsO హర్షణీయం ఇంటర్వ్యూ మీరుఎంతకాలంనించీకథలురాస్తున్నారు?…

  • ది ఫ్రెండ్స్ – ఎన్.ఎస్.ప్రకాశరావు గారి రచన
    ది ఫ్రెండ్స్ – ఎన్.ఎస్.ప్రకాశరావు గారి రచన

    ఎన్ ఎస్  ప్రకాశరావు గారు కథకులు, వ్యాసరచయిత. కెమికల్ ఇంజనీరింగులో పిహెచ్.డి చేశారు. ‘ఎన్నెస్ కథలు’ వీరి కథాసంపుటి. ఈ కథల సంపుటి చాలా ఆదరణకు నోచుకుంది. విశాఖ రచయితల సంఘంలో క్రియాశీల సభ్యులుగా సేవలందించారు. వీరు అతి చిన్న వయసులో  అకాల మరణం చెందడం తెలుగు సాహిత్యానికి లోటు అని చెప్పవచ్చు.

  • స వెం రమేష్ గారితో హర్షణీయం
    స వెం రమేష్ గారితో హర్షణీయం

    స.వెం.రమేశ్ గారు జీవితమంతా తెలుగు భాషా ప్రాచుర్యానికే అంకితం చేసిన అపురూపమైన మనిషి. హర్షణీయంతో ఆయన మనం కోల్పోతున్న భాషా వైభవాన్ని సంస్కృతిని గురించి, మాట్లాడుతూ , ఈ ప్రయాణంలో తాను దాచుకున్న అనేక అనుభవాలను అనుభూతులను పంచుకున్నారు.

  • స వెం రమేష్ గారి  ‘ఉత్తర పొద్దు’ – ప్రళయ కావేరి కథలు నుంచి
    స వెం రమేష్ గారి ‘ఉత్తర పొద్దు’ – ప్రళయ కావేరి కథలు నుంచి

    ‘ప్రళయకావేరి కథలు’రచయిత స.వెం.రమేశ్  ఎం.ఎ. (ఆంత్రొపాలజీ,)ఎం.ఎ. (తెలుగు) చదివారు. తెలుగు భాషకోసం అంకితమై పనిచేస్తున్న కార్యకర్త స.వెం.రమేశ్. తమిళనాడులోని తెలుగుభాషా సంస్కృతుల పరిరక్ష, ణ, అభివృద్ధి ఆయన  కార్యక్రమం.  తెలుగు భాషోద్యమ స్ఫూర్తితో చెన్నై కేంద్రంగా తమిళనాడులో తెలుగు భాషాపరిశోధన, బోధన, ప్రచారాల కోసం ప్రారంభమైన ‘తెలుగువాణి’ (ట్రస్టు) సభ్యుడుగా, పూర్తి సమయ కార్యకర్తగా ఉన్నాడు.

  • నిర్మల మొగుడు – తిలక్ గారి కథ:
    నిర్మల మొగుడు – తిలక్ గారి కథ:

    నిర్మల మొగుడు కథ రాసింది, శ్రీ దేవరకొండ బాలగంగాధర తిలక్. సంగ్రహించింది ‘తిలక్ కథలు’ అనే సంకలనం నుంచి.పుస్తకం నవోదయ బుక్ హౌస్ వారి లింక్ ద్వారా ఆన్లైన్ లో కొనొచ్చు. – http://bit.ly/tilaknavodaya

  • వఱడు   – అల్లం శేషగిరి రావు గారు
    వఱడు – అల్లం శేషగిరి రావు గారు

    ‘వఱడు ‘ – అల్లం శేషగిరిరావు గారి ‘అరణ్య ఘోష’ కథాసంకలనం లోనిదిపొలిటికల్ సైన్స్ లో ఎం ఏ పట్టా పుచ్చుకున్న అల్లం శేషగిరి రావు గారు, రైల్వేస్ లో పని చేసి రిటైర్ అయ్యారు. విశాఖపట్నం లో నివసించారు. ఆంగ్ల సాహిత్యంలోని అనేక ప్రసిద్ధ రచయితల రచనలను ఆయన ఇష్టంగా చదువుకున్నారు.ఆయన తన పదమూడవ ఏటినించీ, స్నేహితులతో , ఇంట్లో వారితో కలిసి, వేటకు వెళ్లడం అడవుల్లో చాలా సమయాన్ని గడపడం జరిగిందిఅటవీ నేపథ్యంలోనే ఎక్కువ…

  • ‘రెండు రెళ్ళు నాలుగు’ – చిలుకూరి దేవపుత్ర గారు
    ‘రెండు రెళ్ళు నాలుగు’ – చిలుకూరి దేవపుత్ర గారు

    ‘రెండు రెళ్ళ నాలుగు’ చిలుకూరి దేవపుత్ర గారి రచన. అనంతపురం జిల్లాకి చెందిన ఆయన తన జీవిత కాలంలో , నాలుగు నవలలు, ఐదు కథాసంపుటాలను రచించారు. ఆయన నవల ‘పంచమం’ శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ వారు ఎం.ఏ పాఠ్యాంశం గా చేర్చారు. దేవపుత్ర గారు అందుకున్న అనేక పురస్కారాలలో , చాసో స్ఫూర్తి సాహితీ పురస్కారం , విశాలాంధ్ర వారి స్వర్ణోత్సవ సాహితీ పురస్కారం వున్నాయి. ‘రెండు రెళ్ళ నాలుగు’, ఒక యదార్థ సంఘటన ఆధారంగా రాసిన…

  • ‘వార్తాహరులు’ – ఉణుదుర్తి సుధాకర్ గారు
    ‘వార్తాహరులు’ – ఉణుదుర్తి సుధాకర్ గారు

    ‘వార్తాహరులు’ అనే కథ, రచయిత ఉణుదుర్తి సుధాకర్ గారు. సుధాకర్ గారి ‘తూరుపు గాలులు’ అనే సంపుటం లోనిది. మనదేశంలో బ్రిటిష్ వారు, టెలిగ్రాఫ్ వ్యవస్థ ఏర్పరచడానికి దారి తీసిన పరిస్థితులను ఆధారంగా తీసుకొని రాసిన కథ. మెరైన్ ఇంజనీర్ గా పని చేసిన సుధాకర్ గారు రాసిన ‘యారాడ కొండ’ ఆటా నిర్వహించిన నవలల పోటీలో ద్వితీయ బహుమతి పొందిన నవల. ‘హిస్టారికల్ ఫిక్షన్’ రాస్తున్న అతి కొద్దిమంది రచయితల్లో సుధాకర్ గారు ముందు వరసలో…

  • ‘ ది బ్లూ అంబ్రెల్లా’
    ‘ ది బ్లూ అంబ్రెల్లా’

    పిల్లల సినిమాల్లో ప్రపంచ వ్యాప్తంగా వచ్చిన అత్యుత్తమ సినిమాలను ఇరవై ఐదు , ఎంపిక చేసి , వాటి కథలను పరిచయం చేస్తూ ‘ పిల్లల సినిమా కథలు ‘ అనే ఒక పుస్తకం రాసి ప్రచురించారు రచయిత అనిల్ బత్తుల. ఈ పుస్తకంనించి, ‘ ది బ్లూ అంబ్రెల్లా’ అనే సినిమా కథా పరిచయాన్ని మీరు ఈ ఎపిసోడ్లో వింటారు. ‘ The Blue Umbrella’ కథకు రచయిత శ్రీ రస్కిన్ బాండ్. అనిల్ గారు…

  • పుస్తక ప్రేమికుడు, అనిల్ బత్తుల గారితో హర్షణీయం
    పుస్తక ప్రేమికుడు, అనిల్ బత్తుల గారితో హర్షణీయం

    అనిల్ బత్తుల ఒక పుస్తక ప్రేమికుడు. ప్రేమ అంటే పుస్తకాలు కొనడం, చదవడం తో ఆగిపోకుండా, లభ్యం కాని అరుదైన తెలుగు పుస్తకాలను వెతికి వెంటాడి వాటిని వెలుగులోకి తీసుకొచ్చేంత. ఇదికాకుండా, సోవియెట్ పిల్లల జానపద కథలను ప్రచురించారు. వేల పుస్తకాలను తన ఖర్చుతో సేకరించి, లైబ్రరీలకు అందచేశారు. పదేళ్లు ఐటీ రంగంలో పని చేసి, రిసైన్ చేసి , ఇప్పుడు నిజామాబాద్ పక్కనుండే ఒక పల్లెకు షిఫ్ట్ అయ్యి, వరల్డ్ సినెమా లో పిల్లల గురించి…

  • కథానవీన్ గారితో హర్షణీయం
    కథానవీన్ గారితో హర్షణీయం

    కథా నవీన్’ గా సుప్రసిద్ధులైన శ్రీ వాసిరెడ్డి నవీన్ గారు , తెలుగు కథా సాహిత్య రంగంలో గత నలభై ఏళ్ళు గా పరిశ్రమ చేస్తున్నారు. విస్తృతంగా తెలుగు కథ గురించి వ్యాసాలు రాసారు. ‘ ప్రజాసాహితి’ పత్రిక సంపాదకునిగా పని చేశారు.. అనేక దేశాల్లో , తెలుగు కథ గురించి విశ్లేషణాత్మక ఉపన్యాసాలు చేసారు.1990 లో ‘తెలుగు కథా సాహితి’ అనే సంస్థ ను ఏర్పాటు చేసి, ప్రతి సంవత్సరంలో ప్రచురితమైన కథల్లో కొన్ని ఉత్తమమైన…

  • ‘జెన్’ – పతంజలి శాస్త్రి గారి రచన
    ‘జెన్’ – పతంజలి శాస్త్రి గారి రచన

    రిటైరై,  కొడుకూ కోడలితో జీవించే నాయుడు గారు. వృత్తి రీత్యా ఒక మెకానిక్. ప్రపంచాన్ని ఆశావహ దృక్పధంతో చూస్తూ, ఓపిగ్గా,  చుట్టూవుండే పరిస్థితులను కావలసిన విధంగా మలుచుకుంటూ,  జీవించడాన్ని ఇష్టపడతారు.  ఆయనకు పూర్తిగా విరుద్ధ స్వభావం వుండే ఆయన కొడుకు కృష్ణ , తన జీవితంలో వుండే అసంతృప్తిని వస్తువులపై చూపించడమే కాక , తన భార్యను కూడా వాటి గాటన కట్టేసే  మనిషి. కథలోవుండే ఇంకో ముఖ్యపాత్ర ‘అమ్మతల్లి’ –  స్నేహితుడు పనికి రాదని పారేస్తూంటే…

  • ‘సంపెంగపువ్వు’ – గోపీచంద్ గారు.
    ‘సంపెంగపువ్వు’ – గోపీచంద్ గారు.

    ‘సంపెంగ పువ్వు’ గోపీచంద్ గారు రాసిన కథ . 1971 వ సంవత్సరం, జనవరి నెల యువ మాస పత్రిక లో ప్రచురింపబడింది. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత గోపీచంద్ గారు ప్రసిద్ధ రచయిత, సినిమా రంగంలో ప్రవేశించి దర్శక నిర్మాత గా కొన్ని చిత్రాలను నిర్మించారు. కొన్ని సినిమాలకు రచయితగా కూడా పని చేశారు. ఈ కథను మీకు అందించదానికి, అనుమతినిచ్చిన శ్రీమతి రజని గారికి కృతజ్ఞతలు. ముందుగా, రజని గారు గోపీచంద్ గారి…

  • ‘గాలివాన’ – పాలగుమ్మి పద్మరాజు గారి రచన
    ‘గాలివాన’ – పాలగుమ్మి పద్మరాజు గారి రచన

    కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు గ్రహీత ప్రముఖ రచయిత పాలగుమ్మి పద్మరాజు గారు రాసిన ‘గాలివాన ’ కథ , పాలగుమ్మి పద్మరాజు రచనలు – మొదటి వాల్యూమ్ లోనిది . న్యూయార్క్ హెరాల్డ్ ట్రిబ్యూన్  నిర్వహించిన కథల పోటీలో రెండవ బహుమతి పొందింది. పుస్తకం కొనడానికి కావాల్సిన  web link కథను మీకందించడానికి అనుమతినిచ్చిన  పాలగుమ్మి సీత గారికి కృతజ్ఞతలు. ఎపిసోడ్లో ముందుగా కథ గురించి పాలగుమ్మి సీత గారు మాట్లాడతారు. హర్షణీయం’ పాడ్కాస్ట్ ని ‘గానా’…

  • ‘మంత్రపుష్పం’ – మల్లాది రామకృష్ణ శాస్త్రి గారు
    ‘మంత్రపుష్పం’ – మల్లాది రామకృష్ణ శాస్త్రి గారు

    హర్షణీయంలో ఇప్పుడు వినబోయే కథ – మంత్రపుష్పం, మల్లాది రామకృష్ణ శాస్త్రి గారి రచన. తన 19వ ఏటనే కథారచన ప్రారంభించి దాదాపు 125 కథలను రాశారు. వీరు రాసిన డుమువులు కథ 14 భారతీయ భాషలలోకి అనువదింపబడింది. మచిలీపట్నంలో బి.ఎ. వరకు చదివారు. తరువాత మద్రాసులో సంస్కృతాంధ్రాలలో ఎం.ఎ.పట్టా పుచ్చుకున్నారు. నాట్యకళలో, చిత్రలేఖనంలో, సంగీతంలో కూడా వీరికి ప్రవేశం ఉంది. కృష్ణాతీరం అచ్చ తెలుగు నుడికారానికి పట్టం కట్టిన రచనగా తెలుగు సాహిత్య చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే నవలగా ఖ్యాతి గడించింది.…

  • వాకాటి పాండురంగరావు గారి ‘మందీ – మరొక్కడు’
    వాకాటి పాండురంగరావు గారి ‘మందీ – మరొక్కడు’

    హర్షణీయంలో వినబోయే కథ పేరు ‘మందీ – మరొక్కడు’ వాకాటి పాండురంగరావు గారి రచన. ఈ కథను అందించడానికి అనుమతినిచ్చిన అపరాజిత గారికి కృతజ్ఞతలు. సుప్రసిద్ధ కథా రచయిత , పాత్రికేయులు వాకాటి పాండురంగ రావు గారు 1934 లో  జన్మించారు. ఆయన  ఆనందవాణి, ఆంధ్ర జ్యోతి, న్యూస్ టైం, ఏ.పి.టైమ్స్, ఆంధ్రప్రభ వారపత్రికలలో వివిధ పాత్రికేయ సేవలనందించారు. శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో జర్నలిజం అధ్యాపకునిగా పనిచేసారు.  విశాఖపట్నం పోర్టుకు డిప్యూటీ దైరక్టరుగా కూడా పనిచేసారు. పాండురంగారావుకథలు , మిత్రవాక్యం , చేత వెన్నముద్ద ,సృష్టిలో తీయనిది, దిక్చూచి లు ఆయన ప్రసిద్ధ రచనలు.…

  • ‘హెడ్ మాస్టారు ‘ పాలగుమ్మి పద్మరాజు గారి రచన!
    ‘హెడ్ మాస్టారు ‘ పాలగుమ్మి పద్మరాజు గారి రచన!

    న్యూయార్క్ హెరాల్డ్ ట్రిబ్యూన్  అంతర్జాతీయ కథా అవార్డు గ్రహీత, కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు గ్రహీత ప్రముఖ రచయిత పాలగుమ్మి పద్మరాజు గారు రాసిన ‘హెడ్ మాస్టారు ’ కథ , పాలగుమ్మి పద్మరాజు రచనలు – మొదటి వాల్యూమ్ లోనిది .  పుస్తకం కొనడానికి కావాల్సిన  web link కథను మీకందించడానికి అనుమతినిచ్చిన  పాలగుమ్మి సీత గారికి కృతజ్ఞతలు. ఎపిసోడ్లో ముందుగా కథ గురించి పాలగుమ్మి సీత గారు మాట్లాడతారు. హర్షణీయం’ పాడ్కాస్ట్ ని ‘గానా’…

  • రచయిత దేవులపల్లి క్రిష్ణమూర్తి గారితో ఇంటర్వ్యూ! ‘నల్లగొండ మల్లి’ గారితో కల్సి
    రచయిత దేవులపల్లి క్రిష్ణమూర్తి గారితో ఇంటర్వ్యూ! ‘నల్లగొండ మల్లి’ గారితో కల్సి

  • ‘చిట్టి తల్లి’ పాలగుమ్మి పద్మరాజు గారి రచన!
    ‘చిట్టి తల్లి’ పాలగుమ్మి పద్మరాజు గారి రచన!

    న్యూయార్క్ హెరాల్డ్ ట్రిబ్యూన్  అంతర్జాతీయ కథా అవార్డు గ్రహీత, కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు గ్రహీత ప్రముఖ రచయిత పాలగుమ్మి పద్మరాజు గారు రాసిన ‘చిట్టి తల్లి’ కథ , పాలగుమ్మి పద్మరాజు రచనలు – మొదటి వాల్యూమ్ లోనిది .  పుస్తకం కొనడానికి కావాల్సిన  web link కథను మీకందించడానికి అనుమతినిచ్చిన  పాలగుమ్మి సీత గారికి కృతజ్ఞతలు. కథను రెండు భాగాలుగా ఆడియో చెయ్యడం జరిగింది, నిడివి ఎక్కువ కావడం వల్ల . ఎపిసోడ్లో ముందుగా…

  • ‘అంటు కొమ్మ’ – అక్కిరాజు భట్టిప్రోలు గారి రచన
    ‘అంటు కొమ్మ’ – అక్కిరాజు భట్టిప్రోలు గారి రచన

    ‘అంటుకొమ్మ’ కథ శ్రీ అక్కిరాజు భట్టిప్రోలు గారు  రాసిన ‘మూడు బీర్ల తర్వాత’ అనే పుస్తకం లోనిది.  తన మూలాలను వెతుక్కుంటూ ఒక మహిళ చేసే  ప్రయాణమే ఈ కథ. కథను చాలా వాస్తవికంగా, ముగింపును హృద్యంగా చిత్రీకరించారు రచయిత.   విభిన్న అంశాలను స్పృశిస్తూ అక్కిరాజు గారు రాసిన  ‘ మూడు బీర్ల తర్వాత’  ఈ మధ్య కాలంలో తెలుగులో వచ్చిన అతి చక్కని కథాసంపుటాల్లో ఒకటి.  పుస్తకం కొనడానికి కావాల్సిన  web link ….  https://bit.ly/3d4M0lv …

  • ‘ఎందుకు పారేస్తాను నాన్నా!’ చాగంటి సోమయాజులు గారి రచన
    ‘ఎందుకు పారేస్తాను నాన్నా!’ చాగంటి సోమయాజులు గారి రచన

    చాగంటి సోమయాజులు గారు ‘చాసో’ గా తెలుగు పాఠక లోకానికి సుపరిచితులు. ఆధునిక తెలుగు కథను ప్రగతి శీల భావాలతో సుసంపన్నం చేసిన చాసో ఎన్నో గొప్ప కథలను రచించారు. 1945 వ సంవత్సరంలో ‘భారతి’ మాస పత్రికలో ప్రచురితమైన ఈ కథను హర్షణీయం ద్వారా మీకందించడానికి అనుమతినిచ్చింది చాగంటి తులసి గారికి , కథకు ఆడియో ని అందించిన చాగంటి కృష్ణ కుమారి గారికి కృతజ్ఞతలు. ఇదే పేజీలో ఈ కథపై, సారంగ వెబ్ మ్యాగజైన్…

  • మనసు ఫౌండేషన్ ఎం.వి.రాయుడు గారితో  ఇంటర్వ్యూ !
    మనసు ఫౌండేషన్ ఎం.వి.రాయుడు గారితో ఇంటర్వ్యూ !

    ఇంజనీరింగ్ డిగ్రీ , M.Sc through research , ఇండియన్ ఇన్స్టిట్యూట్ అఫ్ సైన్స్ లో పూర్తి చేసిన ఎం. వి రాయుడు గారు, పవర్ ఎలక్ట్రానిక్స్ లో డాక్టరేట్ తీసుకున్నారు . మనసు ఫౌండేషన్ ని 2006 వ సంవత్సరం లో తన సోదరులైన డాక్టర్ గోపీచంద్ , డాక్టర్ చంద్ర మౌళి గార్లతో కలిసి స్థాపించారు. తెలుగులో ఇప్పటిదాకా ప్రచురితమైన అన్ని పుస్తకాలను డిజిటల్ ఆర్కైవింగ్ చేసి భద్రపరచాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్న మనసు…

  • ‘సీతా… రాముడొస్తున్నాడోయ్ ‘ – యండమూరి గారి రచన !
    ‘సీతా… రాముడొస్తున్నాడోయ్ ‘ – యండమూరి గారి రచన !

    నవలా రచయితగా లక్షల కొద్దీ అభిమానుల ఆదరం చూరగొన్న యండమూరి వీరేంద్రనాథ్ గారు, గొప్ప నాటికలను రచించారు, అలాగే అతి చక్కటి కథలను కూడా . ఆయన రచించిన కథలలోనించి 25 ఎంపిక చేసిన కథలతో వచ్చిన పుస్తకం ‘ ది బెస్ట్ అఫ్ యండమూరి వీరేంద్రనాథ్’ . ఆ పుస్తకంలోని చివరి కథ ఇప్పుడు మీరు వినబోయే, ‘సీతా…. రాముడొస్తున్నాడోయ్ ‘. ఈ కథను హర్షణీయం ద్వారా మీకందించడానికి అనుమతినిచ్చిన వీరేంద్రనాథ్ గారికి కృతజ్ఞతలు. ఈ…

  • ‘తోటి వేటగాళ్లు’ కేఎన్వై పతంజలి గారి కథ!
    ‘తోటి వేటగాళ్లు’ కేఎన్వై పతంజలి గారి కథ!

    ‘తోటి వేటగాళ్లు’ కే ఎన్ వై పతంజలి గారు రాసిన , వేట కథలు అనే కథాసంపుటం లోనిది. ఈ పుస్తకం కొనడానికి ఈ లింక్ ని ఉపయోగించండి. తోటి వేటగాళ్లు కథపై శ్రీ మందలపర్తి కిషోర్ గారి సమీక్ష కూడా ఆడియోలో మీరు వినవచ్చు. కథను మీకందించడానికి అనుమతినిచ్చిన శ్రీమతి ప్రమీలా పతంజలి గారికి కృతజ్ఞతలు. తోటి వేటగాళ్ళు ! బండివేగిసచెట్టు చేతులెత్తి, జుత్తు విరబోసుకు నిల్చుని రాక్షసుడిలాగుంది ఆ చీకటిలో.  దానినీ , దానితో…

  • ‘బేడమ్మ’ – శ్రీరమణ గారి కథ
    ‘బేడమ్మ’ – శ్రీరమణ గారి కథ

    ‘బేడమ్మ’ అనే ఈ కథ శ్రీరమణ గారు రచించింది. శ్రీరమణ గారు రాసిన శ్రీ ఛానల్ – 2 అనే సంకలనం లోనిది. పుస్తకం కొనడానికి క్రింది ఉన్న లింక్ ని ఉపయోగించండి. బేడమ్మ ఆవిడ అసలు పేరేమిటో తెలియదు. పుట్టు పూర్వోత్తరాలూ తెలియవు.  ఎవర్ని అడిగినా “మాకు గ్రాహ్యం వచ్చినప్పట్నించీ బేడమ్మ యిలాగే వుంది. గోగుకాడలా” అంటారు తప్ప వయసు చెప్పలేరు.  ఒంగిపోకపోయినా నిలువెల్లా  వార్థక్యం తెలుస్తూనే ఉండేది. బ్రాహ్మణ వీధిలో ఉన్న పది యిళ్లూ…

  • ‘జాన్ పాల్ చేసిన బీరువా కథ’
    ‘జాన్ పాల్ చేసిన బీరువా కథ’

    మనం చాలా ప్రేమించే మనుషులు మనకు దూరం అయితే,, మన అస్తిత్వానికి అర్థం లేకుండా పోయినట్టు అన్పిస్తుంది. చుట్టూ వున్న ప్రపంచం అర్థరహితంగా అనిపిస్తుంది. సుప్రసిద్ధ రచయిత్రి వసుంధరాదేవి రాసిన ఈ’జాన్ పాల్ చేసిన బీరువా కథ’, తన తండ్రి మరణం ద్వారా జీవితంలో ఏర్పడిన వెలితిని పూడ్చుకోడానికి ప్రయత్నిస్తున్న ఒక గృహిణి గురించి. ఆమెకు సాంత్వన,ఎవరి వల్ల, ఎలా లభించింది అనేదే ఈ కథ. . వసుంధరాదేవి గారు రాసిన కథల్లో అత్యంత ప్రాచుర్యం పొందింది.…

  • ‘ఎదారి బతుకులు’ రచయిత్రి భారతి గారితో ఇంటర్వ్యూ !
    ‘ఎదారి బతుకులు’ రచయిత్రి భారతి గారితో ఇంటర్వ్యూ !

    ‘ఎదారి బతుకులు’ రాసిన ఎండపల్లి భారతి గారు, చిత్తూరు జిల్లా, దిగువ బురుజు గ్రామానికి చెందిన వారు. ప్రాధమిక విద్యను అభ్యసించిన భారతి గారు, గ్రామీణ జీవిత సమస్యలను, వస్తున్న మార్పులను, దగ్గరగా గమనిస్తూ వచ్చారు. గత ఇరవై సంవత్సరాలుగా చిత్తూరుజిల్లా ‘వెలుగు’ మహిళా సంఘాల (SERP – సెల్ఫ్ హెల్ప్ గ్రూప్) పత్రిక ‘నవోదయం’లో విలేఖరి గా పనిచేస్తున్నారు. ప్రముఖ స్టిల్ లైఫ్ ఆర్టిస్ట్, సామాజిక కార్యకర్త , కిరణ్ కుమారి గారి ప్రోత్సాహంతో, కథలు…

  • ‘ద్రణేవుడు’ పెద్దిభొట్ల సుబ్బరామయ్య గారి కథ
    ‘ద్రణేవుడు’ పెద్దిభొట్ల సుబ్బరామయ్య గారి కథ

    హర్షణీయంలో మీరు వినబోతున్న కథ పేరు ‘ద్రణేవుడు ‘ . ఈ కథ సుప్రసిద్ధ కథా రచయిత కీర్తిశేషులు పెద్దిభొట్ల సుబ్బరామయ్య గారి ‘ పెద్దిభొట్ల సుబ్బరామయ్య కథలు ‘ అనే కథా సంకలనం రెండో భాగం లోనిది. కథను మీకు అందించడానికి అనుమతినిచ్చిన వేలూరి కౌండిన్య గారికి కృతజ్ఞతలు. ఆంధ్రా లొయొలా కాలేజీలో అధ్యాపకునిగా జీవిత కాలం సేవలందించిన సుబ్బరామయ్య గారు , కవి సామ్రాట్ , శ్రీ విశ్వనాథ సత్యనారాయణ గారి ప్రియ శిష్యులు…

  • సింగమనేని నారాయణ గారి రచనా జీవితం  పై ఓల్గా గారు!
    సింగమనేని నారాయణ గారి రచనా జీవితం పై ఓల్గా గారు!

    2021 ఫిబ్రవరి 25 వ తేదీన , సింగమనేని నారాయణ గారి మరణం, తెలుగు సాహితీ ప్రేమికులకు తీవ్రమైన విషాదాన్ని మిగిల్చింది. సుప్రసిద్ధ కథా రచయిత , విమర్శకులు నారాయణ గారు, తెలుగు కథ కు చేసిన సేవ అనన్య సామాన్యం. ఆయన కథారచన పై ప్రసంగించాలని , హర్షణీయం ప్రముఖ రచయిత్రి ఓల్గా గారిని కోరడం జరిగింది. వారు వెంటనే సమ్మతించి, చాల చక్కనైన వివరణాత్మకమైన సమీక్షను మనకందించారు. ఓల్గా గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు. ‘సింగమనేని…

  • పాఠశాల విద్యార్థులకు , తెలుగు సాహితీవేత్తలను పరిచయం చెయ్యడం ఎలా ?
    పాఠశాల విద్యార్థులకు , తెలుగు సాహితీవేత్తలను పరిచయం చెయ్యడం ఎలా ?

    ఎనిమిదేళ్ల కిందట , , అనంతపూర్ జిల్లాకి చెందిన తెలుగు అధ్యాపక దంపతులు, శ్రీ శ్రీనివాసులు గారు , శ్రీమతి యశోద గారు, అందరం మరిచి పోతున్న ప్రసిద్ధ తెలుగు కవులనీ , రచయితలనీ,ముఖ చిత్రాలతో , వివరాలతో పాఠశాలలో చదివే విద్యార్థులకు, పరిచయం చెయ్యాలని పూనుకున్నారు. దానికి ఒక మార్గం ఆలోచించారు. కొన్ని రోజుల తర్వాత వారి అబ్బాయి షణ్ముఖ కూడా, ఆ ప్రయత్నానికి చేయూతనిస్తూ , హర్షిత పబ్లికేషన్స్ ని ప్రారంభించాడు. వాళ్ళ జర్నీ…

  • ‘అహింస’ దాదా హయత్ గారి కథ!
    ‘అహింస’ దాదా హయత్ గారి కథ!

    ‘అహింస’ దాదా హయత్ గారి ‘మురళి ఊదే పాపడు’ అనే కథా సంపుటం లోనిది. వృత్తిరీత్యా లాయర్ ఐన దాదా హయత్ గారు కడప జిల్లా ప్రొద్దుటూరు వాసి. దాదాపుగా డెబ్బై కథలు రాసారు. ఒక స్కూలు పిల్లవాడి గురించి రాసిన ఈ కథలో సున్నితమైన మానసిక విశ్లేషణనీ, పొందికైన పదాల కూర్పునీ మనం చూడొచ్చు. కథను హర్షణీయం ద్వారా మీకు అందించడానికి అనుమతినిచ్చిన దాదా హయత్ గారికి కృతజ్ఞతలు. ఈ పుస్తకం కొనాలంటే, ఈ లింకుపై…

  • ‘నారింజ రంగు సిరా మరకలు’ – మహి బెజవాడ !
    ‘నారింజ రంగు సిరా మరకలు’ – మహి బెజవాడ !

    రచయిత పరిచయం: వాక్యాలనూ రంగులనూ జమిలీగా సాధన చేస్తున్న రచయిత. స్వస్థలం నెల్లూరు జిల్లా కావలి. పుట్టింది 1981లో. కంప్యూటర్ సైన్స్ లో డిగ్రీ చేసి మెడికల్ ఫార్మసీ నిర్వహిస్తూ వచ్చారు. ప్రస్తుతం హైదరాబాద్లో ఆర్షియో క్రియేటివ్ ఏజెన్సీ ద్వారా పబ్లిసిటీ వర్క్ చేస్తున్నారు. డాక్యుమెంటరీలు తీస్తుంటారు. ఇప్పటికి ఏడెనిమిది కథలు రాశారు. ‘డెడ్ మాన్ గోయింగ్ టు సింగ్’ కథలో భిన్నమైన శిల్పంతో ఆకట్టుకున్నారు. ‘ఒక సంఘటన జరిగినప్పుడు దానికి సంబంధించిన ఇన్నర్ వరల్డ్ ఇంట్రెస్టింగ్…

  • ‘వేలుపిళ్లై రామచంద్ర రావు గారు’ హర్షణీయం తో !
    ‘వేలుపిళ్లై రామచంద్ర రావు గారు’ హర్షణీయం తో !

    ఈ ఎపిసోడ్ లో సుప్రసిద్ధ కథకులు , ‘వేలుపిళ్లై’ రామచంద్ర రావు గారితో హర్షణీయం ఇంటర్వ్యూ వినండి. అరవై ఏళ్ల రచనా జీవితంలో , పదంటే, పదే కథలు రాసారు రావు గారు. అన్నీ కథలు తెలుగు పాఠకులకు అత్యంత సుపరిచితాలు. ఎక్కువ కథలు , నీలగిరి టీ ఎస్టేట్స్, నేపధ్యంగా రాసినవి. అక్కడ అసిస్టెంట్ మేనేజర్ గారి చేరి, చైర్మన్ గా రిటైర్ అయ్యిన రామచంద్ర రావు గారు, ఆంధ్రా, మైసూరు స్టేట్ టెన్నిస్ ఛాంపియన్…

  • వంశీ గారి ‘సొట్ట ఆదిగాడు’ – ‘మా దిగువ గోదావరి కథలు’ కథాసంపుటం నించి!
    వంశీ గారి ‘సొట్ట ఆదిగాడు’ – ‘మా దిగువ గోదావరి కథలు’ కథాసంపుటం నించి!

    ‘సొట్ట ఆదిగాడు’ అనే ఈ కథ, వంశీ గారి “మా దిగువ గోదారి కథలు’ అనే కధాసంపుటి నించి. పుస్తకం కొనడానికి – https://www.telugubooks.in/products/vamsi-ma-diguva-godari-kathalu?_pos=4&_sid=1941d5909&_ss=r (ఈ లింక్ ని ఉపయోగించండి.) ‘సొట్ట ఆదిగాడు’: ఆ వూళ్ళో  వున్న అరవై ఎకరాల తోటలూ, వూరికి ఎదురుగా వున్న గోదావరి మధ్యలో వున్న వంద ఎకరాల లంకలు రావి కంపాడు రాజులవి. ఆ రాజుల తాలూకు గుమాస్తాలే వూళ్ళో వుండి కూలోళ్ళనీ పాలేళ్ళనీ పెట్టి పంటలు పండిస్తున్నారు. అదీ ఈనాటి…

  • సుప్రసిద్ధ కథకులు , దర్శకులు, వంశీ గారి తో హర్షణీయం!
    సుప్రసిద్ధ కథకులు , దర్శకులు, వంశీ గారి తో హర్షణీయం!

    సుప్రసిద్ధ కథకులు , దర్శకులు వంశీ గారి రచనా జీవితం గురించి తెలుసుకోడానికి, హర్షణీయం టీం ఆయనను కలవడం జరిగింది. ఇంటర్వ్యూలో పాల్గొని తమ రచనా అనుభవాలను , అభిప్రాయాలను పంచుకున్నందుకు వంశీ గారికి హృదయ పూర్వక కృతజ్ఞతలు. ఇంటర్వ్యూ కి తమ తోడ్పాటు నందించిన శ్రీ వాసిరెడ్డి నవీన్ గారికి ధన్యవాదాలు. వంశీ గారు రాసిన ‘ఆకు పచ్చని జ్ఞాపకం ‘ కొనడానికిhttps://www.telugubooks.in/products/aakupachani-gnaapakam?_pos=15&_sid=2844ef7ef&_ss=r ‘వంశీ కి నచ్చిన కథలు’ కొనడానికి – https://www.telugubooks.in/products/vamsee-ki-natchina-kathalu?_pos=13&_sid=2844ef7ef&_ss=r హర్షణీయం కు…

  • సి.రామచంద్ర రావు గారి ‘ఏనుగుల రాయి’!
    సి.రామచంద్ర రావు గారి ‘ఏనుగుల రాయి’!

    సి.రామచంద్ర రావు గారు రాసిన ఈ కథ ‘వేలుపిళ్లై’ అనే కథా సంపుటం లోనిది. కథను మీకు హర్షణీయం ద్వారా మీకందించడానికి అనుమతినిచ్చిన రామచంద్ర రావు గారికి కృతజ్ఞతలు. ************************************** ‘ఏనుగుల రాయి’: కొత్త దొర వైఖరి ఇంకా తంగముత్తుకి అంతుపట్టలేదు. దొరలు తన కేమీ కొత్తగాదు. ఇరవై ఏళ్ళనుంచీ ‘ప్రోస్పెక్ట్ టీ ఎస్టేటు, కండక్టరుగా పని చేస్తున్నాడు. ఇప్పటికి ఎనమండుగురు మేనేజర్లనైనా చూశాడు. అంతా తెల్లదొరలే. అయితే వాళ్ళంతా ఒకెత్తు, సిమ్మన్సు దొర ఒకెత్తు. వచ్చి…

  • ‘నల్లగొండ కథలు’ రచయిత వి.మల్లికార్జున్ గారితో హర్షణీయం!
    ‘నల్లగొండ కథలు’ రచయిత వి.మల్లికార్జున్ గారితో హర్షణీయం!

    నల్లగొండకు చెందిన వి.మల్లికార్జున్ గారు పత్రికా రంగంలో పనిచేసి, ఇప్పుడు సినీ పరిశ్రమ లో ప్రవేశిస్తున్నారు. ‘నల్లగొండ కథలు’ ఆయన రచించిన మూడో కథల సంపుటి. ఈ ఇంటర్వ్యూ లో తన రచనల గురించి, రచనా జీవితాన్ని గురించి మల్లికార్జున్ గారు అనేక విషయాలు మాట్లాడటం జరిగింది. మొదటి భాగం: రెండవ భాగం:

  • ‘నైట్ డ్యూటీ’ – డాక్టర్.వి.చంద్రశేఖర్ రావు గారి కథ
    ‘నైట్ డ్యూటీ’ – డాక్టర్.వి.చంద్రశేఖర్ రావు గారి కథ

    ఈ కథ డాక్టర్ చంద్రశేఖర్ రావు గారి, ‘చిట్టచివరి రేడియో నాటకం – డాక్టర్.వి.చంద్రశేఖర్ రావు కథలు అనే కథాసంపుటం లోనిది. నైట్ డ్యూటీ “ తెరిచిన గుడిలాంటిది హాస్పటల్. బిహేవ్ లైక్ ఎ డివోటెడ్ ప్రీస్ట్”  ఏమి జోక్ వేశారు సార్! కలకాలం గుర్తుంచుకోవాల్సిన జోక్. పగిలిన సిరంజ్ లూ , మొద్దుబారిన నీడిల్సూ, ఎక్స్పయిరీ డేటు అయిపోయి ‘మృత్యువు నోట్లో పాలపీకలం’ అన్నట్లుగా చూస్తున్న స్క్రిప్టో పెన్సిలిన్లూ, నైవేద్యపు చీరపై మెన్సెస్ మరకలా ఫంగస్…

  • ‘ఆవు పులి మరి కొన్ని కథలు’  –  డాక్టర్ వి .చంద్రశేఖర్ రావు :    కథాపరిచయం
    ‘ఆవు పులి మరి కొన్ని కథలు’ – డాక్టర్ వి .చంద్రశేఖర్ రావు : కథాపరిచయం

    “The dream reveals the reality which conception lags behind, that is the horror of life and the terror of art” – Franz Kafka (1883-1924) కథ స్థూలంగా: కథలో పాత్రధారులు, భార్య , భర్త , ఓ ఐదేళ్ల కూతురు. కథంతా ఫస్ట్ పెర్సన్ నేరేషన్ లో ఉంటుంది. భార్య ఒక పెయింటర్. ప్రతివిషయాన్నీ వ్యాపార దృక్పధం తో చూసే భర్తా, అతనితో ఆమె గడిపే అసంతృప్తికర జీవితం,…

  • ‘మునికాంతపల్లి  కతలు ‘ – సోలోమోన్ విజయ కుమార్ గారితో హర్షణీయం.
    ‘మునికాంతపల్లి కతలు ‘ – సోలోమోన్ విజయ కుమార్ గారితో హర్షణీయం.

    మునికాంతపల్లి కథలు ‘ – సోలోమోన్ విజయ కుమార్ గారితో హర్షణీయం. ఒకే కథాసంకలనం లో 23 చిట్టి పొట్టి కతలు – విఫలమైన ప్రేమసఫలమైన ప్రేమచిన్న చిన్న ఆనందాలూచిన్నతనాన్ని గుర్తు చేసే అందమైన స్నేహాలూ , అనుబంధాలూషాక్ ఇచ్చే ట్విస్టెడ్ ముగింపులు కొన్నీ, ఓపెన్ ఎండెడ్ బుర్ర తొలిచేసే ముగింపులు,కొన్ని వ్యర్థాభరిత జీవితాలు , కొన్ని ఉత్సాహాన్నిచ్చే ముగింపులూఒక్కోసారి నడిపిస్తూ , ఒక్కోసారి అడ్డుతగిలే మతమూఅర్ధమయ్యే గొప్ప తాత్వికతఇవన్నీ –ఇంతకు ముందెన్నడూ మనం చవిచూడని ఒక…

  • వీ మల్లికార్జున్ గారి ‘కొత్త షూసు’  – ‘నల్లగొండ కథలు’ నుంచి !
    వీ మల్లికార్జున్ గారి ‘కొత్త షూసు’ – ‘నల్లగొండ కథలు’ నుంచి !

    ఇప్పుడు మీరు వినబోయ్యే ‘ కొత్త షూసు’ కథ , వీ మల్లికార్జున్ గారు రాసిన ‘నల్లగొండ కథలు’ పుస్తకం లోనిది. ఇది ఆయన మూడవ కథాసంకలనం. 2020 సంవత్సరంలో రిలీస్ అయిన పుస్తకాల్లో, ఇది ఒక ఆణిముత్యం లాంటి పుస్తకం అని మనం చెప్పుకోవచ్చు. ఇరవై ఎనిమిది ఏళ్ల యువ రచయిత మల్లికార్జున్ గారు రాసిన ఈ పుస్తకంలో, 21 కథలున్నాయి. అన్నీ కథలు , నల్లగొండలో గడిపిన తన బాల్యాన్ని గుర్తుచేసుకుంటూ , అతి…